పురాణాలలో ఒకే పేరు పలువురికి 2. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.

పురాణాలలో ఒకే పేరు పలువురికి.( 2 )

భరతుడు ...

1)దుష్యంతుని కుమారుడు.షోడశరాజులలో ఒకడు.2) మరొకరు శ్రీరాముని తమ్ముడు. 3) వేరొకరు అగ్ని వంశజుడు.

భానుమతి ...

1)దుర్యోధనుని భార్య.2) నహంయాతి భార్య ( చంద్రవంశము)3) శివ అంగీరసుల కుమార్తె ( అగ్ని వంశము).

భీముడు...

1)సూర్యోపాసనముచే అన్నం సృష్టించి న రాజు. 2) ధర్మరాజు సోదరుడు. 3) విదర్బ రాజు దమయంతి తండ్రి. 4) అగ్ని వంశీయుడైన వహ్ని పుత్రుడు.

మహొదరుడు...

1)దుర్యోధనుని సోదరుడు . 2) శ్రీరాముని చేతిలో మరణించినవాడు. ఇతనీ తలతెగి పడిన ప్రాంతం కపాల మోక్షంగా పేరు పొందింది.3) ఒక ముని.

విశ్వవసువు ...

1) పరశు రాముని సోదరుడు. 2) గంధర్వుడు ఇతను మేనకతో కలసి ప్రముద్వద అనే పుత్రిక కలిగింది. 3) మరో గంధర్వుడు.4) శాపవశాన కబంధుడుగా జన్మించిన వాడు.

విందుడు ...

1) అవంతీశ్వరుడు. దక్షణ దిగ్విజయ యాత్రలో సహదేవుని చేతిలో ఓడిన రాజు. 2) దుర్యోధనుని సోదరుడు.3) కేకయ రాజు.

వేగవంతుడు...

1) ఘటోత్కజుని సేనా నాయకుడు. 2) సాళ్వుని పక్షాన శ్రీకృష్ణుని చేతిలో హతమైన వాడు.3) కేకయ రారాజు.

శతానీకుడు ...

1) విరాటుని సైన్య ప్రముఖుడు. శల్యుని చేతిలో మరణించాడు. 2) ద్రౌపతి,నకులుని పుత్రుడు. 3) పరిక్షిత్తుని మనుమడు.4) విరాటుని తమ్ముడు.

శతృంజయుడు ...

1) సైంధవుని పక్షాన పోరాడిన వాడు.2) భరధ్వాజ వంశ రాజు.3) అభిమన్యుని చేతిలో మరణించిన రాజు.4) పాంచాల రాజు.అశ్వత్ధామ చేతిలో మరణించాడు.

శూరసేనుడు...

1) ఐదుగురు భర్తలు కలిగిన అజిత భర్తలలో ఒకడు.2) సహదేవుని దిగ్విజయ యాత్రలో ఒడిన రాజు.3) పాండవులపక్షన పోరాడి కర్ణుని చేతిలో మరణించిన వాడు. 4) కౌరవ వీరుడు.

శ్రుతసేనుడు...

1) జనమజేయుని తమ్ముడు. 2) అజిత ఐదుగురు భర్తలలో ఒకడు .3) ద్రౌపతి సహదేవుల కుమారుడు. 4) ద్రౌపతి స్వయంవరానికి వచ్చిన రాజు.

సంయాతి ...

1) నహుష,ప్రియంవదల కుమారుడు. 2) ప్రాచీనుని కుమారుడు. 3) చ్యవన మహర్షి భార్య, సుకన్య తండ్రి.

సత్య సేనుడు...

1) భీముని చేతిలో మరణించిన కర్ణుని కుమారుడు.2) త్రిగర్త రాజు సోదరుడు. 3) నకులుని చేతిలో మరణించిన కర్ణుని పుత్రుడు.

సుకుమారుడు...

1) ద్రౌపతి స్వయంవరానికి వచ్చిన రాజు. 2) ధర్మరాజు చక్ర రక్షకుడు.3) భీముని పూర్వ దిగ్విజయ యాత్రలో ఓడిన రాజు.

సుధన్వుడు ...

1) భీముని దిగ్విజయ యాత్రలో ఓడిన దశార్ణ దేశాధిపతి.

2) అంగీరసుని కుమారుడు.3) త్రిగర్త రాజు .4) క్షితి సంశప్తకులలో ఒకడు. 5) ద్రోణుని చేతిలో మరణించిన వీరకేతుని సోదరుడు.

సుమిత్రుడు ...

1) ద్రొణుని చేతిలో మరణించిన పాండవ వీరుడు. 2) భీష్మ,ధర్మరాజులకు హితం చెప్పినవాడు.3) పుళింద పురాధీశుడు .భీముని చేతిలో ఓడిన రాజు.4) సహదేవుని చేతిలో ఓడిన యవనుడు.5) అభిమన్యుని చేతిలో మరణించిన కౌరవ వీరుడు.6) అగ్నివంశజుడు తపుని పుత్రుడు. 7) భార్గవ వంశజుడు.

సురథుడు ...

1) గోటికాశ్యుని తండ్రి.2) క్షితి సంశాప్తకులలోని వీరుడు. 3) పాంచాలరాజు. అశ్వత్ధామ చేతిలో హతుడయ్యిడు.

సుహొత్రుడు ...

1) షోడశ రాజులలో ఒకడు.2) మాద్రి తనయుడైన సహదేవుని విజయల కుమారుడు.3) భూమన్యుని కుమారుడు.

హరి ...

1) శ్రీ మహ విష్ణువు.2) అకంపనుడు అనే రాజు కుమారుడు.3) తారకాక్షుని కుమారుడు.

శంఖ ...

1) కద్రువ కస్యపుల పుత్రుడు. 2) విరాట రాజు పుత్రుడు .ద్రొణుని చేతిలో మరణించాడు.3) లిఖిత మహర్షి సోదరుడు.4) దైత్యులలో ఒకడు.5) కుబేరోపాసకుడు.నిథి శేష్టృలలో ఒకడు. 6) కేకయ రాజకుమారుడు. పాండవ పక్షన పోరాడిన రథి.

శరభ ...

1) తక్షక కులమందు జన్మించిన నాగం.2) ఐరావత కులమందు జన్మించిన నాగం.3) దను కశ్యపుల పుత్రుడు.4) ఋషి.5) ఛేధిరాజు ధృష్టకేతుని అనుజుడు. 6) శకుని సోదరుడు.7) ఒకబలమైన కృర మృగం.

శల ...

1) వాసుకి వంశంలో జన్మించిన నాగం. 2) ధృతరాష్టృని పుత్రులలో ఒకడు.3) సోమదత్తుని పుత్రుడు.శ్రుతకర్మ చేతిలో మరణించాడు.4) పరిక్షిత్తుని కుమారుడు.

శాండలి ...

1) దక్షుని పుత్రిక.ధర్ముని భార్య.2) బుషబ పర్వతపై ఉన్న తపస్విని.3) దేవలోకలో నివసించునది.

శాల్వ ...

1) క్షత్రియ రాజు. 2) పాండవ పక్షమందలి యోధుడు. 3) మ్లేఛ్ఛగణరాజు.

శుక ...

1) శర్యాతి వంశజుడైన ప్రషత పుత్రుడు. 2) రావణాసురుని మంత్రి. 3) గాంధార రాజగు సుబలుని పుత్రుడు.

శుచి ...

1) యమోపాసన చేసే ఒక రాజు. 2) అడవిలో దమయంతి కలసిన వ్యాపారి. 3) అగ్ని.4) విశ్వామిత్రుని బ్రహ్మవాద పుత్రులలో ఒకడు. 5) భృగు మహర్షి పుత్రుడు.

శూర ...

1) ప్రాచీన రాజు.2) రితంధరి ఇలీనుల పుత్రుడు.3) సౌవీర దేశపు రాజకుమారుడు. ఇతడు అర్జనుని చేతిలో మరణించాడు.

సేకరణ :

 

 

 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు