రెండవ ప్రపంచ యుద్ధం లో హిట్లర్ అనుసరించిన ఒక యుద్ధ రీతిని బ్లిట్జ్ క్రీగ్ అని పేరు. అంటే మెరుపు దాడి అని చెప్పవచ్చు. మొదట్లో ఈ విధంగా అనుసరించిన యుద్ధ రీతి లో హిట్లర్ సేనలు అపారమైన విజయాన్ని సాధించాయి.
ఒకే వద్ద విపరీతమైన సైనిక శక్తి తో శత్రు సైన్య బలాన్ని బద్దలు కొట్టి శత్రువు తేరుకునే లోపల చావుదెబ్బ కొట్టేవారు జర్మన్స్.
శత్రువు బలంగా వున్న ప్రాంతాన్ని వదిలేసి, బలహీనంగా వున్నా చోట దాడి చేసే వారు. ముందుగా అటువంటి ప్రాంతాన్ని గుర్తించి అక్కడ ఒకేసారి పాన్జెర్స్ అనబడే యుద్ధ ట్యాంక్ లను వందల సంఖ్యతో దాడి మొదలు పెట్టే వారు. వాటి వెన్నుదన్నుగా ఆర్టిల్లరీ { ఫిరంగులు } వచ్చేది. ఆ పిమ్మట ఎదురయ్యే శత్రువుల బంకెర్ల ను డైవ్ బాంబర్లు తో తుత్తునియలు చేసే వారు. ఈ విధానాన్ని మొదటగా హిట్లర్ కనుక్కున్నాడు. ఇది బ్లిట్జ్ క్రీగ్ ,యుద్ధ రీతిలో చాల ముఖ్యమైనదని చెప్పవచ్చు.
ఇదంతా చాలా వేగంతో కూడింది. ఎంతలా అంటే ,ముందు వేపున్న శత్రు సైన్యానికి వెనకున్న వారితో సంబంధాలు తెగిపోయి, పూర్తిగా ఏమీ అర్థం కానీ స్థితి లోకి పడి ,తిరుగు దాడి చేసేలోపు మరింత లోపలి కి చొచ్చుకెళ్లి వారం పాటు జరిగే ఆక్రమణ ఒక్క రోజులో ముగించేవారు. అప్పుడు వెనక వస్తున్న సైన్యం, అప్పటి వరకూ గెలిచిన ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకునే వాళ్ళు.
బ్లిట్జ్ క్రీగ్ అనగానే వేలాది ట్యాంక్స్ ఒక్కసారిగా శత్రువుల దుర్భేద్యమైన బలాన్ని తునాతునకలు చేస్తాయనుకుంటారు..
కానీ నిజం వేరేగా వుంది. నిజానికి జర్మన్స్ యొక్క శక్తి, చాల అల్పం గా నే ఉండేది. దాని విజయ రహస్యమంతా వాటి వేగం
వాటిని వాడిన విధానమే.
" యుద్ధం అనేది మగాడి ముఖ్యమైన విధి ,ఏవిధంగానైతే ఆడ వారికి పిల్లలను జన్మనివ్వటం"అన్నాడు హిట్లర్.
యుద్ధం అనేది ప్రకృతి మాత్రమే కాదు ,మగాడి కర్తవ్యం కూడా అన్నాడు హిట్లర్ తాను రచించిన 'మైన్ కాంఫ్ ' పుస్తకం లో.
యుద్ధం లో ఫ్రెంచ్ పూర్తిగా నీరు కారి పోయి దాదాపుగా సరెండర్ అయిపొయింది. మొదటి ప్రపంచ యుద్ధం లో జర్మన్స్ ఓడిపోయి సంధి కై ఒక ట్రైన్ డబ్బా లో సంతకాలు పెట్టిన సంగతి మరవని హిట్లర్ అదే ట్రైన్ డబ్బాలో ఫ్రెంచ్ వారిని కూర్చోబెట్టి సంధి కై ఒప్పుకున్నాడు.ఆ రకంగా 1918 లో జర్మనీ కి జరిగిన అవమానానికి ప్రతిగా పగ
తీర్చుకున్నాడు.
మొదటి ప్రపంచ యుద్ధం లో ఫ్రాన్స్ గెలిచి జర్మనీని ఓడించింది,. అదే ఫ్రాన్స్ ను హిట్లర్ ఓడించి , ఆక్రమించి ప్రతీకారం తీర్చుకున్నాడు. కానీ చర్చిల్ నాయకత్వం లోని బ్రిటిష్ పోరాడటానికి నిర్ణయించుకుంది.
పశ్చిమ యూరోప్ లో వున్నా అన్ని దేశాల సైన్యాన్ని తుక్కుగా కొట్టి ఆక్రమించిన తర్వాత హిట్లర్ రష్యా ను కూడా ఓడగొట్టి
ప్రపంచాన్ని ఏలాలని ప్రణాళిక రచించాడు. పశ్చిమాన ఒక్క బ్రిటన్ మాత్రమే లొంగ లేదు. ఎందువల్ల బ్రిటన్ లొంగ లేదో హిట్లర్ అర్థం కాలేదు. రష్యా ను ఓడిస్తే అదే తన దారికి వస్తుందని భావించాడు.
రష్యా మీద దండ యాత్ర ను ఆపరేషన్ బర్బరోస్సా అన్నాడు.
ప్రపంచ చరిత్ర లోనే అతి పేద్ద దురాక్రమణ ఇదే అని చెప్పవచ్చు. సెప్టెంబర్ 21 ,౧౯౪౧ నాడు సుమారుగా ముప్పై లక్షల సైన్యాన్ని రష్యా మీదకు పంపాడు. అందులో దాదాపుగా ౩౦౦౦ విమానాలుండేవి. వీళ్ళు సుమారుగా ముప్పై లక్షల రష్యా సైన్యాన్ని ఎదుర్కొన్నారు.
ఇంకో పది లక్షల రష్యా సైన్యం మంచూరియ వద్ద జాపనీస్ తో యుద్ధం చేస్తూ వుంది.
పోలాండ్ ను జర్మనీ తో కలిసి ముక్కలు చేసుకుని పంచుకున్న తర్వాత ఇంత తొందరగా హిట్లర్ రష్యా మీద దాడి చేస్తాడని రష్యా భావించ లేదు. దానికి ఇది ఊహించని పరిణామం.
నిజానికి రష్యా ప్రెసిడెంట్ స్టాలిన్, హిట్లర్ విషయం లో అతడిని రెచ్చగొట్టకుండా చాలా జాగ్రత్త గా వ్యవహరించే వాడు.
ముందుగా యుద్దానికి సన్నద్ధం అయిన తర్వాత హిట్లర్ తో తేల్చుకుందాం అనుకున్నాడు స్టాలిన్.
ఆ రోజు జరగ బోయే దురాక్రమణ సమాచారం, జెర్మనీ సైన్యం నుండీ పారిపోయిన ఒక సైనికుడు స్టాలిన్ ముందు నిలబడి చెప్పేసాడు.
అది విన్న స్టాలిన్ ఫోన్ లేపి ఎప్పటిలాగే కొన్ని సైన్యాధికారుల కు సూచనలిచ్చారు. వెంటనే పాపం
ఆ జర్మన్ సైనికుడిని బయటకు తీసుకెళ్ళి బుల్లెట్స్ దింపేశారు.
సశేషం.