'మన ఆచారాలూ - వాటి అంతరార్ధాలూ ' - ఆదూరి హైమవతి

Aacharaalu - Antarardhaalu

భారతీయ సంస్కృతి పవిత్రమైనదేకాక, ఆచారాలన్నీ ఆరోగ్య సూత్రాలతో ముడిపడి ఉండటం విశేషం. తెలీనివారికి ఇవన్నీ చాదస్తంగా అనిపించవచ్చు, కానీ అంతరార్ధం తెల్సుకుంటే యదార్ధమని అంతా అంగీకరించక తప్పదు..

1. ఇంటిగుమ్మాలకు కట్టే మామిడాకుల తోరణాలతో ముందుగా ప్రారంభిద్దాం. ప్రతిపండక్కూ హిందువులు ఇంటి సింహద్వారానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టడం మనకుతెల్సుకదా! పెళ్ళిళ్ళూ, వ్రతాలు జరిగేప్పుడు వాకిలిముందరి స్థంభాలకు అరటిచెట్లు, పూజా మందిరానికి అరటి పిలకలు కడతాం. ఇప్పుడంతగా నగరాల్లో కనిపించకపోయినా [అన్నీ కళ్యాణమంటపాలూ, షామ్యానాలేనాయె!] పూర్వం పల్లెల్లో తప్పని సరిగా కొబ్బరిమట్టలు స్థంభాలకు కట్టేవారు.

ఇది ఒక చాదస్తమా! లేక  ఏదైన ఉపయోగం ఉందా! -- చాలామంది ఒకచోట చేరినపుడు అంతా విడిచే కార్బన్ డై ఆక్సైడ్ [బొగ్గు పులు సువాయువు] వల్ల గాలి కలుషితమై, ఊపిరాడక పోడం, తలతిరగటం తలనొప్పి రావటం జరుగు తుంటాయి. అందుకే ముఖ్యంగా పసిపిల్లలు ఇలాంటి రద్దిగా ఉండేసమయంలో ఏడవటం జరుగుతుంటుంది. దీన్నేఆంగ్లంలో ’సఫకేషన్‘అంటారు. ఈ మామిడి, అరటి, కొబ్బరి ఆకుల్లో   చెట్టునుండీ కోశాక కూడా చాలా సేపటి వరకూ కార్బన్ డై యాక్సైడ్ను పీల్చుకుని,ఆక్సిజన్ ను వదిలే గుణం ఉంటుంది. అందువల్ల ఊపిరాడకపోడం జరుగదు. అంతేకాక ఆకుపచ్చరంగు నేత్రాలకూ చల్లదనాన్నిస్తుంది, మనస్సుకూ ఉల్లాసాన్ని కలిగిస్తుంది. సహజ రీతిలో అలంకారంతో పాటుగా, ఆరోగ్యాన్నీ కలిగిస్తాయి. చూశారా... ఈ మామిడాకులు, తోరణాల వల్ల ఎంత మేలు జరుగుతుందో!

2. పల్లెల్లో ఇంటిముందు పేడకలాపీ చల్లడం  ఎందుకు?--  ఇంటిముందు చిమ్మి ఆవుపేడ నీళ్ళలో కలిపి చల్లుతారు. పేడలో క్రిములను చంపే గుణం ఉండటం వల్ల  ఆరోగ్యానికి హానికలిగించే ఏసూక్ష్మజీవులూ ఇంట్లోకి ప్రవేసించవు. పేడనీరు దుమ్ముధూళిని ఆపేస్తుంది. ఇంటిముందు బియ్యంపిండితో ముగ్గు వేయటం, చీమలకు ఆహారాన్ని అందించేందుకు, ఇది భూత యఙ్ఞం. ముఖ్యంగా ఈ సంకాంతి రోజుల్లో రంగోలీ వేయడం మన ఆచారం. రానురానూ బియ్యం ధరలు ఆకాశానికి అంటడం వల్ల సున్నపు పొడితో వేయడం జరుగుతున్నది. ఇదీనీ ఆరోగ్యమే! భూత యఙ్ఞం మాట మరిస్తే సుక్ష్మ జీవులను ఇంట్లోకి రాకుండా ఈ సున్నపు పొడి ఆపుతుంది కదా! అందానికి అందం , అలంకారానికి అలంకారం, పైగా ముగ్గులెంత అందంగా రంగులతో ఏర్చికూర్చి వేయటం ఓకళ కాదూ!

3. ఇంటి గుమ్మాలకు ముఖ్యంగా సింహ ద్వారాలకు పసుపు పూసి, కుంకుమబొట్లు పెట్టడం, ఇంటిలోకి లక్ష్మీ దేవిని స్వాగతించడం! పసుపు యాంటీబయాటిక్ సూక్షమజీవులను నాశనం చేస్తుంది. నోములూ వ్రతాల సమయంలో మహిళల పాదాలకు పసుపు రాసేవారు, మహిళలు ఎక్కువగా నీళ్ళలో పని ఉంటుంది, ఈ పసుపు రాసుకోడం వల్ల కాల్ళు పాయటం వంటివి రావు. శరీరానికీ మహిళలు పసుపురాసుకుని స్నానంచేసేవారు. దీనివల్లా శరీరానికి రంగురావటమేకాక అనవసర కేశాలు రాలిపోతాయి.

ప్రతివారం ఇల్లుకడిగేవారు పూర్వం. ఇప్ప్డు అపార్ట్ మెంట్స్ కావటంతో కడుక్కోటాలు లేవుగా! రోజూ తుడుచుకోటమే! పూర్వం ఎంత ధనవంతులకైనా మట్టి నేల ఉండేది. ప్రతి శుక్రవారంలేదా గురువారం సాయంకాలం ఆవుపేడతో ఇల్లు అరిటాకు డిజైన్ తో అలికే వారు, అదో కళ! చక్కగా ముగ్గులుపెట్టేవారు, ప్రతిశుక్రవారం లక్ష్మీ కళే! ఇప్పుడు నగరాల్లో గచ్చునేలలు, టైల్స్, పాలరాళ్ళూ తుడుచుకోటమే![తుడిపించుకోటమే!] ముగ్గులుపెట్టుకునే వసతే  లేదాయె! అందుకే రంగోలీలంటే ఇంత ఆదరణ నగరాల్లో!

4. ఇహ పూజల గురించీ చూద్దాం.- ఆస్థికులంతా దైవారాధన పట్ల ఆసక్తి కలిగిఉంటారు. పూజలో సాధారణంగా ఆరాధనకు,  దైవ మందిరంలో విగ్రహాలో పటాలో ఉంచుకుంటాం. భగవత్ ధ్యానానికీ ఏకాగ్రత అవసరం. అన్నివైపులకూ చలించే ఇంద్రియాలను, మనస్సునూ ఒక మూర్తిపై కేంద్రీకరించేందుకు మనస్సును స్వాధీనపరచుకునేందుకూ విగ్రహమో, పటమో పూజాసమయంలో ఉంచుకుంటాం, దశేంద్రియాలను బాహ్య ప్రపంచంవైపు పోనీయక ఈ మూర్తి ఆపుతుంది. మనస్సునూ, ఇంద్రియాలనూ పట్టి ఉంచేందుకై  పూజకు కంటికింపైన రంగురంగుల, సువాసనా భరితమైన పూలను, చెవికింపుగా మంత్రోఛ్ఛారణతో ఘటానాదాన్నీ, అగరు వత్తుల ధూపం, గంధం, కర్పూర హారతి నాశికకూ, నామ సంకీర్తనతో పాటుగా తీర్ధప్రసాదములు నోటికీ త్రప్తిని కలిగిస్తాయి. ఇంద్రియములు శాంతించిన మనస్సు స్వాధిన మవుతుంది. ధూపదీప నైవేద్యములు ఇంద్రియములు అంతర్ముఖం చేయనుఉపకరిస్తాయి. భగవంతునుకి అర్పించే పూలు, పత్రి, ఫలములు, దీపము, ధూపము, కర్పూరహారతి, ఆరోగ్యరీత్యా , వైఙ్ఞానికంగానూ, ఎన్నో ప్రయోజ నాలు ఉన్నాయని పాశ్చాత్య శాస్త్రఙ్ఞులు, తత్వవేత్తలు సైతం పరిశీలించి తమ అభిప్రాయాలను నిర్ధిష్టంగా తెలిపారు.

5. నమస్కారంలోని సంస్కారం.--సాధారణంగా మనం పెద్దలను, గురువులనూ, అధికారులనూ కల్సినపుడు, దేవాలయాలకు వెళ్ళి నపుడూ రెండుచేతులూ జోడించి నమస్కరిస్తాం [కొన్ని దొంగనమస్కారాలూ ఉంటాయనుకోండి] ఇలా చేతులు జోడించడంలోని అంతరార్ధం ఏంటీ? చేతులు జోడించినపుడు రెండు అరచేతులూ కలిపినపుడు పదివేళ్ళూ, మనస్సూ, ఐదు ఙ్ఞానేంద్రియాలకు ఐదుకర్మేంద్రియాలకూ సంకేతం. ఈపదివేళ్ళనూ కలపడం అంటే ఙ్ఞానేంద్రియ కర్మేంద్రియాలన్నింటినీ దైవంవైపుమరల్చి శరణాగర భావంతో అర్పణ చేయటమే! న+మమ, నారి అనేది ఏమీలేదు. అంతానీదే! స్వీకరించు పరమాత్మా! అనేఅర్పణ  భావనను కలిగి ఉండటం. ఇంతేకాక నమస్కారం " తత్వమసి " అనే నిత్య సత్యాన్ని గుర్తుచేస్తుంది. కుడి అరచేయి మనకు కనపడని ' తత్ ' ను సూచిస్తుంది. ఎడమ అరచేయి వ్యక్తికి ప్రతీక .రెండూ కలిసినపుడు -- తత్వమసి అవుతుంది. ఉన్నది ఒక్కడే రెండవదిలేదనే భావనే! ఏకమేవా అద్వితీయం బ్రహ్మ.

6. దైవం ముందు దీపం వెలిగించడం -- భారతీయ సంస్కృతిలో దీపారాధనకు, జ్యోతి ప్రజ్వలనకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. నిత్య కృత్యాలను దీపంవెలిగించడంతో ప్రారంభిస్తాం.- చీకటిని దీపం వెలుగు తొలగించినట్లు మనలోని అఙ్ఞానాంధకారాన్ని పోగొట్టి ఙ్ఞానాన్ని ప్రసాదించమని భగవంతుని వేడుకుంటాం. పుట్టినరోజునాడు ఈఆధునిక కాలంలో కేక్ మీద కేండిల్స్ పెట్టి ఊదుతారు, సభలు జ్యోతిప్రజ్వలనతో ఆరంభమవుతాయి. ఏ  పూజ కానీ, నోము వ్రతం అన్నీ దీపాన్ని వెలిగించాకే మొదలెడతాం. జ్యోతిని వెలిగించాలంటే ప్రమిద, నూనె, వత్తి , అగ్గిపెట్టె కావాలికదా! వీటిలో ఏదిలేకున్నా జ్యోతిని వెలుగించలేం. వైరాగ్యమనే ప్రమిద, భక్తి అనే తైలం, చిత్తేకాగ్రత అనే వత్తి, తత్వఙ్ఞానమనే అగ్గిపుల్ల అవసరం. వైరాగ్యమంటే దేహ బ్రాంతిని దూరం చేసుకోడం,, అంటే అహంకార మమ కారాలను దూరం చేసుకోడం.

ఇంకా జ్యోతిలో కొన్ని విలక్షణమైన గుణాలున్నాయి. జ్యోతి ఎప్పుడూ ఊర్ధ్వముఖంగానే వెలుగుతుంటుంది, అంటే బ్రహ్మ పదమునకు దారి చూపుతుంటుంది. గాలితాకిడికి కదులుతూ ఊగుతుంటుంది.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి