రెండవ ప్రపంచ యుద్ధం-రహస్యాలు/విశేషాలు 6 - శ్యామకుమార్ చాగల్

రెండవ ప్రపంచ యుద్ధం-రహస్యాలు/విశేషాలు 6

రెండవ ప్రపంచ యుద్ధం -రహస్యాలు/విశేషాలు 6

శాంతి సమయం లో వున్నప్పటికంటే యుద్ధ సమయం లో లెక్క లేనన్ని ఆయుధాల పరిశ్రమ ల్లో , విజ్ఞాన రంగం లో గొప్ప గొప్ప ఆవిష్కరణలు వెలువడి , ఎన్నోన్నో ఉపకరణాలు తయారు చేయటం జరిగింది. ఒకప్పుడు వాటి మీద ఏమాత్రం ఆసక్తి చూపని ప్రభుత్వాలు ఆ యుద్ధ సమయం లో వాటిని అతి వేగంగా అభివృద్ధి చేశాయి. అవసరం దేన్నయినా చేయిస్తుంది అనటానికి
ఇది మంచి ఉదాహరణ .``

మొదటి జెట్ ఫైటర్ ప్లేన్.:- 1930 లో బ్రిటిష్ ఇంజినీర్ ఫ్రాంక్ విటిల్ జెట్ ఇంజిన్ ను కనుక్కోవటం జరిగింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దాని పై ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. దాన్ని మూలాన పడేసింది.
మొదటగా జర్మన్స్ మాత్రం జెట్ ఇంజిన్ తో కూడిన ఫైటర్ విమానం వాడింది. అప్పటి వరకూ ప్రొపెలెర్ తో నడిచే విమానాలు మాత్రమే ఉండేవి. జర్మన్స్ ముందుగా మీ-262 అనబడే యుద్ధ విమానాన్ని ,అత్యంత ఆధునికంగా తయాయరు చేసి యుద్ధం లో నడిపింది అది ఎనిమిది వందల కిలో మీటర్ ల వేగం తొ నడిచేవి..వాటి ముందు శత్రు సేన ల విమానాలు పనికి రాకుండా అయ్యిపోయాయి.
కానీ యుద్ధం లో జర్మన్స్ వాటిని చాలా ఆలస్యంగా తెచ్చారు .దాని మూలంగా యుద్ధ పరిణామం మారి పోయింది. ముందుగా తెచ్చి ఉంటే అమెరికన్ బాంబర్ లు కొట్టుకు పోయేవి.

అలాగే వండర్ డ్రగ్ అనబడే పెన్సిలిన్. నిజానికి అది [1939] లోనే కనుక్కొనబడింది. అయితే ఈ యుద్ధ సమయం లోనే దానిని ఉత్పత్తి చేసి యుద్ధం లో లక్షల సానికులను కాపాడారు.

బొగ్గునుండీ పెట్రోల్ తయారు చేసింది కూడా ఇటువంటి అవసరమే. జర్మనీ కి కావలసిన పెట్రో మొత్తం రోమానియా నుండీ వచ్చేది. కానీ అవి యుద్దానికి కావలసిన పరిమాణం లో అవసరాలను తీర్చ పోయాయి.
1944 నాటికి జర్మన్స్ కు కావలసిన పెట్రోల్ లో ఈ విధంగా సగానికి పైగా తయారు కావటం మొదలైంది.
కొన్ని అత్యంత సాధారణ మైన మెళకువలు కూడా ఎంతో గొప్పగా పని చేశాయి. అందులో ఒకటి,అల్లుమినియం రేకులు. బ్రిటిష్ బాంబర్ విమానాలు వీటిని ఆకాశం లో వెద జల్లినప్పుడు ,జర్మన్ రాడార్ ల మీద యేవో కొన్ని వందల విమానాలు వస్తున్నట్లుగా చూపించేవి.
దాంతో జర్మన్స్ కంగారు పడి తప్పు చేసే వారు. ఆ సమయం లో అసలు బ్రిటిష్ విమానాలు వేరే ప్రాంతం మీద ఆక్రమణ చేసేవి.


బ్లడ్ ప్లాస్మా ను మనలోకి ఎక్కించటం కూడా ఆ సమయం లో కనుక్కున్నది. ఏ బ్లడ్ గ్రూప్ వారికైనా దీన్ని ఎక్కించి ప్రాణాలు కాపాడటం దీని ప్రత్యేకత.
అలాం టూరింగ్ అనే బ్రిటిష్ వ్యక్తి కొత్త కంప్యూటర్ , కలోస్సుస్ ను తయారు చేసి, జర్మన్స్ యొక్క అతి క్లిష్టమైన కోడ్ భాష ఎనిగ్మా ను విడగొట్టాడు. దీంతో ఎన్నో రహస్యాలు జర్మన్స్ నుండీ అమెరికా, బ్రిటిష్ వారికి తెలిసి పోయేవి.

మొదటి సారి బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు రాబర్ట్ వాట్సన్ వవ్యాట్ , రాడార్ ను తయారు చేసాడు. వాటితో జర్మన్స్ నుండీ వచ్చే యుద్ధ విమానాల రాక పోకలు ముందుగానే తెలిసి పోయి వాటిని సమర్తవంతంగా ఎదుర్కొనె వారు.రాడార్ యొక్క ఎలెక్ట్ర్ మాగ్నెటిక్ కిరణాలతో జర్మన్స్ పైలట్ లను చంపవచ్చు అని ఊహించి వాడారు. అయితే అవి ఆ విధంగా పని చేయకుండా ఆ కిరణాలు వెనక్కి రావటం గమనించి, వాటిని యుద్ధ విమానాల , ఓడల రాకను తెలుసు కొనటానికి ఉపయోగించారు.
యుద్ధ వాతవరణానికి తగినట్లుగా ఒక వాహనం తయారు చేయమని కార్ల కంపెనీ లను కోరితే బాంటమ్ అనే కంపెనీ జీప్ ను తయారు చేసి వారికి ఇచ్చాయి.

రాడార్ మెషిన్ తయారు చేసేప్పుడు అనుకోకుండా ఒక వ్యక్తి జేబులోని చాకొలేట్ కరగటం గమనించారు. దాంతో ఆ విధంగా ఎలక్ట్రానిక్ ఒవేన్ ఆవిష్కరణకు నాంది పడింది..

ఇక అప్పుడు తయారు చేసిన అణు బాంబు గురించి అందరికీ తెలిసిందే. దాని మూలంగా కొన్ని లక్షల ప్రాణాలు జపాన్ లో పోయాయి.


ఇంకా వుంది.....సశేషం.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు