రంగులు మారుతాయి... - సాయి... స్వర్ణ

Rangulu maratayi

రంగులు మారుతాయా.... బహుశా మార్పు అనివార్యం ఏమో...... బాల్యం..... స్వచ్చమైన తెలుపు రంగులో లో విరాజిల్లుతోంది..... యవ్వనం...... సున్నితమైన పసుపు రంగు లో ప్రకాశిస్తుంది.... నడి వయసు..... స్పష్టమైన ఎరుపు రంగు లో ఉజ్వలిస్తుంది..... వృద్ధాప్యం........ అంతులేని నలుపు రంగు లో అలసిపోతుంది.... ఏ రంగూ జీవితకాలం ఒకేలా వుండదు........ జీవితకాలం ఒకే రంగు వుండదు.... మనలో ప్రేమ కి గుర్తు...... పసుపు రంగు మనలో స్వచ్చత కి గుర్తు..... తెలుపు రంగు... మనలో శౌర్యానికి గుర్తు...... ఎరుపు రంగు... మనలో సాఫల్యత కి గుర్తు.... ఆకుపచ్చ రంగు మనలో త్యాగానికి గుర్తు.... కాషాయ రంగు మనలో ప్రశాంతత కి గుర్తు..... నీలిరంగు... మనలో అశాంతి కి గుర్తు...... నలుపు రంగు..... ఇలా ప్రతీ రంగు ఒక్కో భావన కు ప్రతీక.... నాకు అనిపించినంత వరకూ... రంగులు మారుతాయి..... మూడు ప్రాథమిక రంగులు తో...... గౌణ రంగుల ఏర్పాటు తెలియనిది కాదు గా..... చిరునవ్వు..... అందమైన రంగు... ఆనందం...... అద్భుతమైన రంగు... ఆప్యాయత.... అనురాగపు రంగు సుఖం..... ఇష్టమైన రంగు... ప్రేమ..... హృదయరాగపు రంగు... కరుణ.... మానవత్వపు రంగు.. కోపం..... విలువలేని రంగు..... జీవితం రంగులు వలయం.... జీవితకాలం లో ఒక్కో రంగు ఒక్కో సమయం లో అద్దుకుంటుంది....... నీకు నచ్చిన రంగు ని అద్దుకోవడం......నీ నీ ఆనందం ఇతరుల కు నచ్చిన రంగు అద్దుకోవడం......నీ త్యాగం విజయం.... సంతోషం... ఓటమి... సుఖం...... అసూయ... దుఃఖం.... కోపం..... కోరిక.... ఎన్ని రంగులో.....కదా మనిషి జీవితంలో...... వీటి మార్పు.... మనిషి జీవితానికి తప్పక అవసరం... అందుకే అప్పుడప్పుడు మార్చే... మారే ప్రయత్నం చేయండి.... జీవితం సప్త వర్ణాల హరివిల్లు గా మారుతుంది... మానవత్వం....దయా....కరుణ....ఈ రంగులు మార్చే ప్రయత్నం మాత్రం చేయవద్దు.... ప్లీజ్ సాయి... స్వర్ణ......

మరిన్ని వ్యాసాలు