గురవే సర్వ లోకానాం : - సి.హెచ్.ప్రతాప్

Gurave sarva lokanam

శ్లో: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర

గురు సాక్షత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమహా:

తాత్పర్యం: బ్రహ్మ (సృష్టికర్త), విష్ణువు (సృష్టికర్త) మరియు శివుడు (విధ్వంసకుడు) అయిన గురువుకు నా వందనం. త్రిమూర్తుల స్వరూపం అయిన గురువు ముందు నేను నమస్కరిస్తున్నాను.
మరొక శ్లోకంలో శిష్యుడు ఈ ప్రపంచంలో అన్ని యానిమేట్ మరియు జీవం లేని, కదిలే మరియు స్థిరమైన వస్తువులన్నింటినీ విస్తరించే శక్తి గురించి నాకు నేర్పించిన గురువుకు నమస్కారాలు అని ప్రార్ధిస్తాడు. భారతీయ సంస్కృతి గురువులకు విశిష్ట స్థానాన్ని కల్పిస్తూ ఆషాఢ పూర్ణిమను వ్యాస మహర్షి జయంతిగా గుర్తించి గురుపూర్ణిమగా అంగీకరించింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమాన స్థానం కల్పించి, తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే అని ప్రబోధించింది. తనకు గురువు. దైవం ఒకేసారి ప్రత్యక్షమైతే తాను మొదట నమస్కరించేది గురువుకేనని, ఎందుకంటే గురువు ద్వారానే భగవంతుని తెలుసుకోగలిగా నని అంటూ దైవంకంటే గురువే గొప్పవాడని తీర్పరించాడు కబీర్‌దాస్‌.మన పవిత్ర భారతావనిలో నదయాడిన మహనీయులందరూ ఒక గురువును ఆశ్రయించి , శస్రూష చేసి, ఉపదేశం పొందాకనే గురువు స్థానాన్ని స్వీకరించి కోట్లాది మందిన శ్రేయో మార్గంలో నడిపించారంటే అతిసయోక్తి కాదు.


ప్రతి వ్యక్తికీ గురువు మార్గదర్శనం ఎంతో అవసరం. శ్రీరాముడు వశిష్ట, విశ్వామిత్రుల వద్ద, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి వద్ద వినయ విధేయ తలతో శుశ్రూష చేసి విద్యలను గడించారు.


స్వర్గ సౌఖ్యాలు, సిరిసంపదలు, ధనధాన్యాలు, విద్యావైభవాలు, పుత్రపౌత్ర సుఖము… ఇలా ఏది కావాలన్నా గురువు అనుగ్రహంతోనే సాధ్యపడతాయి. గురు అనుగ్రహం లేకుంటే అవన్నీ దుర్లభాలే. గురువులు అద్దంవలె నిర్మలంగా ఉంటారు. గురువు శిష్యుని రూపాన్ని తన మనస్సులో తలుచుకొని తన యోగ విద్య ద్వారా శిష్యునికి శక్తిపాతం చేస్తే ఆ శిష్యునికి గురువు విజ్ఞానం బదిలీ అయ్యి, అతను గురువు ప్రతిబింబంగా మారతాడు.


ఆధ్యాత్మికత మనకు కనపడని, సూక్ష్మశాస్త్రం అయినందువలన ఆధ్యాత్మికంగా ఎదిగి మార్గం చూపించగల గురువును గుర్తించడం ఎంతో కష్టమైన విషయం. గురువు అధ్యాపకునికన్నా, బోధకుడికన్నా చాలా భిన్నమైన వాడు. అతడు ఈ ప్రపంచంలో ఆధ్యాత్మిక దీపం వంటి వాడు. అన్ని కుల-మతాలకు, సంస్కృతికి ఆధారమైన విశ్వ ఆధ్యాత్మిక శాస్త్రమును మనకు నేర్పిస్తాడు.బయటికి భౌతిక రూపములు వేరుగా ఉన్నా, గురువులందరూ ఒక్కటే. ఎలా అయితే ఆవు పొదుగు నుండి వచ్చే పాలు అన్నీ స్వచ్చమైనవో అలాగే అందరు గురువులలోనూ ఉన్న గురు తత్వము ఒక్కటే అని చెబుతోంది గురు చరిత్ర.


గ్రుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించలేడు,” అన్నారు యోగదా సత్సంగ సొసైటీ వ్యవస్థాపకులైన పరమహంస యోగానంద గారు. “భగవంతుణ్ణి తెలుసుకున్న గురువు మాత్రమే, పరమాత్ముని గురించి ఇతరులకు సరిగా బోధించగలడు. మన యొక్క దివ్యత్వాన్ని తిరిగి పొందడానికి అటువంటి ఉపదేశకుడు లేదా గురువు ఉండాలి. నిజమైన గురువును విశ్వాసముగా అనుసరించేవాడు అతనిలా అవుతాడు, ఎందుకంటే శిష్యుడిని తన స్వీయ సిద్ధి స్థాయికి పెంచడానికి గురువు సహాయం చేస్తాడు.మీ హృదయంలో నిరంతరం దేవుని కోసం తపించండి. మీరు ప్రభువు పట్ల మీ ఆకాంక్షను నిరూపించినప్పుడు, ఆయనను ఎలా తెలుసుకోవాలో మీకు బోధించడానికి ఆయన ఎవరినైనా ఒకరిని — మీ గురువును — పంపుతాడు. భగవంతుణ్ణి ఎరిగినవాడు మాత్రమే ఆయనను ఎలా తెలుసుకోవాలో ఇతరులకు చూపించగలడు" అని గురువు యొక్క ప్రాశస్థ్యాన్ని గొప్పగా వర్ణించారు. మనసును గురువు చుట్టూ తిప్పితే, తలతిరిగే మత్తు శరీరానికి ఎక్కుతుంది. ఆమత్తులో కలిమాయ చిత్తవుతుంది. ఇది గురువు మాత్రమే చెయ్యగల మహత్యం.ఒక్క సూర్యుడు వెయ్యి కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు, ఒక్క గురువు వేల మంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనిమిస్తాడు. సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు, గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు.అయితే ఏ స్వార్థమూ లేకుండా తన దగ్గర ఉన్న విజ్ఞానమంతా శిష్యుడికి ధారపోస్తాడు గురువు. ఆ జ్ఞానంతో తన శిష్యుడు లోకానికి ఉపకారం చేయాలని భావిస్తాడు. కానీ, అదే శిష్యుడు లోకకంటకుడిగా మారుతాడు అనుకుంటే, చూస్తూ ఊరుకోడు అన్న సత్యాన్ని ద్రోణాచార్యుడు కర్ణుడిని శపించడం ద్వారా లోకానికి హెచ్చరికలు పంపాడు.

మరిన్ని వ్యాసాలు

పిల్లనగ్రోవి పిలుపు...
పిల్లనగ్రోవి పిలుపు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన  సినిమాల్లో నారద పాత్రధారులు .
మన సినిమాల్లో నారద పాత్రధారులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neti telangana lo desi chandassu ki adyudu
నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు
- డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్