సురుటుపల్లి.మన ఆలయాలు-9.
ఆసక్తిదాయకమైన ఆధ్యాత్మిక ప్రసంగంవిన్నా,కమనీయదృశ్యంచూసినా,
వీనులవిందైనసంగీతంవిన్నా,మనస్సుపురివిప్పినమయూరంలా మారుతుంది.ఆపులకితహ్రుదయం విహాంగమై ఆధ్యాత్మిక ఉన్న తశిఖరాలపై ఆనందంతో పయనిస్తుంది.క్షీరసాగరమధనం జరిగినపుడు మంథరపర్వతం కవ్వంగా,వాసుకి తాడుగా దేవతలు,రాక్షసులు చిలుకుతుండగా,ఆబాధకు వాసుకి గరళాన్నివదలాడు.తననీడఅయిన సుందరునిద్వారా ఆగరళాన్ని తెప్పించుకుని, శివుడు తనగొంతుకలో నిల్పినపుడు కొద్దిపాటి మైకానికిలోనై సర్వమంగళాదేవి ఓడిలో తల పెట్టుకుని సేదతీరాడు.అలాసేదతీరుతున్న స్వామి మనకు "పళ్లికొండేశ్వరుడు"గా దర్శనమిస్తాడు.ఈక్షేత్రపురాణరీత్య సకలసుర గణాలకు శివుడు ఆనంద తాండవంచేస్తూ, కనిపించిన ప్రదేశంకనుక ఈఊరికి "సురుటుపల్లి"అనే పేరువచ్చింది. ఈఊరికి "సాంబయ్యశయనమందిరం"అనేపేరుకూడాఉంది.స్వామికి కావలిగా "తిండి-ముండి"అనేశివగణాలు ద్వారపాలకులుగాకనిపిస్తారు. ఈఆలయంలో మరోవిషిష్టతఉంది.అదిదక్షణామూర్తి అపురూపశిల్పం. సహజంగామనం జ్ఞానదక్షణామూర్తి, యోగదక్షణామూర్తి, వీణదక్షణా మూర్తి,మేధదక్షణామూర్తి,అనే పలురకాల దక్షణామూర్తులను చూస్తుంటాం.కానిఇక్కడ దక్షణామూర్తి,తనసతీదేవిని ఎడమభాగాన ఆలింగనం చేసేవిధగా కనిపిస్తాడు.మరెక్కడ సతీసమేత దక్షణామూర్తిని చూడలేము.పళ్లికొండేస్వరస్వామికి సమస్తదేవగణాలు ప్రదోషపూజలు చేస్తున్నట్లు కనిపిస్తారు.ఈఆలయంలో బ్రహ్మ,విష్ణువు, మార్కండేయ, నారదుడు,చంద్రుడు,కుబేరుడు,సూర్యుడు,అగస్త్యుడు,పులస్త్యుడు,గౌతముడు,తుంబురుడు,వసిష్ఠుడు,విశ్వామిత్రుడు,వాల్మీకి,దేవేంద్రుడు,సతులతో షణ్ముఖుడు,సంఘనిధి తనపత్ని వసుంధరతో,పద్మనిధితనసతి వసుమతితో, మరుదాంబిక, జ్వరాహమూర్తి, చేతిలోనిచిలుకతో జ్ఞానదుర్గ దర్శనంయిస్తారు. చండీకేశ్వరుడు,సప్తమాతలు,వాలికేశ్వరుడు,ఒకేరాతిలో నిర్మితమైన ఏకపాదమూర్తిని దర్శించుకోవచ్చు.రావణసంహార అనంతరం శ్రీరాముడు ఇక్కడలింగ ప్రతిష్ట చేసాడనిప్రతీతి.ఈఆలయంలోప్రదోషవేళ పూజల్లో త్రినేత్రునికన్నా నందికి ప్రతేక పూజలు,అభిషేకాలు జరుగుతుంటాయి.విషప్రభావంనుండి శివుడు కృష్ణపక్ష త్రయోదశి శనివారంరోజున తేరుకున్నాడట.అలాంటిరోజు మరలావస్తే, మహాప్రదోషకాలంలో సమస్తదేవగణాలు,స్వామిని సేవించడానికి వస్తాయని స్ధలపురాణం చెపుతుంది.సకలపాపహరం ఈఆలయ దర్శనం.చిత్తూరుజిల్లా,ఊత్తుకోట దగ్గరగా ఈదివ్యక్షేత్రంఉంది.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.