వసంతపంచమి తేదీ 05. 02. 2022 న (శనివారం) సాయంత్రం 5 గంటలకు అమరావతి, ఎస్ ఆర్ నగర్, హైదరాబాద్ లో కార్టూనిస్టుల మధ్య జరిగిన సమావేశంలో ''జి ఎస్ ఆర్ రచనలు" పుస్తకావిష్కరణ జరిగినది. ప్రసిద్ధ కార్టూనిస్టులు, గో తెలుగు సంపాదకులు శ్రీ బన్ను గారు మరియు కో ఆపరేటివ్ బ్యాంకు బ్రాంచి మేనేజర్ శ్రీ ప్రసిద్ధ గారు పుస్తకావిష్కరణ గావించారు. రచయిత శ్రీ జి ఎస్ ఆర్ (శ్రీ గట్టుపల్లి సీతారామారావు) గారిని కార్టూనిస్టు శ్రీ నందనవనం సురేంద్రనాధ్ గారు శాలువాతో సత్కరించారు. శ్రీ ఏ ఆర్ సుధాకర్ గారు విందు అందించారు. ఇంకా ఈకార్యక్రమంలో ప్రసిద్ధ కార్టూనిస్టులు శ్రీ జాకీర్ గారు, శ్రీ వాడ్రేవు గారు, శ్రీ ప్రభాకర్ గారు, శ్రీ వరప్రసాద్ గారు, శ్రీ ఈడూరి గారు, శ్రీ ప్రసాద్ కాజా గారు, తదితరులు పాల్గొన్నారు.