విరాట పర్వం - ఒక మంచి సినిమా - వారణాసి రామ కృష్ణ

Virata Parvam -  A feel good movie

"విరాట పర్వం!!"
ఎన్నాళ్ల కెన్నాళ్ల కెన్నాళ్లకూ.. తెలుగు వెండి తెర మీద కి ఒక గొప్ప సినిమా వచ్చింది చాన్నాళ్లకు! సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ఒక ఉత్కంఠ! ఒక ఉద్వేగం!గొప్ప సన్నివేశ బలం! వద్దు! రివ్యూ వద్దు! దయచేసి "విరాట పర్వం" సినిమా రివ్యూ చదవకండి! జీవితం లో గొప్ప ఫీల్ నీ మిస్ అవుతారు! ఈ చిత్రం చూశాక మన దేహం లో మనసు ఎక్కడుందో స్పష్టంగా మనకే కనిపిస్తుంది. మన కళ్ళలోంచి ధారగా కారే కన్నీరు, మనలో వుబికే వైబ్రేషన్స్! కాళ్ళు చేతులు అసంకల్పితంగా వణుకు తాయి. తెర మీద సాగిపోయే సన్నివేశాలతో మనం కూడా అలజడికి గురవుతాం. ప్రతి ఫ్రేమ్ లో పొడుగు వెడల్పుమాత్రమే కాక "లోతు" చూస్తాం. ప్రతి పాత్ర అంతరంగాల్లో ఒక కదలిక తెస్తుంది.

రానా బాగా చేశాడు అంటే అన్యాయం .. జీవించాడు అంటేనే సహజం! ఇక వెన్నెల గా నటించిన సాయి పల్లవి .. చెప్తే ఫీల్ పోతుంది. తెలుగు సినిమా మీద ఇష్టం వుంటే 'విరాట పర్వం' చూడాలి. అదీ థియేటర్లో. నేను అమెరికాలో ఇవాళ చూశాను. ఒక అద్భుతం చూశాను! దయచేసి మీరూ మీ దగ్గర ఉన్న థియేటర్ కి వెళ్లి చూడండి! మనం వెళ్లి చూడక పోతే సురేష్ గారికి రానా కి వచ్చే నష్టం లేదు. ఈ సినిమాని మనం విజయవంతం చెయ్యక పోతే రేపు వాళ్ళు ఇలాంటి సినిమాలా? ఆ.. వద్దులే ఎందుకు తియ్యటం అనుకునే ప్రమాదం వుంది. భవిష్యత్ లో మళ్లీ మంచి సినిమాలు రావు.తెలుగు చిత్ర సీమ బతికి బట్టకట్టదు. మనకి ద్వoదార్ధాల బూతు సినిమాలు అస్సలు ఏ ఫీలింగ్ కలిగించని జంక్ సినిమాలు మాత్రమే వస్తాయి!

ఈ చిత్రదర్శకుడువేణు వుడుగుల లాంటి ప్రతిభావంతులు నిట్టూర్పు విడిచి పరిశ్రమ వదిలి వెళ్ళిపోతారు. మంచి సినిమాలు తియ్యటం ఇక దండగే అని ప్రతి వాళ్ళు అనుకుంటారు. ఒక మరోచరిత్ర, ఒక శంకరాభరణం,ఒక సాగర సంగమం లాంటి సినిమాలని ఆనాటి ప్రేక్షకులు ఎలాగైతే ఆదరించారో అలా ఈనాటి ప్రేక్షకులు థియేటర్ కెళ్ళి విరాట పర్వం చూడాలి! అప్పుడే తెలుగు లో మంచి చిత్రాలు చూసే అవకాశం వస్తుంది. దయచేసి వాళ్ళెవరో ఎదో చెప్పారు.. ఇంకెవరో అన్నారు.. రివ్యూ లో రాశారు.. అది జరిగిన ఒక సంఘటన అట.. సినిమాకి దానికి పొంతన లేదు నక్సల్ ఉద్యమ పోరాటానికి ప్రేమ రంగు పోసి... ఇలాంటివి పట్టించుకోకండి ! గొప్ప క్రియేషన్!మిస్ అవకండి!

disclaimer: నేను ఏ party కీ కానీ హీరోకి కానీ హీరోయిన్ కి ఏ అభిమాన సంఘాలకు దర్శకులకి కానీ గొడుగు పట్టి కాళ్ళు పిసుకుతూ జెండా మోస్తూ వుండే వాడ్ని కాను! కేవలం తెలుగు సినీ ప్రేమికుడిని!! ఎక్కడ ఎప్పుడు మంచి సినిమా వచ్చినా ఆనందంతో రసహృదయం తో కేరింతలు కొడుతూ ఇంకొందరు ఆ రసాస్వాదన చేస్తే బావుంటుందని అనుకునే మనిషిని మాత్రమే! వెళ్ళండి! చూడండి! " విరాట పర్వం" చూశాక ఎలా ఫీల్ అయ్యారో అప్పుడు కామెంట్ పెట్టండి!

Once again Pl..Don't Miss!!
ప్రేమ అంటే ఏంటో ..మనిషి అంటే ఎవరో..ఈ సమాజం లో నడుస్తున్న అంతర్గత సంఘర్షణ లు ఏమిటో వాటి మూలాలు మన దేహం లో పొంగి పొరలే అనేక భావనలు అన్నీ ఇందులో ఉన్నాయి! చాలా సంవత్సరాల తర్వాత మనలో మనం ..మనలోని మనిషిని మనం చూస్తాం! మనలోని అడవి లోకి మనల్ని పంపి అజ్ఞాతం లో వున్న మానవుడిని నిద్ర లేపి 'విరాట పర్వం 'లో మన లోపలి పొరల చిక్కులు తీసి అట్టడుగున వున్న మానవీయ ప్రేమనీ చూపించే అద్భుత రస కావ్యం.. "విరాట పర్వం!!"

--వారణాసి రామ కృష్ణ
(Writer& freelance journalist)

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు