సుచీంద్రం.(మన ఆలయాలు-2.)
సుచి అంచే శుభ్రత,ఇంద్ర అంటే మనసు అని అర్ధ.అంటే మనసులోని కల్మషాన్ని తొలగించేప్రదేశమని అర్ధం.ఈదివ్యక్షేత్రం ఆవిర్భావానికి అత్రి,అనసూయదంపతులు కారణమని పురాణాలు చెపుతున్నాయి.
అహల్యగౌతములు,సీతారాములు,హనుమంతుడు,దుర్వాస,దత్తాత్రేయ,చంద్రభగవానుడు,నారదమహర్షి కొన్నాళ్ళు ఇక్కడ నివసించినట్లు నారదపురాణం ద్వారా తెలుస్తుంది.
అహల్యను తాకినపాపానికి ఇంద్రుడు ఇక్కడే తనచేతులను మరుగుతున్ననేతిలో ముంచి పాపరహితుడు అయ్యాడు.ఆకారణంచేత ఈప్రదేశానికి సుచీంద్రం అనేపేరు వచ్చింది.శిలగాఉన్నఅహల్య రాముని పాదం తాకింది ఇక్కడే,సీతాదేవిని అశోకవనంలో వెదుకుతున్న సమయంలో లంకానగరంలో పలుశృంగార దుృశ్యాలనుచూసిన పాపం హనుమంతుడు ఇక్కడే బాపుకున్నాడట.ఇక్కడే అనసూయ త్రిమూర్తులను బాలురుగా మార్చిందట.ఇప్పటికి ఇక్కడ 'ఉదయమార్తాండ'మండపంలో మరుగుతున్న నేతిలో చేతులు ఉంచి భక్తులు తమపాపాలను నిర్ములించమని స్వామిని వేడుకుంటారు. ఈకార్యక్రమానికి ముందురోజు ఉపవాసదీక్ష చేయాలి.యోగక్కారులు అనే ప్రత్యేకపురోహితులు ఈకార్యక్రమం జరిపిస్తుంటారు.ఈ ప్రదేశాన్నితను (శివుడు)మాళ్ (విష్ణువు)అయ్యన్ (బ్రహ్మ) కోనరాయాధినాధుడుగాఈ ఆలయాన్ని పిలుస్తారు.ఆదిశంకరాచార్యులువారు పరమేశ్వరుని ప్రసన్నంచేసుకుని ఈశ్వరుని తాండవ నృత్యం దర్శించగలిగారట.శివుడే స్వయంగా ఆదిశంకరులవారికి ప్రణవమంత్రాన్ని ఉపదేశించారట.
32స్ధంబాల'చంపకరమణ'మండపంలో రామాయణ,అనసూయ కథలు తెలిపే శిల్పాలు ఉంటాయి.గర్భగుడిపక్కగా ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి అష్టధాతువులతో స్వామి విగ్రహం ఉంటుంది.ఈవిగ్రహానికి నీళ్ళు తగలకూడదుకనుక స్వామికి అభిషేకం ఉండదు.టిప్పుసుల్తాన్, బానాసాహెబ్,చందాసాహెబ్ల దాడుల్లో ఈమండపంలోని చాలాశిల్పాలు తమ సౌందర్యవైభవాన్ని కోల్పోయాయి.ఇక్కడ ఒకే గ్రానైట్ చెక్కిన నాలుగు సంగీత స్ధంబాలు ఉన్నవి.మోదటి రెండుస్ధంబాలలో 33వంతున,మిగిలిన రెండింటిలో 25వంతున చిన్నచిన్నస్ధూపాలు ఉంటాయి.వీటిని చేతితో తడితే సంగీత పరికరాల శభ్ధాలువస్తాయి.వసంత మండపంగా పిలువబడే నవగ్రహమండపంలో 12 రాశులు,నవగ్రహాలు ఉంటాయి.మన్మధునిచే మనోవికారానికి లోనైన శివుడు సతీసమేతంగా ఇక్కడకువచ్చి తమమనసులు పరిశుధ్ధపరచుకున్నారట.ప్రపంచంలో ఎక్కడాలేనని'మాయాగణేషుని' విగ్రహం పదిచేతులలో పదిరకాల ఆయుధాలతో మనకు ఇక్కడ దర్శనంఇస్తాడు.ఆలయదక్షణ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణుల 'దారు కోవెల' చెట్టుకాండతో నిర్మితం కనిపిస్తుంది.ఈదేవాలయ గాలిగోపురం నూటముపై అడుగులఎత్తులో శిల్పసంపదరో విరాజిల్లుతుంది.ఇక్కడికి 8మైళ్ళదూరంలో కన్యాకుమారి ఉంటుంది.ఇక్కడి స్ధలపురాణం:కన్యాకుమారిని వివాహం చేసుకోవాలసిన పరమేశ్వరుడు కైలాసంలో బయలుదేరి వస్తుండగా ఇక్కడకు వచ్చేసరికి తెల్లవారిందట అప్పుడు స్వామి స్ధాణువుల నిలబడిపోయాడట, అందుకేస్వామి ఇక్కడ'స్ధానేశ్వరుడు'గా పేరుపొందాడు.బ్రహ్మచర్యవ్రతంలో స్వామి వేంచిసిన ఆలయంఇది.స్వామివారిని వెదుకుతూవచ్చిన అమ్మవారు స్వామినిచూసి తనుకన్యాకుమారిగా ఉండిపోయిందట. ఈఆలయంలో ప్రవేశానికి అధునాతన వస్త్రలను అనుమతించరు.ఇక్కడ స్త్రీ రూపంలోని గణపతికి'విఘ్నేశ్వరి అనేపేరున పూజలు అందుకుంటున్నాడు. విష్ణువు,సీతారామ లక్ష్మణులు,హనుమంతుడు వంటి ఎన్నో దేవతా విగ్రహాలు ఇక్కడ సందర్శించవచ్చు.
డా.బెల్లంకొండనాగేశ్వరరావు.