యన్ సి సి యఫ్ వారు నిర్వహించిన మొట్టమొదటి కార్టూన్లపోటీ జయప్రదమైంది. **** శుభకృత్ ఉగాదిసందర్భంగా నార్త్ కోస్టలాంధ్ర కార్టూనిస్టులఫోరమ్ వారు "హాస్యానందం" వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్టూన్లపోటీ ఘనవిజయం సాధించింది. ఇది యన్ సి సి యఫ్ వారి మొట్టమొదటి పోటీ. మార్చి2022 నెల హాస్యానందంలో ఈ పోటీగురించి ప్రకటించగా వివిధ రాష్ట్రాలనుంచి 60 మంది 156 కార్టూన్లు పంపించారు. వాటిలో 10 ఉత్తమమైనవి మరియు 5 జ్యూరీ ఎంపికచేసినవి మొత్తం 15 మందికి బహుమతులను 27-3-2022 నాడు ప్రకటించడం జరిగింది. విజేతలకు 20-5-2022 తెలుగుకార్టూనిస్టుల దినోత్సవంనాడు హైదరాబాదులో హాస్యానందం వారి తలిశెట్టిఅవార్డు ఫంక్షన్ లో నగదుబహుమతులు, ప్రశంసాపత్రాలను మరియు మెమెంటో లను ముఖ్యఅతిథులద్వారా అందజేయడం జరిగింది. యన్ సి సి యఫ్ బృందం తరఫున శ్రీ టిఆర్ బాబుగారు మరియు శ్రీ శర్మగార్లు పాల్గొన్నారు. అందరూ మెచ్చుకున్నవిధంగా మెమెంటోలను చక్కగా తన వ్యక్తిగతశ్రద్ధచూపించి తయారుచేయించిన మన యన్ సి సి యఫ్ సభ్యులు శ్రీ జగన్నాధ్ గారికి కృతజ్ఞతలు. మెమెంటో చిరస్మరణీయంగా ఉన్నందుకు విజేతలందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.. మెమెంటో పై విజేత ఫోటోను కూడా ముద్రించడం హైలైట్ . ఈ పోటీలో ముందునుంచీ తగు సలహాలనిచ్చిన యన్ సి సి యఫ్ సభ్యులందరకూ ధన్యవాదాలు. ఈ పోటీ నిర్వహణలో ముఖ్యపాత్రవహించిన శ్రీ టి ఆర్ బాబుగారికి, శ్రీ శర్మగారికి మరియు శ్రీ లాల్ గారికి ధన్యవాదాలు. ఈ పోటీకి స్ఫూర్తిని, పూర్తి సహాయసహకారాలందించిన హాస్యానందం ఎడిటర్ శ్రీ రాము గారికి హృదయపూర్వక అభినందనలు. న్యాయనిర్ణేత శ్రీ మేడా మస్తాన్ రెడ్డిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మొట్టమొదటి పోటీ జయప్రదంగా జరిగి అందరిమెప్పుపొందినందుకు ..ఇంకా ఎన్నో పోటీలు భవిష్యత్తులో నిర్వహించడానికి మా యన్ సి సి యఫ్ వారికి స్ఫూర్తినిచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. లాల్ వైజాగు యన్ సి సియఫ్ తరఫున 25-5-2022