రెండవ ప్రపంచ యుద్ధం -7 రహస్యాలు/విశేషాలు - శ్యామకుమార్ చాగల్

Second World War - 7

రెండవ ప్రపంచ యుద్ధం లో సామాన్య ప్రజానీకంలో ఎక్కువ శాతం స్త్రీ లే మరణించారు.

యుద్ధ సమయం లో దేశానికి వెన్నుదన్నుగా సైనికులకు నిలిచింది స్త్రీలే. కొన్ని ఘర్షణ ల్లో ఎక్కడైతే ప్రాణాలకు తెగించి తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో కూడా ఆడవారు భయంకరంగా పోరాడారు.

లక్షల మంది స్త్రీలు ముఖ్యంగా అమెరికా , బ్రిటన్ దేశస్తులు యుద్ధం లో ఎనలేని సేవలు అందిస్తూ చనిపోయారు. చిన్న వయసు అమ్మాయిలు కూడా అంటి ఎయిర్క్రాఫ్ట్ గన్స్ తో జర్మన్

యుద్ధ విమానాల నుండీ పట్టణాలను కాపాడే వారు..

వేలమంది స్త్రీలు యుద్ధ భూమి వెనక వుండే తాత్కాలిక ఆసుపత్రుల్లో పని చేస్తూ , బాంబు దాడుల్లో మరణించారు

బ్రిటన్, అమెరికా దేశాలలో స్త్రీలు యుద్ధ సామాగ్రి తాయారు చేసే పరిశ్రమల్లో చాలావరకూ పని చేసే వారు.

మందు గుండు తాయారు చేసే పరిశ్రమల్లో రాత్రింపగళ్ళు పని చేసేవి వారు. అంతే గాక యుద్ధ ట్యాంకుల తయారీలో కూడా ప్రముఖ పాత్ర వారిదే.అంబులెన్సు సేవలు కూడా ఆడవారు నిర్వర్తించేవారు.

బ్రిటిష్ యువతులకు శిక్షణ ఇచ్చి జర్మన్ సేనలు ఆక్రమించిన దేశాలలోకి రహస్యంగా పంపించి గూఢచారి పనులు చేయించేవారు. అందులో చాలా మంది జర్మన్స్ చేతిలో చిక్కి చిత్ర హింసల కు గురయ్యి మరణించారు.

యుద్ధ విమానాల తయారీలోనే కాక, వాటి రి పైర్స్ లో కూడా స్త్రీలు పాల్గొన్నారు. పూర్తిగా స్త్రీల తో కూడిన కొన్ని ప్రత్యేకమైన యుద్ధ బృందాలుండేవి. శత్రు దేశం లోకి చోర బడి రహస్య గూడ చారిణులు వేల మంది దొరికి పోయి చంప బడ్డారు కూడా.

ఇంకా కొన్ని చోట్ల యుద్ధం జరుగుతున్న సమయాలలో బాంబులు బుల్లెట్ల వర్షానికి జడవకుండా క్షతగాత్రులను లక్షల ప్రాణాలు కాపాడారు నర్సులుగా. అయితే అప్పుడు యుద్ధ రంగం లో లెక్క లేనంత మంది నర్సులు లేడీ డాక్టర్లు కూడా మరణించారు.

యుద్ధం ముదిరిన తర్వాత పట్టణాల మీద జనావాసాల మీద కూడా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించేవి.

ఆ దేశ ప్రజలు వాటికి జడుసుకుని దేశ నాయకుల మీద తిరగబడతారని ఊహించారు శత్రువులు. కానీ దానికి భిన్నంగా ఆ దేశ స్త్రీలు ఇంకా ఎక్కువ పని చేసి దేశాన్ని యుద్ధ రంగం లో మరణించారు.ఈ విషయం లో జర్మనీ వెనక బడింది ఎందుకంటే స్త్రీలు ముందుకు రావటాన్ని హిట్లర్ ఒప్పుకోలేదు.

అమెరికా బ్రిటైన్ కంటే కూడా రష్యా లో స్త్రీలు యుద్ధ బాధలు ఎక్కువగా అనుభవించారు. ఎందుకంటె జర్మనీ,తన శత్రు దేశాలైన అమెరికా బ్రిటన్ దేశాలలోకి చొచ్చుకుపోలేదు. తూర్పు ప్రాంత రష్యా లో స్త్రీలు పిల్లలు దేశ రక్షణ కై మాస్కో పట్టణ సరిహద్దులలో కందకాలు కూడా తవ్వారు.విమానాల రి పైర్స్, బాంబులు ,బుల్లెట్స్ అమర్చటం, పెట్రోల్ నింపటం లాంటి పనులన్నీ స్త్రీలు చేసే వారు

జర్మన్స్ ఆక్రమిత పోలాండ్ లో స్త్రీలు జర్మన్స్ కు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం కూడా చేశారు.

మొదట్లో రష్యా తన పైలోట్స్ నుండీ సంవత్సరానికి యాభై శాతాన్ని కోల్పేయింది. ఆ సమయం లో రష్యన్ యువతులు ఎయిర్ ఫోర్స్ లో కూడా చేరారు. రష్యా పైలట్స్ లో లిలియా అనే స్త్రీ పన్నెండు జర్మన్ యుద్ధ విమానాలను కూల్చేసింది. దాంతో ఆమెను చంపడానికి హిట్లర్ చాలా విమానాలను పంపాడు.

మరిన్ని వ్యాసాలు

Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు