మధుర మీనాక్షి-మన ఆలయాలు-4. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మధుర మీనాక్షి-మన ఆలయాలు-4.

మధుర మీనాక్షి.(మన ఆలయాలు-4.)
మీనాక్షి అమ్మవారి ఆలయం తమిళనాడులోని మదురై పట్టణం ఉంది. మీనాక్షి దేవాలయం మదురైలో కల వేగాయి నది ఒడ్డున ఉంది. మదురై పట్టణం తమిళనాడులో రెండవ పెద్ద పట్టణం. తమిళనాడు రాష్ట్రసంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలు మొదలైనవాటికి నిలయంగా ఉంటుంది. ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మదురై అనేక రాజ వంశాల పాలనలు చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ధి పరచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు కలిగిన నగరం మధురై. ఆధ్యాత్మికతలలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్‌ ఆలయం ( మీనాక్షి అమ్మవారి ఆలం నిర్మించారు. ఈ గుడి ఆ కాలపు జీవనవిధానాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన శిల్ప, చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. దీని గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తవనఉంది.మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి దేవి చిన్న పాప రూపంలో భూమ్మీదకు వచ్చింది. ఆమెను పెళ్లాడటానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించాడు. అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పాలించసాగింది. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్ళి చేయడానికి వైకుంఠం నుంచి బయలు దేరుతాడు. అయితే సమయానికి రాలేకపోతాడు. స్థానిక దేవుడు పవలాకనైవాల్‌ పెరుమాళ్‌ ఈ వివాహం జరిపిస్తాడు. ఈ వివాహాన్నే ప్రతి ఏటా ‘చిత్తిరై తిరువళ’గా వేడుకగా నిర్వహిస్తున్నారు.ఈ ఆలయం 15 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయ గాలిగోపురం 160 అడుగుల ఎత్తు ఉంటుంది.ఆరవ శతాబ్ధంలో పాండ్యరాజైన కులశేఖరుడు తొలుత ఈ ఆలయనిర్మాణం చేసాడట.ఇక్కడ అమ్మవారు మీనాక్షిగా, అయ్యవారు సుందరేసుడుగా పూజింపబడతారు.వేయి స్ధంబాల మంటపం అద్బుతంగా ఉంటుంది.ఇక్కడ పుష్కరిణిలో అమృతం ఒకచుక్క ఒలికినందున 'మదుపురము'అని మొదట పిలిచేవారట.ఈ ఆలయంలో ఎనిమిది గోపురాలు ఉన్నాయి. సుందరపాండ్యన్‌, పరాక్రమ పాండ్యన్‌లు 13,14 శతాబ్దాల్లో తూర్పు, పశ్చిమ గోపురాలను, 16వ శతాబ్దంలో శివ్వంది చెట్టియార్‌ దక్షిణ గోపురాన్ని కట్టించారు. తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మీ మండపం ఉంటుంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి.
శైవ తత్వశాస్త్రానికి చెందిన తిరుజ్ఞాన సంబన్‌దార్‌ ఈ ఆలయం గురించి ఏడవ శతాబ్దంలో పేర్కొన్నాడు. అనంతం ఖిల్జీ సేనాన, మాలిక్‌ కపూర్‌ దీన్ని ఈ ఆలయాన్ని కూల్చివేశారు.ఈ దాడిలో గుడికి సంబంధించిన ఆనవాళ్లన్నీ ధ్వంసమైపోయాయి.16వ శతాబ్దంలో మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు ఈ గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. తరువాత తిరుమల నాయక రాజు దీని అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేశారు.
మీనాక్షి తిరుకల్యాణం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ. దీన్ని ఏటా ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.చిత్రాయి ఉత్సవం పదిరోజులు నిర్వహిస్తారు. దసరా నవరాత్రులలో 107 మంది ఆడపిల్లలను పూజకుపిలిచి అందరికినూతన వస్త్రాలు ఇవ్వబోతే 108 అక్కడ కనిపిస్తారు. ప్రతిసోమవారం సాయంత్ర అమ్మవారికి ప్రత్యేక పూజఉంటుందిఅప్పుడు అమ్మవారికి అత్యంత ఖరీదైన వజ్రపు ముక్కుపుడక ధరించేస్తారు. అద్బుత శిల్పసంపదకలిగిన ఈదేవాలయం నయనమనోహరంగా ఉంటుంది.
డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు