పాక శాస్త్రం - బన్ను

cooking

వంట ఆడవాళ్ళే వండాలి అనుకుంటాం. కానీ ఈరోజుల్లో బాచులర్సంతా 'సెల్ఫ్ కుకింగ్' చేసుకుంటున్నారంటే అతిశయోక్తి లేదు. వంట చేయటం బొత్తిగా రాకపోతే, రైస్ కుక్కర్లో అన్నం పెట్టేసుకుని, కూరలు 'కర్రీ పాయింట్స్' నుంచి తెచ్చేసుకుంటున్నారు. 'నల భీమ పాకం' అనే కాదు ఏ స్టార్ హోటల్లో నైనా 'చెఫ్' లు మగవారే!

వృత్తి రీత్యా నేనెంత బిజీగా వున్నా, వీకెండ్స్ లో వంట చేసి, అది మా కుటుంబ సభ్యులు తింటే నేను చాలా రిలాక్సవుతాను. అలాగే వేరే దేశం వెళ్ళినప్పుడు వీలైతే వంట వండి స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటాను.

మా ఆవిడ పెళ్ళైన కొత్తలో ఓ మాటంది. "వంటొచ్చిన మగాడితో కాపురం చేయటం కష్టం" అని! "ఎందుకు?" అనడిగాను. అందుకామె "వంటరాని వాళ్ళు బాగుంది లేక బాగోలేదు అని చెప్తారు. కానీ... వంటొచ్చిన వాళ్ళు ఇందులో ఫలానా పదార్ధం తక్కువైంది లేక కరివేపాకు దూసి వేయలేదు లాంటివి చెప్తారు" అని... నేను మనసులో నవ్వుకుని కరెక్టే అనుకున్నాను.

చాలామంది వంట చేయటం నామోషీగా ఫీల్ అవుతూ వుంటారు. మొన్నే ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి "ఏంటి సార్... మీరు వంట చేసి, వీడియో తీసి మరీ పెడుతున్నారు" అన్నాడు. "ఏం... పెట్టకూడదా?" అని అడిగితే... "అలా కాదండీ... మీరు డైరెక్టర్ కదా..." అంటూ నసిగాడు. నేను అతనికిచ్చిన సమాధానం ఏమిటంటే... "అక్షయ్ కుమార్ ఒక గొప్ప నటుడు. వంటల కార్యక్రమంలో పాల్గొనటం లో అతనికి తృప్తి వుందన్నాడు బాస్... నేను అక్షయ్ కుమార్ కన్నా గొప్ప వాడిని కాదులే" అన్నాను.

మనకి మనశ్శాంతి, తృప్తి నిచ్చే ఏ పనిచేసినా తప్పు లేదనే నా భావన!

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు