పురాణాలలో ఒకే పేరు పలువురికి-3 - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

పురాణాలలో ఒకే పేరు పలువురికి -3

పురాణాలలో ఒకే పేరున ఉన్న వారు . (3 ).

తారీక్ష్య :

1) కస్యప వినత పుత్రులలో ఒకడు.

2) ఒక ఋషి.

3) క్షత్రియ రాకుమారుడు.

4) శివునికి గలపేరు.

దండ:

1) ఒక క్షత్రియ రాజు మగధ దంఢాదరుని సోదరుడు. క్రోధహంత అనే అసురుని అంశంతో జన్మించాడు.అర్జునుని చేతిలో హతమైనాడు.

2) సూర్యుని అనుచరుడు.

3) యముడు అర్జనునికి ఇచ్చిన అస్త్రం పేరు.

4) చంపా పరిసరాలలో తీర్ధం.

5) ఛేధి దేశ పాండవ పక్ష యోధుడు. యుధ్ధంలో కర్ణుని చేతిలో మరణించాడు.

6) శ్రీమహ విష్ణువు నామం.

దండధార:

1) మగధ క్షత్రియ ప్రభువు. ఇతను క్రోధవర్ధన అనే దైత్యుని అంశంతో జన్మించాడు. భగదత్తునితో సమమైన వీరుడు. యుధ్ధంలో ఇతను ఇతని సోదరుడు అర్జునుని చేతిలో హతమైనారు.

2) ధృతరాష్టృని పుత్రులలో ఒకడు.యుధ్ధంలో భీముని చేతిలో మరణించాడు.

3) పాండవుల పక్షాన పోరాడిన రాజు.యుధ్ధంలో ద్రోణాచార్యుని చేతిలో మరణించాడు.

4) పాంచాల యోధుడు. ధర్మరాజు చక్ర రక్షకుడు. యుధ్ధంలో కర్ణుని చేతిలో మరణించాడు.

దుర్ముఖ :

1) ధృతరాష్టృని కుమారులలో ఒకడు. యుధ్ధంలో భీముని చేతిలో మరణించాడు.అనంతరం ఇతని సుందరభవనం సహదేవునికి ఇచ్చారు.

2) ఒకరాజు. ధర్మరాజుకు మిత్రుడు.

3) ఒక అసురుడు.వరుణో పాసకుడు.

4) పాండవ పక్ష యోధుడు. కర్ణుని చేతిలో హతమైనాడు.

5) ఒక సర్పం.

దుష్యంత :

1) శకుంతలను వివాహం చేసుకున్నవాడు.

2) పూరు వంశీయుడగు అజమీఢుడు నీలి దంపతులకు జన్మించినవాడు.

ధృవ :

1) ధూమ్రా - ధర్మలకు జన్మించిన రెండవ వసువు.

2) నహుషుని పుత్రుడు.యయాతి సోదరుడు.

3) యమోపాసకుడైన ఒకరాజు.

4) కౌరవ పక్ష యోధుడు. యుధ్ధంలో భీమునీ చేతిలో మరణించాడు.

5) ధర్మరాజుకు సహకారిగా ఉన్న ఒక రాజు.

6) ఉత్తానపాధ మహరాజు పుత్రుడు.

నందన : 1) స్వర్గ లోకమందలి దివ్యరధం .

2) అశ్వని కుమారులు స్కందునికి ఇచ్చిన పార్షదు లు ఇద్దరిలో ఒకరు. రెండవవాడు వర్ధనుడు.

3) స్కందుని సైనికులలొ ఒకడు.

4) శివునికి గలపేరు.

5) విష్ణువునకు గల పేరు.

నీల:

1) కద్రూ - కస్యపులకు జన్మించిన వాడు.

2) ఒక రాజు.

3) ఒకపర్వతం.

4) ఒక వానర సేనాపతి.

5) పాండవ పక్ష యోధుడు.

పరిక్షితు :

1) అవిక్షిత్తు ప్రధమ పుత్రుడు.

2) అనశ్వుని పుత్రుడు.

3) ఉత్తర - అభిమన్యుల కుమారుడు.

4) ఇక్ష్వకు వంశీయ రాజు.

5) ప్రాచీన ప్రభువు.

పులోమా :

1) భృగు మహర్షి భార్య .

2) ఒక రాక్షసుడు.

3) దను -కస్యపుల కుమారుడు.

4) దైత్యకుల కన్య.

పుష్కర :

1) పుష్కర క్షేత్రం.తీర్ధం.

2) వరుణ దేవుని ప్రియ పుత్రుడు.

3) నల మహరాజు సోదరుడు.

4) ఒక ద్వీపం.

5) ఒక పర్వతం.

ప్రభావతి :

1) ఒక తపశ్విని.

2) సూర్యుని భార్య .

3) స్కందుని అనుచరుని మాతృక .

4) అంగరాజు అగు చిత్రరధుని భార్య.

బల :

1) కస్యపుని కుమారుడు.

2) దేవి - వరుణులకు జన్మించినవాడు.

3) సుశోభన - పరిక్షిత్తులకు జన్మించిన వాడు.

4) ఒక వానరం.

5) వాయువు స్కందునికి ఇచ్చిన పార్షదులలో ఒకడు.

6) ప్రాచీన ఋషి.

7) సనాతన విశ్వదేవుడు.

బాహ్లిక :

1) ఒకరాజు.

2) ప్రాచీన ప్రభువు.

3) జనమజేయుని పౌత్రుడు .

4) ప్రదీపుని పుత్రుడు.

5) ధర్మరాజు రధ సారధి పేరు.

6) భారతీయ జనపధం.

భీమసేన :

1) పరిక్షీత్తు పుత్రుడు.

2) కస్యపుని పుత్రుడు.

3) పాండురాజు క్షేత్రజ పుత్రుడు.

4) కాశీరాజు దివోసు తండ్రి.

సేకరణ : డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .

9884429899

 

 

మరిన్ని వ్యాసాలు