అధ్భుతమైన అమెరికా విద్యావిధానం - హైమా శ్రీనివాస్

Education in America

మనదేశంలో లాగే అమెరికా ప్రభుత్వం కూడా ఉచిత ప్రాధమిక పాఠశాలలను ఏర్పరచింది. వీటిని’ పబ్లిక్ స్కూ ల్స్ ‘ అంటారు. ఇక్కడ ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళ ఫీజులు సామాన్యులు భరించలేనంత గా ఉంటాయిట!. అమేరికాలోని పాఠశాలలు వేసవి శలవుల జూన్ రెండో వారం నుంచీ ఆగస్ట్ నెల మూడవ వారం వరకూ ఉంటాయి. పాఠశాల ప్రారంభించేనాటికి 6సం.వయస్సు పూర్తై ఉండాలి,  అంటే అక్టోబర్ తర్వాత పుట్టిన వారు పబ్లిక్ స్కూల్లో ప్రవేశానికి మరో ఏడాది ఆగక తప్పదు . 3-6 సం. పిల్లలను ప్లేక్లాస్లో,లేదాకిండర్  గార్డె న్ క్లాస్లో అడ్మిట్ చేయవచ్చు. పిల్లలకు 5వ గ్రేడ్ పూర్తయ్యేసరికి 10 సం . నిండి వుంటాయి. హైస్కూల్ చదువు అంటే 12వ గ్రేడ్ పూర్తయ్యే వేళకు 17-18 సం . వయస్సులో ఉంటారు. 12స.పాటు 12 గ్రేడ్స్ [ క్లాసులు] తప్పని సరిగా పూర్తి చేస్తేనే డిగ్రీలో ప్రవేశం లభిస్తుంది. 5 సం. ప్రైమరీ స్కూల్లోనూ, 3సం.మిడిల్  స్కూల్లోనూ, 4సం. హైస్కూ ల్లోనూ చదివితేనే వారికి ఇతర డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.

కాలేజ్ లో మొదటి సం. ఫ్రష్ మ్యాన్ సంవత్సరమనీ , రెండో సంవత్సరాన్ని సొఫోమోర్ ఇయరనీ, మూడో సం. జూనియర్ ఇయర్ అనీ, 4వసం. సీనియర్ ఇయర్ అనీ వ్యవహరిస్తారు. కాలేజ్ లోని ఈ విద్యా విభాగాన్ని అండర్ గ్రాడ్యుయేట్ స్కూల్ అంటారు. ఈ విద్యా ర్ధులవయస్సు సాధార ణంగా 18-22సం.మధ్య ఉంటుంది . గ్రాడ్యుయేషన్ కోర్సులో వయస్సు పరిమితి అంతగా లేదు . గ్రాడ్యు యేట్ డిగ్రీ కాలేజ్ లో  సాధారణంగా మాస్టర్ డిగ్రీ కోర్స్ ‘M.B.A., M.S. కానీ  డాక్టరేట్  Ph.D.,  J.D.,  M.D. కానీ , ఉంటాయి. ఈ చదువు మాత్రం బాగా ఖర్చుతోకూడినదే! ఐతే ప్రభుత్వం ఎడ్యకేషన్ లోన్ ఇస్తుంది. ఉద్యోగంలో చేరాక నెలకింత అని కట్టేయాలి.

అమేరికా జనాభా సేకరణ ప్రకారం 85% మంది మాత్రమే హైస్కూల్ విద్య పూర్తిచేశారు.27% మాత్రమే డిగ్రీ వరకూచదివారు. ఐతే అమేరికాలో అక్షరాస్యుల సంఖ్య మాత్రం 99% వరకూ ఉన్నట్లు ఆదేశజనాభా సేకరణ ననుసరించి వెల్లడైంది. అమెరికా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులపట్ల తీసుకునే శ్రధ్ధ మాత్రం చాలా అద్భుతం గా, గొప్ప గా ఉంటుంది. చిన్నపిల్లలపట్ల ముఖ్యంగా  విద్యార్ధు లు, అందునా వికలాంగ విద్యర్ధుల పట్లవారుచూపే ప్రత్యేక శ్రధ్ధ  చాలాప్రత్యేక మైనది.

అమేరికాలో ప్రతి కమ్యూనిటీకీ  ఒక పాఠశాల ఉంటుంది . ఆకమ్యూనిటీ చెల్లించే ఆస్థి పన్నును పాఠశాల సౌకర్యాలకూ, టీచర్ల జీతాలకూ వినియోగిస్తారు. కమ్యూనిటీ సంపన్న మైనదైతే పాఠశాలస్థాయి గొప్పగా ఉంటుంది. అలాంటి కమ్యూనిటీ స్కూళ్ళలో విద్యార్ధులకు ఫస్ట్ గ్రేడ్ నుండీ ఐప్యాడ్స్ ఇస్తారు.  కొందరు తల్లిదండ్రులు ఖాళీగా వున్నసమయాన్ని తమపిల్లలు చదివే పాఠశాలలో సేవలకోసం వినియోగిస్తారు. ఇది సేవ మాత్రమే ! జీతం చెల్లించరు. వీరిని' వాలంటీర్సు ' అంటారు. పాఠశాల ప్రాధమిక, మాధ్యమిక,   హైస్కూ ల్  గా అంచెలంచెలుగా ఉంటుంది . ప్లేక్లాస్ నుండీ 4వ గ్రేడ్ వరకూ ప్రాధమిక పాఠశాలగానూ [ఎలిమెంటరీ],6నుండీ 8వగ్రేడ్ వరకూ మాధ్యమిక పాఠశాలగా నూ [మిడిల్].  9నుండీ 12 వగ్రేడ్ వరకూ హైస్కూల్ గానూ పిలు స్తారు. ఇక్కడ 12వ గ్రేడ్లో బోర్డ్ పరీక్ష లేవీ ఉండవు. ఇక్కడిప్రతిపాఠశాలకు వారు రూపొందిం చుకున్న’ కరికులమే’ ఉంటుంటుంది.భారతదేశంలో వలె జిల్లా, రాష్ట్ర స్థాయిలలో కామన్ పరీక్షలు ఉండవు. మూడేళ్ళ ప్రీ స్కుల్ తర్వాత గ్రాడ్యుయేషన్ ఉంటుంది.అంతవరకూ పిల్లలు నేర్చిన ప్రావీణ్యం పొందిన రంగాల్లో ప్రదర్శన , అధ్యయనం చేసిన అంశాల్లో వారి ప్రత్యేకతలు, ప్రెజెంట్ చేస్తారు. ప్రతి  2,3  నెలలకూ  తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తారు . వారి పిల్లలమనస్థత్వం,  ఏ అంశాల్లో వారు ఇష్టతను చూపుతున్నారో ఆ అంశాల గురించీతల్లిదండ్రుల తో చర్చిస్తారు. ప్రీస్కుల్ పూర్తయ్యేరోజూన’  గ్రాడ్యుయేషన్ ‘ రోజుగా ఆపిల్లల గురించిన మూడేళ్ళ ప్రవర్తనా తీరుతెన్నులను పేరెంట్స్ తో ముచ్చటిస్తారు.

ఇక 1నుండీ 4వగ్రేడ్ అయ్యాక గ్రాడ్యుఏషన్  ఉంటుంది. సర్టిఫికేట్స్ ఇస్తారు. ఆతర్వాతమిడిల్ స్కూల్ , ఆ పైన హైస్కూల్ ఇలా గ్రాడ్యు యేషన్ సర్టిఫికేట్స్ అందజేస్తారు.ప్రతి అంశంలో వారు సాధించిన ప్రగతిని దానిలో పొందు పరుస్తారు. పిల్లలందరికీ డ్రాయింగ్, పెయింటింగ్ , మ్యూజిక్ , డ్యాన్స్ లలో ప్రత్యేకశిక్షణ అందజేస్తారు. పిల్లలచేతే కొన్ని ప్రాజెక్ట్స్ చేయిస్తారు.  విద్యార్ధులుబాగాహుషారు గా వున్నట్లైతే  వారు వారికి ఇష్టమైన ఏ అంశంలోనైనా వేసవిలో ప్రేత్యేక కోర్సులుచేయవచ్చు. ప్రతి గ్రేడ్ లోనూ అదేక్లాస్లోకూర్చోవా ల్సినపనిలేదు .ఎలాగంటే ఒక’ జేంస్ ‘అనే విద్యార్ధి వున్నాడనుకుందాం , అతడు 9వ గ్రేడ్ పాఠ్యాంశాలు వేసవిశలవుల్లోపూర్తిచేసేస్తే, 10 వ గ్రేడ్ పాఠ్యాంశాలు బోధించే తరగతిలో కూర్చో వచ్చు. ఇక్కడ ఉపాధ్యాయు లు మారరు. ఒకేతరగతి గదిలో కూర్చునిపాఠాలు బోధిస్తుండగా విద్యార్ధులే  తమ కోరిక మేరకు తమకు ఇష్టమైన అంశం బోధించే తరగతిలో కూర్చోవచ్చును. విద్యార్ధులు ఒక రోజున 9వగ్రేడ్ ఆంగ్ల భాషాబోధనా తరగతిలో కూర్చుంటే , రెండవరోజున , గణితబోధనా తరగతి లో,ఆమరునాడు కెమిస్ట్రీ, ఆతర్వాతరోజు , ఫిజిక్స్ అలా చూజ్ చేసుకుని అటెండ్ అవవచ్చును. స్కూల్ లో ప్రవేసించగానే హాజర్ లో నమోదవుతాడు .ఆతర్వాత ఏతరగతిలో కూర్చున్నా అక్కడ కూడా హాజరు నమోదవుతుంటుంది. ప్రతి తరగతిలో 20 నుండీ  22 వరకూ మాత్రమే విద్యార్ధులు ఉంటారు . ప్రతి విద్యార్ధిని గురించీ  టేక్ కేర్ చేయను ఒక కౌన్సిలర్ ఉంటారు. పిల్లల కు ఆరోగ్యం సరిలేనపుడు  వైద్య సదుపాయం కలిగించను, ఏ ఇతర అవసరాలైనా  తెల్సుకుని సాల్వ్ చేయను కౌన్సిలర్ సహకరిస్తారు . విద్యార్ధి  చరిత్ర  అంతా ఆ ఉద్యోగి కంప్యూటర్లో నమోదై ఉంటుంది.

స్కూల్  ఫంగ్షన్స్ జరిగేప్పుడు పిల్లల తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా ఫోటోలు వీడియోలు తీయకూడదు. అదినేరం! ముందుగా తలిదండ్రుల ఆమోదం వ్రాతమూలకంగా పొందాకే ఫోటోలు తీసుకోవాల్సిఉంది. కౌన్సిలర్ విద్యార్ధుల ప్రోగ్రెస్ నమోదు చేసి ఏసలహా కానీ, ప్రత్యేక శ్రధ్ధకానీ తీసుకోవల్సి వస్తే అటు ఉపాధ్యా యులకూ, ఇటు పేరెంట్స్ కూ సహకరిస్తారు, సలహాలిస్తారు . ఏవిద్యార్ధిని గురించికానీ  వారిప్రోగ్రెస్, నడ వడి గురించి మంచైనా,  చెడైనా కానీ ఉపాధ్యాయులు సైతం ఎవ్వరితో నైనాచర్చించడమూ నేరమే!! పేరెంట్స్ పర్మిషన్ తోనే అదీవ్రాత పూర్వకంగా ఉంటే నే ఓపెన్ గా మాట్లాడటం కుదురుతుంది. ఉపాధ్యా యు లైనా విద్యార్ధి బాధపడే విధంగా మాట్లాడటం, దండించడం నేరమే!

ఇక లేట్ మార్క్ అంటే పాఠశాల అసెంబ్లీ అయ్యాక ఎంటరైతే ఒక లేట్ మార్క్ , దాన్ని 'టాడీ ' అంటారు. అలాంటివి మూడు టాడీలు పడితే ' డిటెన్షన్ ' అంటే తన తరగతి గదిలోకాక వేరే, దానికోసం ప్రత్యేకించిన గదిలో కూర్చుని ,తన తరగతి విద్యార్ధు లకు ఇచ్చే పని  పూర్తి చేయాలి.అదే పనిష్ మెంట్ ! అంటే వేరే కూర్చో డమే శిక్ష అన్నమాట! అలా ఆ పని పూర్తిచేయకపోతే శని వారం స్కూల్ కెళ్ళి ఆచదువు పని పూర్తిచేయాల్సి ఉంటుంది . అందుకే లేట్ గా వెళ్ళడం జరగదు. అనారోగ్యకారణాల వలన ఐతే పేరెంట్శ్ వచ్చి లేట్ రిజిస్టర్ లో సంతకం చేసి పిల్లలని వారి గదిలో దింపాల్సి ఉంటుంది.

ప్రతి తరగతికీ ప్రతిరోజూ 8 పిరీయడ్స్ ఉంటాయి.ఉదయం 9గం స్కూల్ మొదలవుతుంది. మధ్యాహ్నం 3.30 కి పూర్తవు తుంది. హైస్కూల్ కుమాత్రం  55ని.పీరియడ్ తో ఉదయం 8గం.మొదలై 3.30 ని.కు స్కూల్ సమయం ముగుస్తుంటుంది. విద్యార్ధులకు లంచ్ హాల్ ఉంటుంది,4,5,6 పీరియడ్స్ లో ముందు చిన్న తరగతులకూ, ఆతర్వాత అలా పైతరగతులకూ ఒక్కోపీరియడ్ లో లంచ్ టైం ఉంటుంది.

కొందరు విద్యార్ధులకు ఏ.డి.డీ.అంటే’ ఎటెన్షన్ డిఫెక్ట్ డిజార్డర్  ‘ లేదా ఏ.డ్ హెఛ్.డి.అంటే’ ఎటెన్షన్ హైపర్ యాక్టివ్ డిజార్డర్’ --ఒకటి పాఠ్యాంశాలపై ఏకాగ్రత చూపలేని విద్యార్ధులైతే మరొక రకం ఎక్కువ ఏకాగ్రతతో ఉండేవారన్న మాట --వీరిగురించీ పర్యవేక్షించి  సొలూషన్స్ చెప్పను  ప్రతి పాఠశాలకూ  ఒక సైకాలజిస్ట్ , వైద్యుడు  ఉంటారు. వారు ఊరికే తరగతికి వచ్చి  మాట్లాడుతూ  పిల్లల మనస్తత్వాన్ని పరిశీలించి పేరెంట్స్ కు  ప్రత్యేక సమావేశంలో  వారి పిల్లల గురించిన విషయాలు తెలి య జేసి,తగుసలహాలు సంప్ర దింపులు జరుపుతారు. ప్రతి  విద్యార్ధికీ మెడికల్ రిపోర్ట్ వాని మిగతా విషయాలకు జతచేసి ఉంటుంది. ఒకబిడ్డపాఠశాలలోఅడ్మింట్ అవగానే ,రోజువారీ హిస్టరీ అంతా నమోదవుతుంటుంది . రోజువారీ ఏఏ కార్యక్ర మాల్లో , ఎవరితోకల్సి ఆడారో , ఏఏగదుల్లో ఏకార్య కలాపాలలో పాల్గున్నారో తయారు చేసి, పేరెంట్స్ కు ప్రింట్ తీసి ఇస్తుం టారు.పాఠశాల ల్లో సోషల్ వర్కర్స్ అనే ఉద్యోగులుఉంటారు. వారు ప్రతి విద్యార్ధినీ పరిశీలిస్తూ ఉంటారు.ఏదైనా దెబ్బలు, లేదా కాలిన తెగిన గుర్తులు ఉంటే పిల్లలను అడుగుతారు. ఆతర్వాత పేరెంట్స్ ను అడుగుతారు.ఇద్దరిసమాధానాలూ ఒకేల ఉంటే సరి,లేదా పేరెంట్స్ పని సరి!పెద్దలేవరైనా పిల్లల్ని తనపిల్లలనైనాసరే కొట్టినగాయాలు కనిపిస్తే పోలిస్ రిపోర్టిస్తారు. ఇహ పోలీస్ అంటే’ కాప్స్ ‘రంగప్రవేశం చేశారంటే పేరెంట్స్ గతి నిర్గతే నన్నమాట! పిల్లలకంత ప్రాధాన్య ఎందుకంటారు? అక్కడ --నాపిల్లలూ ,నీపిల్లలూ, మనపిల్లలూ కొట్టుకుంటున్నారనే ‘--విధానం ఉండటం వల్లేమో  కాప్స్ పిల్లల శరీరాలపై పేరెంట్స్ కొట్టిన గాయాలైతే సహించరు. వారిని కష్టపెట్టే మాటలూ అనరాదు.పిల్లలుకానీ మా అమ్మో నాన్నో కొట్టారనో, తిట్టారనో 991 అనే నెం.కు ఫోన్ చేసినా వెంటనే దూకుతారు. ఇహ జైలే గతి.ఇదిమాత్రం మన ఇండియన్ పేరెంట్స్ కు కాస్త బాధాకరం. ఆమధ్య ఒక ఇండియన్ ఫామిలీ అమేరికా వచ్చి పిల్లల్ని అక్కడి కమ్యూనిటీ స్కూల్ లో చేర్పించారు. వారి ఎనిమిదేళ్ళ పిల్లాడు బయట తిట్లు [బూతులు మాటలు ]విని   ఇంట్లో వాడటంతో వద్దని ఎంతచెప్పినా వినకపోడంతో వాడితల్లి కొట్టిందిట! వాడు స్కూల్ కెళ్ళినపుడు  అక్కడి సోషల్ వర్కర్ అదిగమనించి ఈమారు కొడితే 991 కు ఫోన్ చేయమని చెప్పగా వాడు మళ్ళా అవే చెడ్డమాటలు వాడే సరికి వాళ్ళ అమ్మ కోప్పడగానే ఆమె ఎక్కడోపని చేసుకుంటుండగా వాడు 991 కు ఫోన్ కొట్టాడు.అంతే వెంటనే కాప్స్ అదే పోలిస్ వచ్చారు హారన్ వేసుకుంటూ ,తమ వ్యాన్ లో ఆమెను ఎక్కించుకుని పోయారు. కమ్యూనిటీ వాసులంతా గమనించారు ,ఆతర్వాత  ఆమె ఎలాగో విడుదలై వచ్చి ,తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని మర ణించింది. ఇలాంటివి చాలా బాధాకరమైనవి.

అమేరికాలో కాలేజ్ చదువు చాలా ఖర్చుతోకూడినది. అందుకే ఎక్కువమంది పెద్ద కళాశాల చదువులు చదవ లేరు.16 సం. వయస్సు నిండగానే తమపేరెంట్స్ నుండీ విడుగాపోయి జీవించాలి.లేకుంటే అసమర్ధులుగా జమ చేసి ఏ అమ్మాయీ పెళ్ళి చేసు కోదు.16సం. కు హైస్కూల్ చదువు మాత్రమే  పూర్తవుతుంది.ఆపైన చదవాలంటే ధనికులైన పేరెంట్స్ ఐతే సపోర్ట్ చేస్తే కాలేజ్ చదువు ఇంజనీరింగ్ , మెడికల్ కోర్సులు చదవగలరు. లేదా ఏదో జాబ్ చేసుకుంటూ చదువుకుంటారు. ఇంచుమించు  ప్రతికమ్యూ నిటీకీ ఒక కాలేజ్ ఉంటుంది.దాన్లో చేరితే తక్కువ ఖర్చుతో డిగ్రీలు పొందవచ్చు.ప్రతి జిల్లా వేరు వేరు ' క్యాన్ టీస్ ' గా విభ జించబడి ఉంటుంది.ప్రతి క్యాన్ టీ కాలేజ్ లో ఆలోకల్ విద్యార్ధులు తక్కువఖర్చుతో చదువుకోవచ్చు. ఏకాలేజ్ లో ఐనా 15 గం అంటే 5పీరి యడ్స్ కు తీరినపుడు హాజరైతే ఒక సెమిస్టర్ పూర్తవుతుంది . ఒక్కోక్లాస్ 3గంఉంటుంది .  అలా 5 క్లాసులు 15 గం లకు ఒక సెమిస్టర్ అన్నమాట!  అందువల్ల ఉద్యోగాలు చేసుకుంటూ ప్రైవేట్ గా ఏకోర్స్ ఐనా చేయవచ్చు. రాత్రులు సైతం కాలేజ్ తరగ తులు జరుగుతుంటాయి.  శ్రధ్ధ ,డబ్బు ఉన్నవారు ఎంత చదువైనా చదవొచ్చు, ప్రభుత్వం కూడా లోన్స్ ద్వారా చాలా సహక రిస్తుంది.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు