RRR టీమ్ కు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అభినందనలు - .

TFPC Congrats RRR Team

తెలుగు చలన చిత్ర పరిశ్రమ కు గర్వ కారణమైన రోజు 12 మార్చి 2023 ఈ రోజు జరిగిన 95 వ ఆస్కార్ పురస్కార వేడుకల్లో తెలుగు సినిమా “ RRR “ లో “నాటు – నాటు “ పాటకు ఆస్కార్ పురస్కారం ( బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ) రావడం తెలుగు సినిమా పరిశ్రమే కాకుండా భారతదేశం మొత్తం సినిమా పరిశ్రమకు గర్వకారణం..

ఈ సందర్బంగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరుపున " RRR " సినిమా నిర్మాతకు శ్రీ D.V.V దానయ్య గారికి, దర్శకులు శ్రీ S.S రాజమౌళి గారికి, అద్భుతమైన సంగీతం అందించిన శ్రీ. M.M కీరవాణి గారికి, ఇంత అద్భుతమైన పాట రాసిన చంద్ర బోస్ గారికి, గాత్రం అందించిన శ్రీ. కాలభైరవ గారికి, మరియు రాహుల్ సిప్లిగంజ్ గారికి, ఆ పాటకి అద్భుతమైన డాన్స్ చేసిన ఇద్దరు హీరోలు శ్రీ నందమూరి తారక రామారావు గారికి (జూనియర్ ఎన్టీఆర్), శ్రీ. కొణిదెల రామ్ చరణ్ గారికి, ఆ డాన్స్ కు కొరియోగ్రాఫి అందించిన శ్రీ ప్రేమ్ రక్షిత్ గారికి, మరియు సినిమా కు పని చేసిన మొత్తం టీమ్ కు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.

భవిష్యత్తులో మన తెలుగు సినిమా పరిశ్రమకు ఇటువంటి ఆస్కార్ అవార్డులు మరిన్ని రావాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అకాంక్షిస్తుంది.

మరిన్ని వ్యాసాలు