పురుష సూక్తం ప్రాశస్థ్యం - సి.హెచ్.ప్రతాప్

Purushasooktham prasastyam
 
పురుష సూక్తము హిందూ ధర్మానికి పట్టుకొమ్మ వంటిది. వేద వాజ్మయంలోని మంత్ర భాగానికి చెందినవి సూక్తాలు. సూక్తం అంటే సమగ్రంగా స్వరూప నిరూపణ చెయ్యడం అని అర్థం. ఐహికంగా, ఆముష్మికంగా శాంతి, అభ్యుదయం అన్నవి ఈ సూక్తాల పరమ ప్రయోజనాలు. కాబట్టి మన మహర్షులు వీటిని వివిధ వేదా భాగాల ద్వారా మనకు అందించారు.
 
పవిత్రమైన మనస్సుతో వీటిని నిత్యం మనమం చేసుకోవడం ఎంతో అవసరం.
సృష్టించేవాడు బ్రహ్మ అని, పరిపాలించేవాడు విష్ణువు అని మరియు లయించేవాడు ఈశ్వరుడు అని మన పురాణాలు మనకు తెలిపాయి.
 
ఈ మూడు కూడ ఒకరినుండే జరుగుతున్నాయి. ఒకరే ఈ మూడుగా మారాడు. ఒకటి మూడుగా రూపాంతరం చెందింది. ఇది కూడా ఆ భగవంతుని ఇచ్చానుసారమే జరిగింది. మూడులో ఒకరు అయిన బ్రహ్మ ఆ శక్తినుండే పంచభూతాలను (అగ్ని, నీరు, గాలి, ఆకాశం మరియు భూమి) సృష్టించాడు. కనిపించే ఈ సమస్తమైన నశ్వర పృకృతి ఈ పంచభూతాలనుండే వచ్చింది. అదేవిధంగా మనకు కనిపించే ఈ చరాచర జీవజాలం అంతయు పంచభూతాల ద్వారానే తయారయ్యాయి. మన కండ్లకు కనిపించని ఆ శక్తే భగవంతుడయ్యాడుసమస్త జీవ రాశులు నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకొనుము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తిస్థానము మరియు నా లోనికే ఇది అంతా లయమై పోతుంది అని సాక్షాత్తు భగవంతుడే గీత ద్వారా మనకు స్పష్టం చేసాడు. భగవంతుడే ఈ రెండు శక్తులకి మూల స్థానం; సమస్త సృష్టి ఆయన నుండే వ్యక్తమౌతుంది.
 
బ్రహ్మగారి యొక్క నూరు సంవత్సరములు పూర్తయినప్పుడు, ఈ సృష్టి చక్రం ముగింపు దశ చేరుకున్నప్పుడు, భగవంతుడు ఈ సృష్టిని లయము చేస్తాడు. ఐదు స్థూల మూలకాలు, ఐదు సూక్ష్మతత్త్వాలలో విలీనమౌతాయి.
 
పురుష సూక్తంలో ఈ సృష్టికే మూలపురుషుడైన విరాట్ పురుషుని యొక్క స్వరూప స్వభావ విశేషాలు నిరూపించబడ్డాయి. ఈ సృష్టికి ఆది, అంతం, అన్నీ కూడా భగవంతుదేనని, పరబ్రహ్మమే సత్యమని, ఆయనచే సృష్టించబడిన ఈ జగత్తు అంతా మిధ్య అని ఈ సూక్తం స్పష్టంగా ప్రభోదిస్తుంది. పురుష సూక్తాన్ని శ్రద్ధతో పఠిస్తూ అర్ధం చేసుకుంటే భగవంతుని తత్వం, ఈ సృష్టికి ఆధారం ఏమిటో అర్ధం అవుతుంది. ఫలితంగా అన్నీ మనమే అన్నీ చేస్తున్నాం, అన్నింటికీ మనమే కారణభూతుడన్న అహంకారం నశిస్తుంది. అనుక్షణం చంచలత్వానికి గురయ్యే మనస్సు భగవంతుని పాదాల వద్ద స్థిరమవుతుంది.

మరిన్ని వ్యాసాలు