శ్రీ స్వామి వివేకానంద - సుధారాణి మన్నె

swami vivekananda biography
వివేకానందుని అభిప్రాయాలు వివిధ సమస్యల పై ఇలా తెలియ చేసారు.

జాతులు - ప్రజా పరిపాలన :---- బ్రాహ్మణులూ, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే ఈ నాలుగు జాతుల చేతను, క్రమముగా మానవ సంఘం పరిపాలింప బడుతుంది. అయితే అందరి పాలనలోనూ మంచి, చెడ్డలున్నాయి. బ్రాహ్మణులూ పరిపాలించేటప్పుడు యుక్తులను పురస్కరించుకుని సంకీర్ణత ఏర్పడగలదు. రక్షణొపాయాలన్ని వారి వద్ద వుంటాయి. తమకు తప్ప ఇతరులకు విద్య నేర్చుకునే అధికారం లేదు . విద్య నేర్పే అధికారం కూడా వారిదే. అయితే ఈ యుగంలో శాస్త్రాలన్నిటికి పునాదులేర్పడతాయి. బ్రాహ్మణులు ధీశక్తి మూలముగా పరిపాలన సాగిస్తారు కాబట్టి, ఆ ధీశక్తిని వికసింపచేసుకుంటారు .

క్షత్రియ పాలన కఠినముగాను, నిరంకుశముగాను వుంటుంది. అయితే వారికి సంకుచిత బుద్ధి మాత్రం వుండదు. కళలు ఈ యుగములో అభివృద్ధి చెందుతాయి.

వైశ్యుల పరిపాలన  నెమ్మదిగా రక్తాన్ని పీల్చి వేస్తూ అందరిని అణిచి వేస్తుంది. కాని వైశ్యులు అన్ని ప్రదేశాలు తిరిగిన వారు కావటం వలన గత రెండు యుగాలలోని భావాలు విరివిగా వ్యాప్తి లోకి వస్తాయి. అయితే వీరి పరిపాలనలో సామాజిక సబ్యత క్షీణిస్తుంది.
ఇక శూద్రుల పరిపాలనని కార్మికుల పరిపాలన అనవచ్చును. సభ్యత క్షీణిస్తుంది. సాదారణ విద్య బాగా వృద్ది లోకి వస్తుంది. అసాధారణ ప్రతిభ గల వారు ఈ యుగంలో విపరీతంగా తగ్గిపోతుంది .

బ్రాహ్మణ యుగంలోని జ్ఞానమూ - క్షత్రియ యుగం లోని సంస్కృతి -వైశ్య యుగంలోని ఆశయ వ్యాప్తి - శుద్రయుగంలోని సమత్వా - ధర్మమూ కలిపి దోషాలు లేకుండా ఉండేటట్లు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే అది అన్ని విధాల ఆదర్శప్రాయంగా వుంటుందనటానికి సందేహము లేదు. కాని ఇది సాధ్యమేనా?

అయిన మొదటి మూడింటి హయాము గడచిపోయింది. ఇప్పుదు నాలుగవ దానికే సమయము. శూద్రులు ఉచ్చ దశను పొంది తీరవలసి వున్నది. దీనినేవారు అడ్డగించ లేరు. వెండి, బంగారపు ప్రమాణాలను గూర్చిన చికులన్ని నాకు తెలియవు కాని సువర్ణ ప్రమాణం ధనికులను మరింత ధనికులు గాను, పేదలను మరింత పేదలు గాను చేయటం మాత్రం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. "బంగారాపు శిలువపై మేము కొరత వేయబడటానికి అంగీకరించం". అని బ్రయాన్ చెప్పిన మాట యదార్ధం. రజత ప్రమాణం ఈ విషయంలో విషమ సమరంలో పేద వారికి కొంత మంచి అవకాశమిస్తుంది. సామ్యవాదములొ లోపాలు వున్నాయి కాని, "లేని బావ కన్నా, గుడ్డి బావ మేలు కదా" అందుకని నేను సామ్యవాడిని.

ఇతర విధానాలను అవలంభించి చూడగా అవన్నీ లొపభూఇష్టాలు అని తేలింది. మరెందుకూ కాకపొయినా కేవలం క్రొత్తది మాత్రమే అని అయినా , ఈ మార్గాన్ని అనుసరించి చూద్దాము. ఎంత సేపూ కష్ట సుఖాలను ఒక్కరే అనుభవించటం కన్నా అందులో ఇతరులకు కూడా భాగస్వాములయ్యేటట్లు చేయటం మంచిదికాదా ? మొత్తంమీద లోకం లోని మంచి చెడ్డలు ఎప్పుడు ఒక్కటే. మరేమీ కాని వాడు ఈ కొత్త విధానం వాళ్ళ" బండి కాడి "ఒక పశువు మెడ నుంచి, రెండవ పశువు మేడమీద కెత్తబడినట్లవుతుంది. దుఃఖాలకు నిలయమైన ఈ ప్రపంచములో ప్రతి మానవుని, ప్రతి జంతువునూ, తన ఉచ్చ దశను అనుభవించనీయండి. ఆఖరుకు ఈ సంసారాన్ని, ప్రభుత్వాలను బాధలను విడిచిపెట్టి అందరూ పరమేశ్వరుని దరిచేరటానికి సౌఖ్యమనే అనుభవాన్ని పొందనీయండి .

విద్యా వ్యాప్తి గురించి ఇలా అన్నారు -----
జన సామాన్యములో విద్యాబుద్ధులు వ్యాప్తి చెందిన కొద్ది మన భారతావని అభివృద్ధి చెందగలదని నాకు స్పస్టముగా కనిపిస్తుంది. రాజాధికారముతోను, అభిజాత్యం తోనూ ఎవరో కొద్ది మంది విద్యనంతనూ తమ వంశములో వుంచుకోవటమే హక్కుగా భావించటమే మన దేశ పతనానికి మూల కారణం. మనం తిరిగి ఎప్పటికైనా అభివృద్ధిలోకి రావాలంటే సామాన్య ప్రజలలో విద్యా వ్యాప్తి జరగటమే మార్గం. సంఘ సంస్కారాన్ని గురించి అర్ధ శతాబ్దం పైగా గద బిద జరుగుతోంది. ఎన్నో సంఘ సంస్కార సమాజాలు బయలుదేరాయి. కానీ పెద్ద మనుష్యులుగా చలామణి అయ్యేవారు, ఎవరి రక్తాన్ని పీల్చి పెద్ద మనుష్యులు అయ్యారో ఆ సామాన్య జనుల్ని ఉద్ధరించే సమాజం ఒక్కటే నాకు కనిపించట్లేదు.

నేను యూరప్ లో పర్యటించేటప్పుడు అక్కడ నిరుపేదలకు సైతం కల సౌకర్యాలు, విద్యాబ్యాస సదుపాయాలు చూసి మన ఈ దీనావస్తకు కన్నీరు కార్చ వలసి వచ్చేది. ఈ తారతంయానికి కారణమేమిటి?, విద్య, ఆత్మా విశ్వాసాల వల్ల వారిలోని అంతర్గత బ్రహ్మము మేల్కొంటు వుండగా మనలోని బ్రహ్మము నిద్రిస్తున్నది. భూమి, లేక చేతిలో డబ్బులు లేక, ఐర్లాండ్ దేశము నుండి అమెరికాకు వలస వచ్చిన వారిని నేను చాలా మందిని చూసాను. అల వలస వచ్చిన వ్యక్తే ఆరు నేలలయ్యేసరికి పూర్తిగా మారి పోయి సంపన్న గృహస్తుడయ్యేవాడు. ఇందుకు కారణం మానవుడు సర్వాన్ని సాదించగలడన్న ధైర్యాన్ని ఆ దేశం కలిగించటమే.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి