నారం శెట్టి సాహిత్య పీఠం మరియు ఉత్తరాంధ్ర రచయితల వేదిక 20/02/2022 న విజయనగరంలో తిరుపతి రచయిత ఆర్సీ కృష్ణస్వామి రాజుకు పురస్కారం అందించారు. పార్వతీపురం నారంశెట్టి బాలసాహిత్యపీఠం వారు ఇటీవల నిర్వహించిన పోటీలో ఆయన రచించిన “రాజు గారి కథలు” బాలల పుస్తకం ఉత్తమ గ్రంథంగా ఎంపికయ్యింది. ఈ కార్యక్రమంలో సాహిత్య పీఠం ఆధ్యక్షుడు నారంశెట్టి ఉమామహేశ్వర రావు, కార్యదర్శి గుడ్ల అమ్మాజీ, సినీ గేయ రచయితలు వడ్డేపల్లి కృష్ణ, ఎం.భూపాల్ రెడ్డి, చిత్రకారులు బాలి, తుంబలి శివాజీ, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత బెలగాం భీమేశ్వర రావు, ఇతర సాహితీ ప్రియులు హాజరయ్యారు.
ఆర్సీ కృష్ణస్వామి రాజు