పురాణ పాత్రల పేర్లు .3. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

పురాణ పాత్రల పేర్లు .3.

పురాణాల పాత్రల పేర్లు .3 .

దమయంతి

'దమనుడు' అను ముని వరము వలన జన్మించింది. 2. తన అందముచే ఇతరులను దమించునది. (అణచునది).భీమమహారాజు కుమార్తె, నిషధ రాజా నలునితో వైభవోపేతంగా వివాహం జరిగింది. కుమార్తె ఇంద్రసేన, కుమారుడు ఇంద్రసేనుడు .

దత్తాత్రేయుడు

శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణుమూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉంది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.

దశరథుడు

దశ (పది) దిశలలో రథ గమనము కలవాడు. అయోధ్య రాజ్యానికి రఘు వంశపు రాజు . ముగ్గురు - (కౌషల్య, సుమిత్ర, కైకేయి ) భార్యలకు ... రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రుఘ్నులు (నలుగురు) కుమారులు .

దామోదరుడు

కృష్ణుడు చిన్నతనంలో తల్లి యశోద అతని నడుముకు పొట్టకు కట్టువేసి బండరాయికి కట్టివేసినది . బంధితమైన పొట్టగల వాడు కనుకనే ఆ నాటి నుంచి ఆయనకు దామోదరుడు అనే పేరొచ్చింది.

దాక్షాయణి

హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, బద్రకాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

దక్షిణాయనము సూర్య భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయం నుండి మకరరాశిని చేరే వరకు మధ్యనున్న సమయమే దక్షిణాయనము . ఆ సమ్యములో సూర్యుడు భూమధ్యరే్ఖకు దక్షిణముగా సంచరిస్తాడు .

దుర్యోధనుడు

(దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు. మహాభారతంలో ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రథముడు, కౌరవాగ్రజుడు. గాంధారీ దృతరాష్ట్రుల పుత్రుడు. గాంధారీ గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి ధర్మరాజుని ప్రసవించిన విషయం వినిన తరవాత 12 మాసముల తన గర్భాన్ని ఆతురతవలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించింది. ఈ విషయంవిన్న వ్యాసుడు హస్తినకు వచ్చి కోడలిని మందలించి ఆ పిండం వృధా కాకుండా నూటొక్క ముక్కలుగాచేసి నేతి కుండలలో భద్రపరచాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని వాటిలో పిండము వృద్ధిచెందిన తరవాతనూరుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు. గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై అందునుండి దుర్యోధనడు జన్మించాడు. తరవాత క్రమంగా తొంభై తొమ్మిదిమంది పుత్రులు ఒక పుత్రిక పేరు దుస్సల జన్మించారు. ఈ విధంగా గాంధారీ దృతరాష్ట్రులు దుర్యోధనాదులను సంతానంగా పొందారు.

దుర్వాసుడు

దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము), దుర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి, అనసూయ ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. ఇలా శపించడం వలన ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు.

దుస్సల

ధృతరాష్ట్రుడు, గాంధారి ల ఏకైక కుమార్తె . ధుర్యోధనాదుల సోదరి . ఈమె సింధు దేశ రాజు జయద్రదుని వివాహము చేసుకొన్నది. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు

దుశ్శాసనుడు

సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు. దుశ్శాసనుడు గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. దుర్యోధనుని నూరుగురు కౌరవ సోదరులలో ఒకరు. దుశ్శాసనుడు ద్రౌపతిని సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చి, నిండు సభలో ద్రౌపతి వస్త్రాపహరణం నకు పూనుకున్నాడు. కానీ శ్రీ కృష్ణుడి అభయ హస్తంతో ద్రౌపతి గౌరవం కాపాడబడింది.

దుష్యంతుడు

హస్తినాపురానికి రాజైన దుష్యంతుడు మహారాజు . శకుంతల భర్త . భరతుని తండ్రి .

దృపదుడు

పాంచాల రాజు . ద్రౌపది తండ్రి . ఈయన కుమారులు ... దృష్టద్యుమ్నుడు, శిఖండి .

ద్రౌపది

పాంచాల రాజైన ద్రుపద మహారాజు కుమార్తె . మహాభారరములో ప్రముఖ పాత్ర . అర్జునుడు మత్స్యయంత్రము కొట్టగా ఆమె పాండవులకు భార్య అయినది

ద్రోణుడు

ద్రోణము (కుండ) నుండి పుట్టినవాడు. భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేదవేదాంగాలన్నీ అభ్యసించాడు. ద్రోణుడితో పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. పరశురాముడు వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. అది తరవాతి కాలంలో హస్థినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్య నేర్పటానికి దారితీసింది. . అర్జునుడు అతనికి ప్రియ విద్యార్థ.

ధర్మరాజు

మహాభారతములో పంచపాండవులలో మొదటివాడు . యుధిష్ఠిరుడని మరొక పేరు . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన (యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్ఠిరుడని పేర్లు కలిగాయి. జూదములో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టుగా ఉంటాడు .

ధర్మవ్యాధుడు

మిధిలా నగరములో ఉండేవాడు . సమస్త ధర్మాలూ చక్కగా తెలిసినవాడు .

ధర్వంతరి క్షీరసాగర మధన సమయములో జర్మించినది . ఆయుర్వేదానికి అధిష్టాన దేవత .

ధృతరాష్ట్రుడు

కురువంశరాజు అయిన విచిత్రవీర్యుని కుమారుడు . అంధుడు . గాంధారి ఈయం భార్య . దుర్యోధనుడు .. .తదితర నూరు మంది కుమారులు, వీరినే కౌరవులు అంటారు .

ధ్వజస్తంభము

సూర్యుని కాంతి కిరణములు నలభై ఐదు డిగ్రీల కోణములో పరవర్తనము చెందుతాయి . ఆ దిశగా ధ్వజస్తంభాన్ని ప్రతిస్ఠారు . దక్షిణం వైపు నుంచి వచ్చే కుజగ్రహ కిరణాలు గోపుర కలశము మీదుగా ధ్వజస్తంభము పైనుంచి స్వామి భూమధ్యకి చేరుతాయి అందుకే ధ్వజస్తంభమునకు, స్వామికి మధ్యన నిల్చుని నమస్కరించాలి . అప్పుడే గ్రహశక్తితో పాటు స్వామి శక్తీ మనల్ని చేరుతుం

నారదుడు

1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము)

2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు. నారదుడు - లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ, నారాయణ భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి.

పార్వతి

హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

ప్రహ్లాదుడు

భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు . ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన హిరణ్యకశిపుని కుమారుడు. ప్రహ్లాదునకు దమని అనే కన్యతో వివాహము జరిగింది. వీరికి వాతాపి, ఇల్వలుడు అనే కుమారులు కలరు.

పరశురాముడు

శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగింది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.

పరాశరుడు

వసిష్టుని మనుమడు. శక్తి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. పరాశరుడు ఒకనాడు తీర్థయాత్రకు పోవుచు యమునా నదిలో పడవ నడుపుచున్న మత్స్యగంధిని చూచి మోహించెను. ఆమె కన్యాత్వము పాడవకుండా అభయమిచ్చి, శరీరపు దుర్వాసన పోవునట్లు వరం ప్రసాదించి, యమునా నదీ ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో సంగమించెను. వీరికి వ్యాసుడు జన్మించెను.

పరీక్షిత్తు

అంటే అంతటా దర్శించగలవాడని అర్దము . అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము యోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్థించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతిని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు జనమేజయుడు.

పూతన

ఒక రాక్షసి . బాలకృష్ణుని చే వధించబడుతుంది .

ప్రద్యుమ్నుడు

ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము). ప్రద్యుమ్నుడు శ్రీ కృష్ణుడికి రుక్మిణికి జన్మించన సంతానం. ప్రద్యుమ్నుడి పాత్ర భాగవతంలో వస్తుంది. శంభరాసురుడు అనే రాక్షుసుడిని సంహరిస్తాడు . మాయవతి (రతి దేవి) ఈయన భార్య .

పంచవటి

రాముడు వనవాస సమయంలో దండకారణ్యములోని ఆశ్రమము పేరు

బభృవాహనుడు

బభృవాహనుడు అర్జునుడు, మణిపురపు రాకుమారి చిత్రాంగదలకు కలిగిన కుమారుడు. అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి చిత్రాంగదను చూచి వలచాడు. చిత్రాంగద తండ్రి అయిన చిత్రవాహనునికి ఆమె ఒక్కతే సంతానం. చిత్రవాహనుడు చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి అర్జునుడు చిత్రాంగదను వివాహము చేసికొన్నాడు. బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు.

బలిచక్రవర్తి

బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడు మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, వామనుడు (హరి) తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపుతాడు.

బర్బరీకుడు బర్బరీకుడు మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు శ్రీకృష్ణుని చేత వధించబడ్డాడు.

బలరాముడు

బలముచే జనులను రమింపచేయువాడు., వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము, నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడుగా ఉన్నవారు. వీరి భార్య రేణుక .

బద్రకాళి

పార్వతికి మరో పేరు . హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, బద్రకాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

బృహస్పతి

బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్‌పతి).బృహస్పతికి ఇంకో పేరు గురుడు. బృహస్పతి దేవతలకు గురువు. బృహస్పతి భార్య తార చంద్రుని అందానికి మోహించి పతిలేని సమయంలో చంద్రునితో రతి సరసాలు జరిపెను . అందువలన గర్భవతి అయ్యెను. ఈమెను చంద్రుడు తీసుకొనిపోగా, బృహస్పతితో యుద్ధం జరిగెను. ఇంతలో తారకు బుధుడు జన్మించెను. తగవు తీర్చడానికి వచ్చిన బ్రహ్మ తారను అడిగి నిజం తెలుసుకొని బుధుని చంద్రునకు, తారను బృహస్పతికి ఇప్పించెను.

భరతుడు

అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.

1. భరతుడు రామాయణంలో దశరథుని కుమారుడు, శ్రీరాముని తమ్ముడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు. సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదులకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు.

2. భరతుడు మహాభారతములో శకుంతల-దుష్యంతుల కుమారుడు . భరతుడు పరిపాలించిన దేశము గనుక భారతదేశము అని పేరు వచ్చినది .

బాణాసురుడు

వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని వంశపరంపర. బ్రహ్మ కుమారుడు పరిచుడు, పరిచుని కుమారుడు కాశ్యపుడు, కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు, హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు, ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరొచుని కుమారుడు బలి చక్రవర్తి, ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు, ఆ బాణాసురుని భార్య కండల.

వీడు అకుంఠిత దీక్షతో పరమ శివుని ధ్యానించి అయన్ని మెప్పించి తనకు రక్షణగా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఊండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి, మూర్ఖత్వానికి చింతించి నీ రథం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.

భవాని

హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

భైరవి

హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

భీముడు భయమును కలిగించువాడు . భీముడు పాండవ ద్వితీయుడు. మహాభారత ఇతిహాసములో వాయుదేవుడి అంశ. పాండురాజు సంతానం. కుంతికి వాయుదేవునికి కలిగిన సంతానం. ద్రౌపతి, హిడింబి ఇతని భార్యలు . హిడింబాసురుణ్ణి వధించి తనని వరించిన ఆతని సోదరి హిడింబి అను రాక్షస వనితను కుంతీ ధర్మరాజాదుల అనుమతితో వివాహమాడినాడు. వారిరువురికీ కలిగిన సంతానమే మహాభారత యుద్దమందు తన మాయాజాలముతో వీరంగము చేసి ప్రసిద్దుడైన ఘటోత్కచుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని నిర్జించాడు. ధుర్యోధన దుశ్శాసనాది కౌరవులు నూర్గురినీ భీమసేనుడే వధించాడు.

భీష్ముడు

తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన (భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు. ఆ జన్మ భ్రహ్మచారి . మహాభారతంలో గంగాదేవీ శంతనమహారాజుకి జన్మించాడు, భీష్ముడు పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది.

మండోదరి

పలుచని ఉదరము కలది (మండ-పలుచని). మండోదరి' రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు.

మన్మధుడు మన్మధుడు అంటే మనస్సు కలత పెట్టువాడు, మనసుని మధించేవాడని పురాణాలు వర్ణించాయి.మన్మధుడు పూవిలుకాడు. పూల బాణాలు వేసి గుండెలలో ప్రేమను పెంచును. ఈయనకు మనసిజుడు అని, అనంగుడని, పుష్పధన్యుడు అని పేర్లు ఉన్నాయి . మంచి రూపం కలిగిన వాడు. విష్ణువుకు మానస పుత్రుడు. రతీదేవి ఈయన భార్య.

మహిషాసురుడు హిందూ పురాణాలలో రాక్షసుడు

1. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు 'మహిషం' (గేదె) తో కలిసి రతిలో పాల్గొన్న మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.

2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై (గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి మహిషాసురుడుకి జన్మనిస్తుంది. దుర్గాదేవి మహిషున్ని ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది.

మహిషాసుర మర్ధిని మహిషాసురుడనే రాక్షసుడిని చంపడం వల్ల పార్వతికి ఈ పేరు వచ్చినది .

మారీచుడు రాక్షసి తాటకకి కుమారుడు . సీతాపహరణ సమయంలో రావణుడు ఇతన్ని బంగారు జింకగా మారమని అదేశిస్తాడు ... తరువాత రాముని చే హతమార్చబడినాడు . ఇతని సోదరి కైకసి, సోదరుడు సుబాహుడు .

మేనక

మేనక ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. విశ్వామితుడి తపోభంగానికి ఇంద్రుడు నియమించిన అప్సరస . వీరిరువురి కలయిక వలన శకుంతల జన్మించింది .

మోహిని

మోహిని అంటే సాధారణంగా నారాయణుని మోహినీ అవతారము . దేవదానవులు అమృతాన్ని సాధించినతరువాత నాకంటే, నాకు అని పోరాటంచేస్తుంటే విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి అందరినీ మోహించి, అమృతాన్ని పంచుతాను అని చెప్పి దేవతలకు మాత్రం ఇచ్చి రాక్షసులను మోసం చేస్తాడు. రాహుకేతువులు దేవతల వరుసలో కూర్చుంటే, వారిని తన చక్రాయుధంతో వధిస్తాడు.ఇదే మోహినీ అవతారంలో విష్ణుమూర్తి శివుడిని కూడా మోహింపచేస్తాడు.

యముడు, యమధర్మరాజు

యమము (లయ) నుపొందించువాడు. యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. కాలుడు అని మరియొక పేరు . యముడు దక్షిణ దిశకు అధిపతి, గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము). యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు. * భార్య పేరు ' శ్యామల * సోదరులు : వైవస్వతుడు, శని * సోదరీమణులు: యమున, తపతి

యశోద యశస్సును (కీర్తి) కలిగించునది. భాగవతములో యశోద నందుని భార్య గోకులవాసి .. శ్రీకౄష్ణుని పెంపుడు తల్లి . బలరాముడు, సుబద్రలు ఈమె వద్దనే పెరిగేరు . యశోదా-నందులకు ' ఏకనంగా ' అనే సొంత కూతురు ఉందటారు .

యాజ్ఞవల్కుడు

ప్రాత:స్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఈయన భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించారు. వైశంపాయుని వద్ద యజుర్వేదాద్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపము లోగక్కి శాపాన్ని బాపుకున్నారు. ఆయన గక్కిన పదార్దాన్ని తిత్తిరిపక్షులు తిని తిరిగి అవి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి. ఆతరువాత యాజ్ఞవల్కుడు సూర్యభగవానుని ఆరాధించి, శుక్లయజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాధించాడ. తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము చేసుకున్నాదు. గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపథముచేసి, కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్కుని రెండవ భార్య అయినది. మహాజ్ఞాని, తపోనిధి, అయిన యాజ్ఞవల్కునికి మాఘ శుద్ధ పౌర్ణమినాడు యోగీంద్ర పట్టాభిషేకము చేసారు. ఆయన ఋషులకు తెలియజేసిన విషయాలే యోగశాస్త్రమని, యోగయాజ్ఞవల్కమని ప్రసిద్ధికెక్కాయి. కర్మజ్ఞానము వలన మోక్షము కలుగుతుందని తెలియజేసిన ప్రా:స్మరణీయుడు యాజ్ఞవల్కుడు .

యుధిష్ఠిరుడు

ధర్మరాజుకు యుధిష్ఠిరుడని మరొక పేరు, మహాభారతములో పంచపాండవులలో మొదటివాడు . . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన (యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్ఠిరుడని పేర్లు కలిగాయి. జూదములో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టుగా ఉంటాడు .

హిందూ దేవతలలో ప్రముఖుడు. ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజై పరిపాలించాడు . అతను పురాతన భారత దేశమును వాస్తవముగ పరిపాలించిన రాజుగా నేటి చరిత్రకారులు భావించుచున్నారు. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్ఠములు ఎదురెనను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరించెదరు. రాముడి తండ్రి -ధశరధుడు, తల్లి -కౌసల్య, పినతల్లులు- సుమిత్ర, కైకేయి, సోదరులు - భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భార్య -సీతాదేవి .పిల్లలు -లవ కుశలు .

రావణాసురుడు

కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు అని అర్ధము . రావణుడు రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పది రకాలుగా ఆలోచించేవాడనే దానికి, పది విద్యలలో ప్రవీణుడు అన్నదానికి ప్రతీకగా, కళారూపాలలో రావణుని పదితలలతో చిత్రిస్తారు. పదితలలు ఉండటం చేత ఈయనకు దశముఖుడు (పది ముఖములు కలవాడు), దశగ్రీవుడు (పది శీర్షములు కలవాడు), దశ కంథరుడు, దశకంఠుడు (పది గొంతులు కలవాడు) అన్న పేర్లు వచ్చాయి. బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రవసునికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. రావణుని భార్య ' మండోదరి ' .

రావణాసురుడికి ఆరుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు, ఏడుగురు కొడుకులు . సోదరులు = 1. కుబేరుడు 2. కుంభకర్ణుడు 3. విభీషణుడు 4. ఖరుడు 5. దూషణుడు 6. అహిరావణుడు, సోదరీమణులు = 1. శూర్పణఖ (చంద్రనఖు)2.కుంభిని . కుమారులు = 1. ఇంద్రజిత్తు, 2. ప్రహస్థుడు,3. అతికాయుడు,4. అక్షయకుమారుడు,5. దేవాంతకుడు,6. నరాంతకుడు, 7. త్రిశిరుడు..

మరిన్ని వ్యాసాలు

పిల్లనగ్రోవి పిలుపు...
పిల్లనగ్రోవి పిలుపు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన  సినిమాల్లో నారద పాత్రధారులు .
మన సినిమాల్లో నారద పాత్రధారులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neti telangana lo desi chandassu ki adyudu
నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు
- డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్