హార్డ్ వర్కర్స్ - స్మార్ట్ వర్కర్స్ దీని వ్యత్యాసం మీకు తెలుసా? చాలామంది 'బాస్' లు హార్డ్ వర్కర్స్ ని కోరుకుంటారు. అతనొక్కడే స్మార్ట్ గా పనిచేయాలి... ఎంప్లాయిస్ 'హార్డ్ వర్క్' చేయాలి అని అతని వుద్దేశ్యం! ఎంప్లాయిస్ స్మార్ట్ గా పనిచేస్తే అతన్ని డామినేట్ చేస్తారనే భయం! అది తప్పు!! బాస్ కి 'సెకండ్ లైన్' లో పనిచేసే వాళ్ళు స్మార్ట్ గా పనిచేయాలి. 'రాజు' కన్నా 'మంత్రి' స్మార్ట్ గా వుండాలన్న మాట! రోజుకు ఒక్క గంట ఉద్యోగస్తులను 'మోటివేట్' చేసి 8 గంటల్లో మంచి 'అవుట్ పుట్' రాబట్టవచ్చు!
'జాకీచాన్' లేక 'బ్రూస్లీ' సినిమాలు చూస్తే వాళ్ళు టెక్నిక్ గా ఫైట్ చేస్తారు. అంటే 'స్మార్ట్' గా చేస్తారు. వాళ్ళు 'హార్డ్ ఫైటింగ్' చెయ్యరు. ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ "హార్డ్ వర్కర్స్ అందరూ స్మార్ట్ వర్కర్స్ అయిపోతారంటే... ప్రతీ కూలివాడూ అమితాబచ్చన్ అయినట్టే" అన్నారు. ప్రయోజనం లేకుండా కష్టపడితే అర్ధం లేదు. ఆలోచించి అడుగులేస్తేనే ప్రయోజనం వుంటుంది.
"బాస్" ఒక్కడే స్మార్ట్ వర్కరై వుంటే సరిపోదు - అతని 'సెకండ్ లైన్' లో వున్నవాళ్ళు కూడా స్మార్ట్ వర్కర్స్ ఐతేనే "సంస్థ" ముందుకు నడుస్తుంది.