ప్రభుత్వ పాఠశాల - అరవ విస్సు

Prabhutwa patashala

నవసమాజ నిర్మాణంలో విద్య పాత్ర బహుముఖమైనది.

విద్యను నేర్పించే టీచర్స్ పాత్ర బహుముఖమైన విద్యను విద్యార్ధులకు ఏమేర అందచేస్తున్నారో విశ్లేషిస్తే రక-రకాల అంశాలు బయటకు వస్తాయి వాటిలో కొన్మి

1 ప్రధానోపాధ్యాయులు పనితనం బాగుంటే -ఉపాద్యాయ సిబ్బంది - సహకారం అంతంతమాత్రం. ప్రతీపనికి అడ్డం పెట్టడం, పనినుంచి ఎస్కేప్ అవ్వడం

2 ఉపాద్యాయ సిబ్బంది కష్టపడేవారైతే - ప్రధానోపాధ్యాయుల -నిరాశావాదం- నాకెందుకులే - నన్ను కూడా డామినేట్ చేస్తారేమో అన్న భావన

3 ప్రధానోపాధ్యాయులు- టీచర్స్ కష్టపడి పనిచేసేవారుంటే -పిల్లల్లో విశృంఖలత్వం - టీచర్స్ కే భయం పుట్టిస్తారు - క్రమశిక్షణలో పెడదామంటే ఏమైనా చేసుకుంటే మనమీద కొస్తుందేమో నన్న భయం

4 అన్నీ బాగుండి ఆ పాఠశాలను పురోగతిలో నడిపించుదాం అనుకుంటే గ్రామ రాజకీయాలు ఆ పాఠశాలమీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి -

5 ఇటువంటి పరిస్థితులలోకుడా కొన్ని పాఠశాలలు మాత్రం అద్వితీయమైన ప్రగతి సాధిస్తున్నాయి -నిజంగా అభినందనీయం ఎమైనా ఆరోగ్యకరమైన పోటీ వుండాలి ,

ప్రభుత్వ పాఠశాలలో చదివేవారు ఎక్కువ శాతం పేదవారు . మన విద్యార్ధులగా వున్నప్పుడు ఎటువంటి టీచర్ ను ఇష్టపడేవాళ్ళం -ఎలావుండాలి అనుకునేవాళ్ళం ,మరువకూడదు -పరకాయ ప్రవేశం చేయాలి. కష్టపడి పనిచేసే టీచర్స్ ను ప్రోత్సహించాలి , ప్రోత్సహించకపోయినా పరవాలేదు , నిరాశపరచకూడడు , నిరాశపరిచినా పర్వాలేదు, అడ్డంకులు సృష్టించకూడదు . అందువల్ల కష్టపడి పనిచ చేసే కొద్దిమందికూడా చేయకపోవడం. మనకెందుకులేఈ బాధలు అనుకోవడం. మంచి దానికదే గెలవాలి. గెలవడానికి పోరాటం ఎంతని చేస్తాం . మనం చేయకపోయినా ఇతరులు చేస్తే ఆనందించాలి కదా ! పిల్లలు అన్నీ గమనిస్తారు - పెద్దయ్యాక వారు మదిలో ముద్ర వేసుకున్న టీచర్ గురించి గొప్పగా చెబుతారు కూడా. ఏమైనా పూర్వజన్మ సుకృతం టీచర్ జాబ్ . బాధ్యత అణువణువునా ప్రతిబింబించాలి లేకపోతే తరతరాలను నాశనం చేసినవారు అవుతారు . దేశం నాశనం అవ్వాలంటే, యుద్ధాలే అక్కర్లేదు- విద్యను సరిగా అందివ్వకపోతే , ప్రపంచయుద్ధ దుష్పలితాలు ఎలాంటిలో అంతకంటే దారుణఫలితాలు సమాజంలో చూడవచ్చు . మంచిసమాజ- నిర్మాణంలో మన పాత్రను చక్కగా నిర్వహిద్దాం - శుభం భూయాత్😁

మరిన్ని వ్యాసాలు