పురాణాల పాత్రల పేర్లు . 2 .
ఉష వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని కూతురే ఉష . శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు ఈమె భర్త. వీరి కుమారుడు వజ్రుడు. బాణాసురుని వంశపరంపర... * బ్రహ్మ కుమారుడు పరిచుడు * పరిచుని కుమారుడు కాశ్యపుడు * కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు * హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు * ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు * విరొచుని కుమారుడు బలి చక్రవర్తి * ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు * ఆ బాణాసురుని భార్య కండల.
ఉద్దాలకుడు
ఉద్దాలక మహర్షి అరుణుడు కుమారుడు. శ్వేతకేతువు ఇతని కుమ
ఊర్వశి
ఊరువు (తొడ) నుండి ఉద్భవించింది. ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. పూర్వం విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయడానికి రంభను దేవేంద్రుడు పంపుతాడు. రంభ విశ్వామిత్రుడు తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తుండగా, విశ్వామిత్రుడు రంభ గర్వమనచడానికి తన ఉర్వుల నుండి ఒక అందమైన స్త్రీని సృష్టించాడు. ఆమె ఊర్వశి. విశ్వామిత్రుడు ఊర్వుల నుండి జన్మించింది కనుక ఊర్వశి అయింది.
ఊర్మిళ
రామాయణంలో దశరథుని కోడలు, లక్ష్మణుని భార్య. సీతారాములతో లక్ష్మణుడు వనవాసాలకు పోయిన తరువాత, అతనికి శ్రీరామ సంరక్షణార్ధం నిద్రలేమి కలిగింది. అందువలన ఊర్మిళ ఆ పదునాలుగు సంవత్సరాలు నిదురపోయిందని అంటారు. ఆధునిక కాలంలో ఎక్కువసేపు నిద్రపోయే వారిని ఊర్మిళాదేవితో పోల్చుతారు.
ఋష్యమూకము అన్న వాలి చే తరుమబడి సుగ్రీవుడు తలదాచుకున్న కొండ . తన తల వేయి ముక్కలవును అనే ముని శాపముతో వాలి ఈ కొండ దరిదాపులకు రాడు .
ఏకలవ్యుడు
మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. నిషాధ తెగకు చెందినవాడు. తక్కువ కులానికి చెందిన వాడైనా ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు. ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు, మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఏకలవ్యుడు ఎక్కడ తనను మించిపోతాడనే భయంతో అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుని ఆశ్రయించి ఏదైనా చర్య తీసుకోమని కోరాడు. అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని వద్దకు వెళ్ళి అతని కుడి చేతి బొటనవేలును గురుదక్షిణగా ఇమ్మని అడుగుతాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడి చేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు. చరిత్రలో నిలిచిపోయాడు.
ఏతశం సూర్యుని రథం గుర్రాలలో ఒ
ఐరావణుడు అర్జునుడు, నాగుల రాకుమారి ఉలూపిల కుమారుడు. ఇతను కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల పక్షాన పోరాడి ఎనిమిదవ రోజు అలుంవష అను రాక్షసుని చేతిలో మరణించాడు.
కబంధుడు
రామాయణములో రాముని చేత సంహరింపబడిన దండకారణ్యములో ఉన్న ఓ వికృతరూపము గల రాక్షసుడు. ఈతను దట్టమయిన రోమములు గలవాడనియు, పర్వతమువంటి భీకరమైన శరీరముగలవాడనియు, తల, మెడ లేనివాడనియు, ఉదరభాగమునందు క్రూరమయిన దంతములు గల నోరు గలవాడనియు, పొడవాటి చేతులు, వక్షమందు ఓ పెద్ద కన్ను కలవానిగను వర్ణించిరి. కొందరు ఇతడు లక్ష్మీదేవి కొడుకుగా చెప్పిరి. ముందుగా కబంధుడు ఒక గంధర్వుడు ఒక ముని శాపముచే కబంధునకు ఆ వికృత రూపము ప్రాప్తించెను.
కల్పవృక్షము
కోరిన కోరికలు ఇచ్చే చెట్టు. ఇది దేవతలు దానవులు కలిపిచేసిన క్షీర సాగర మథనం సమయంలో పుట్టింది. దీనిని దేవతలకు రాజైన ఇంద్రుడు గ్రహిస్తాడు. బహుళ ప్రయోజనాలున్న తాటి, కొబ్బరి మొదలైన కొన్ని చెట్లను కల్పవృక్షాలుగా పేర్కొంటారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన విశిష్టమైన పద్య కావ్యము రామాయణ కల్పవృక్షం అంటారు .
కర్ణుడు
పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు. మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు. దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన కుంతికి ఇచ్చిన వరప్రభావంతో సూర్య దేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు. సూర్యుని అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించాడు.
కాత్యాయిని
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
కాళి హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
కాళిదాసు
ఒక గొప్ప సంస్కృత కవి, నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు నిలువెత్తు సాక్షం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు, నాటకములు చాలావరకు హిందూ పురాణ, తత్త్వ సంబంధముగా రచించాడు. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు.
కశ్యపుడు
ప్రజాపతులలో ముఖ్యుడు. వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు కొడుకు (మనమడు). ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు. ఇతనికి బ్రహ్మ, విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.
కుచేలుడు
చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము). శ్రీ కృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కందములో వస్తుంది. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు, కుచేలుడు ..సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. అప్పుడు శ్రీ కృష్ణుడికి సహాధ్యాయి కుచేలుడు. విద్యాభ్యాసము అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకొన్నాడు
కుబేరుడు
హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాపురి. ఇతడు విశ్రవసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి.
కురువంశము
భరతుడి తరువాత వంశం--భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి, హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు. అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది. కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు. అనశ్వడి కుమారుడు పరీక్షిత్తు, పరీక్షిత్తు కుమారుడు భీమసేనుడు. భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు.
కుంభకర్ణుడు
రామాయణం కావ్యంలో రావణుని తమ్ముడైన ఒక రాక్షసుడు. అసాధారణ బలవంతుడు, మహాకాయుడు. కుంభకర్ణుడు విశ్రవసు మనువుకు కైకసికి అసురసంధ్యవేళలో సంభోగం వల్ల జన్మించిన సంతానం. ఆరు మాసాలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేలుకొని ఉంటాడు"
కృపి మహాభారతంలోని పాత్ర. ఈమె కృపాచార్యుని సోదరి, ద్రోణుని భార్య. (జన్మ వృత్తాంతము -- శరధ్వంతుడు ఒక రాజు. ధనుర్విద్య ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశియైన జలపది అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు నియమించాడు. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి తన కామోద్రేకమును నిగ్రహించుకొనెను. కాని, అతనికి రేతః పతనమై ఆ వీర్యము రెల్లుగడ్డిలో పడెను. అది రెండు భాగములై అందులోనుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు. కొంతకాలమునకు శంతన మహారాజు వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొన్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారములు గావించి తనచే కృపతో పెంచబడ్డారు కావున వారికి కృపుడు, కృపి అని నామకరణము చేయించాడు. కృపుడు విలువిద్యయందు పరమాచార్యుడై భీష్ముని ప్రార్థనమున కౌరవ పాండవులకు గురువు అయ్యాడు. కృపిని ద్రోణాచార్యుడు పరిణయం చేసుకున్నాడు. వీరికి కలిగిన పుత్రుడే అశ్వత్థామ.)
కేదారేశ్వరుడు శివునికి మరో పేరు . కేదారేశ్వర ఆలయము హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో ఉన్నది, మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది.
కైకేయి
అశ్వపతి కూతురు . దశరథమహారాజు ముడో భార్య . భరతుని తల్లి .
కౌరవులు
కురువంశరాజులు . మహాభారతంలో దుర్యోధనాదులు వందమంది . కురువంశములో జన్మించిన వారిని కౌరవులు అంటారు. కానీ మహాభారతములో ప్రధానముగా ధృతరాష్ట్రుని సంతతిని సూచించటానికే ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గాంధారికి జన్మించినవారు 100 మంది పుత్రులు, 1 పుత్రిక. ఒక వైశ్య వనిత ద్వారా ధృతరాష్ట్రునికి మరొక పుత్రుడు యుయుత్సుడు జన్మించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో గాంధారి పుత్రులు అందరూ మరణించారు.
కౌశికుడు
ధర్మ వ్యాధునివల్ల ధర్మ విశేషాలు తెలుసుకున్నవాడు . విశ్వామిత్రునికి మరో పేరు .
కంసుడు
ఉగ్రసేనుని కుమారుడు, శ్రీకృష్ణుని మేనమామ . మధురా నగరాన్ని యాదవవంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు.
ఖాండవం (వనము) ఇంద్రుని వనము . అగ్నిదేవుడు ప్రార్థించగా కృష్ణార్జునులు దానిని అతనికి ఆహారముగా ఇచ్చారు .
గంగ గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు . గంగ అనగా తెలుగు భాషలో నీరు అని కూడా అర్ధం. పరమేశ్వరుని భార్యలలో ఒకరు .
గరుత్మంతుడు
విశిష్టమైన రెక్కలు కలవాడు . గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు.
గౌరి
హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.
గాంఢీవం
అర్జునుడి ధనుస్సు . దీనిని అగ్నిదేవుడు ఖాండవ వనం దహనమప్పుడు అర్జునుడికి ఇస్తాడు .
జ్ఞానప్రసూనాంబ
పరాశక్తి అవతారము . శ్రీకాళహస్తీశ్వరుని భార్య
జటాయువు
రామాయణంలో అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర (గ్రద్ద). ఇతను శ్యేని, అనూరుల కొడుకు. సంపాతి ఈతని సోదరుడు. దశరథుడు ఇతడి స్నేహితుడు. రావణుడు సీతని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో పోరాడి ఓడిపోతాడు. చివరకు రాముడికి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు.
జమదగ్ని
భృగు వంశానికి చెందిన మహర్షి. పరశురాముడుకి తండ్రి. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు. రేణుక ఈయన భార్య .
జనమేజయుడు
మహాభారతంలో పరీక్షిత్తు కుమారుడు. అర్జునునికి ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు ఇతనికి మహాభారత కథను వినిపించెను. మహాభారతంలో చెప్పినట్లుగా జనమేజయుడికి ఆరు మంది అన్నదమ్మలు. వారు కక్ష సేనుడు, ఉగ్ర సేనుడు, చిత్ర సేనుడు, ఇంద్రసేనుడు, సుశేణుడు, నఖ్యశేనుడు. . తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగము చేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడు పరీక్షత్తును చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు.
జయ విజయులు శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారా పాలకులు. వీరి గురించి భాగవత పురాణంలో ఉంది. ఒక సారి బ్రహ్మ యొక్క మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్ధమై వైకుంఠానికి వేంచేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాదులు ఆగ్రహించి భూలోకంలో మర్త్యులై సంచరించెదరని శాపం ఇస్తారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదనీ కాకపోతే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు. అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు.
జరాసంధుడు
పరమ శివ భక్తుడు, రాక్షసుడు. జరాసంధుడు బృహధ్రద్రుడి కుమారుడు. మగధను పరిపాలించిన మహారాజు. మహాభారతంలో సభాపర్వంలో వచ్చే పాత్ర. బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు. సంతానము కోసము రాజు కోరిక మేరకు ఋషి చందకౌశిక మహర్షి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు. (ఆ ఋషికి బృధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు). రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దీనితో దిబ్భాంత్రి లోనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు. అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు. జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుండి. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజుకి తీసుకొని వెళ్ళి జరిగిన వృంత్తాంతాన్ని చెబుతుంది.
జాంబవంతుడు
బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మథనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శమంతకమణిని, జాంబవతిని ఇచ్చడు.
డాకిని
మంత్రాలను వల్లించడం ద్వారా అద్భుతాలు చేసే స్త్రీ . హిందూ పురాణాలలో చెప్పబడిన స్త్రం
తపతి
సూర్యుని కుమార్తె . -- సంజ్ఞ రూపంలో చాయ సూర్యుడికి చాలాకాలం సేవలు చేసింది. ఆమెకు సూర్యుడి వల్ల శనీశ్వరుడు, తపతి కలిగారు. తపతి అందాల బొమ్మ, సుగుణాల ప్రోగు. ఆమెకు యుక్త వయస్సు వచ్చేసరికి మరింత అందంగా తయారైంది. సూర్యుడు కుమార్తెకు పెళ్ళిచేయాలని నిశ్చయించుకున్నాడు. తగిన వరుడికోసం అన్వేషిస్తున్నాడు. చంద్రవంశ రాజు ఋక్షుని కుమారుడు సంవరణుడుతో ప్రతిష్ఠానపురంలో వారిద్దరి వివాహం వశిష్టుడి ఆధ్వర్యంలో అతి వైభవంగా జరిగింది. ఆ దంపతులకు కురు వంశానికి మూలపురుషుడైన 'కురువు' జన్మించాడు. వింధ్య పర్వతాలకు పశ్చిమంగా ప్రవహించి ప్రజల పాపాలు పోగొట్టమని భాస్కరుడు తన కుమార్తెను దీవించాడట. తండ్రి ఆశీస్సును అనుసరించి తపతీదేవి నదీమతల్లిగా మారి నర్మదానదిలో లీనమై ప్రవహిస్తోంది.
తార
తారుని కుమార్తె . వాలి భార్య . అంగదుని తల్లి . వాలి మరణించిన అనంతరము తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. కాని అది వీలుపడదని కర్మా-ధర్మాలను అనుభవించవసిందేనని తాను నిమిత్తమాత్రుడునని హితవు పలికెను . వాలి సోదరుడు ' సుగ్రీవుడు ' ఈమెను వివాహమాడెను ..