ఆలయ సందర్శనం నిత్య కృత్యం కావాలి - సి.హెచ్.ప్రతాప్

Alaya sandarshanam nityakrityam kavali

ప్రపంచం లో ఎక్కడా లేని సంస్కృతి సంప్రదాయాలకు భారాత దేశం లోనే కనిపిస్తాయి. ఆలయాల వెనుక ఉన్న రహాస్యాలు అలాగే ఆలయ సందర్శనం వెనుక ఉన్న ఆరోగ్య రహాస్యాలు ఎన్నో వున్నాయని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కాబట్టే మన భారతీయ సనాతన ధర్మంలో దేవాల‌యానికి వెళ్లడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. రోజువారీ ఆలయ సందర్శనను నిత్య జీవితంలో ఒక భాగంగా చెసుకోమని భారతీయ ఆధ్యాత్మిక తత్వం చెబుతోంది.ఆలయ నిత్య సందర్శన వల్ల భగవంతుని అనుగ్రహం కలగడమే కాకుండా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శాస్త్రం ప్రకారం, ప్రతిరోజూ ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన తర్వాత ఆలయాన్ని సందర్శించడం ద్వారా బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది. దీని కారణంగా, వ్యక్తి మానసిక అభివృద్ధితో ఏకాగ్రత పెరుగుతుంది. ఈ ప్రక్రియ కేవలం మనకు రోజంతా పోజిటివ్ ఎనర్జీ లభిస్తుందని వైద్యులు తమ పరిశోదనలో వెల్లడించారు. ముఖ్యంగా నార్త్ సౌత్ పోల్స్ పీడనం కారణంగా వచ్చే మ్యాగ్నటిక్ ఎలక్ట్రికల్ వేవ్స్ ఎక్కడైతే పంపిణీ జరుగుతుందో.ఆ ప్రదేశం లో పోజిటివ్ ఎనర్జీ ఎక్కువగా లభ్యం కావడం గమనించామని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.ముఖ్యంగా భగవంతుడి మనం లేదా మీరు చేసే అభిషేఖం లో వాడే తులసి, కుంకుమ, పూవులు, కర్పూరం, ఆవు పాలు,పటిక,ఏలకులు,లవంగాలు,కొబ్బరి నీళ్ళు కలిపిన మిశ్రమం తోకూడిన జలాని అభిషేకానికి వినియోగిస్తారు.వీటిలో అన్నిరకాల ఔషద గుణాలు కలిసి ఉన్నాయని భక్తులందరికీ ఈ పవిత్రజలాన్ని మూడు చెంచాలు గా తీర్ధం రూపం లో భక్తులకు ఇస్తూ తీసుకుంటారు. అవి సేవించడం వలన భక్తులకు ఎన్నో రోగాలు నయమవుతాయని ఆయుర్వేదం చెబుతోంది.సాష్టాంగ నమస్కారం లేదా బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల భూమికి ఉన్న మ్యాగ్నేట్ ఫీల్డ్ మన శరీరంలో నాడులకు తగులు తాయనే సాష్టాంగ నమస్కారం దేముడికి చెయ్యమని అంటారు అయితే ఆలయ సందర్శనలో కొన్ని చేయకూడని పనులు కూడా వున్నాయి. చాలామంది దర్శనానంతరం భగవంతుని ఎదురుగా, కాళ్ళుచాపి కూర్చుంటారు… అలా కూర్చోవటం మహాపాపం అట్లే భగవంతుని ఎదుట ఎత్తైన ఆసనాలపై కూర్చోవటం మహాపాపం.


రోజువారీ ఆలయ సందర్శన మనకు క్రమశిక్షణ, స్వీయ నిగ్రహాన్ని నేర్పుతుంది. మనం ఆలయాన్ని సందర్శించడానికి ఒక నిర్దిష్ట స‌మ‌యం లేదా రోజును కేటాయించినప్పుడు అది మన జీవితంలో క్రమశిక్షణ పాఠంగా మారుతుంది. దేవాలయానికి వెళ్ళేటప్పుడు పేదలకు, అభాగ్యుల‌కు అన్నదానం చేయడంతో పాటు ఆల‌యంలో భ‌గ‌వంతుని విగ్రహం ముందు నమస్కరించడం, వ్యక్తిలోని అహంకారాన్ని నాశనం చేస్తుంది.
మనం గుడికి వెళ్లినప్పుడు, నేలపై కూర్చొని, మౌనంగా ధ్యానం చేయడం, గ్రంధాలను చదవడం, భగవంతుడిని పూజించే ఆచారాలలో నిమగ్నమై ఉండటం చాలా అవసరం.

దేహో దేవాలయ: ప్రోక్తో జీవ: ప్రోక్త స్సనాతన:
త్యజేదజ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్‌” అంటోంది శాస్త్రం.


దేహమే దేవాలయం. జీవుడు ఈశ్వర స్వరూపం.అజ్ఞానమనే నైర్మాల్యాన్ని తీసి వేసి… నీవే నేను అనే భావంతో పూజించాలి.ఆత్మకు దేహం ఆలయమైనట్లే, ఇంటికి పూజామందిరం, ఊరికి దేవాలయం అటువంటిది, జీవంలేని దేహం, పూజామందిరంలేని ఇల్లు, దేవాలయంలేని ఊరు సమానమే.కాబట్టి దేవా లయంలేని ఊరి దారిలో పయనించరాదని, ఆఇండ్లలో, ఆ ఊళ్ళల్లో భోజనం చేయ రాదని, చివరకు పచ్చి గంగ కూడా తాగరాదని శాస్తం చెబుతున్నది.

మరిన్ని వ్యాసాలు

మన సినిమాల్లో దెయ్యాల గీతాలు.
మన సినిమాల్లో దెయ్యాల గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Prabhutwa patashala
ప్రభుత్వ పాఠశాల
- అరవ విస్సు
నాటి తూనికలు - కొలతలు.
నాటి తూనికలు - కొలతలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Dandudu-dandakaranyam
దండుడు - దండకారణ్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
యోగా.
యోగా.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు