వెన్నెల వానలో మనం ... - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

vennela vaanalo manam

వెన్నెల ఎక్కువగా సూర్యకాంతిని కలిగి ఉంటుంది (తక్కువ భూకాంతితో). సూర్యుని కాంతి తాకిన చంద్రుని ఉపరితల భాగాల నుండి ప్రతిబింబిస్తుంది. సూర్యకిరణాలు చంద్రునిపై పడి ప్రతిబింబించే కాంతిని వెన్నెల అంటారు. ఇది చంద్రుడు కనిపించే రాత్రి సమయంలో భూమి యొక్క ఉపరితలంపై ప్రకాశిస్తుంది. చంద్రుని తక్కువ పరావర్తనం కారణంగా చంద్రకాంతి సూర్యకాంతి కంటే చాలా మసకగా ఉంటుంది. రాత్రులందు చంద్రుడు నుంచి వెలువడే చల్లని వెలుగును వెన్నెల అంటారు. వెన్నెలను చంద్రకాంతి అని కూడా అంటారు. వెన్నెలను ఆంగ్లంలో మూన్ లైట్ అంటారు. పగలు చంద్రుడు వెన్నెల కురిపించినప్పటికి సూర్యుని వెలుతురు ఎక్కువగా ఉండుట వలన చంద్రకాంతిని గుర్తించలేరు, అందువలన చంద్రుడు రాత్రులందు కురిపించే కాంతినే వెన్నెల అంటారు. తెలుగు సినిమా పాటలలో, కవిత్వాలలో వెన్నెలకు విశేష ప్రాముఖ్యముంది. చంద్రుని నుంచి వెలువడే చంద్రకాంతి, శుక్లపక్షంలో రోజు రోజుకు పెరుగుతూ, కృష్ణ పక్షంలో రోజు రోజుకు తగ్గుతూ ఉంటుంది. అమావాస్య రోజున చంద్రుడు వెన్నెల కురిపించనందున రాత్రులందు చీకటిగా ఉంటుంది. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తిగా వెన్నెల కురిపిస్తాడు, కావున పౌర్ణమి చంద్రుడిని నిండు చంద్రుడు అని కూడా అంటారు.

చంద్రుని షోడశ కళల పేర్లు.

1) అమృత. 2) మానద. 3)పూష. 4) తుష్టి. 5)సృష్టి. 6) రతి. 7) ధృతి. 8) శశిని. 9)చంద్రిక. 10) కాంతి. 11) జ్యోత్స్న. 12) శ్రీ. 13) ప్రీతి.14) అంగద. 15) పూర్ణ. 16) పూర్ణామృత.

ఈ చంద్రకళలలో మార్పులకు కారణం చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాకపోవడమే, సూర్యుని నుంచి పొందినవెలుతురును బట్టి వెన్నెల హెచ్చు తగ్గుల్లో మార్పులుంటాయి. అమావాస్య తరువాత వచ్చే మొదటి వెన్నెలనిచ్చే చంద్రుడిని నెలపొడుపు అంటారు. సూర్యాస్తమయం తరువాత చంద్రోదయంతో వెన్నెల ప్రారంభమవుతుంది. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధంగా వెన్నెలలో కొద్దిగా మార్పులు ఉంటాయి.

భూమిపై అర్ధగోళములో ఎప్పుడూ సూర్యకాంతి ప్రసిరించినట్లే, చంద్రుని అర్ధగోళముపై సూర్యకాంతి సతతం ప్రసరిస్తునే వుంటుంది, ఒక్క చంద్రగ్రహణం సమయంలో తప్పించి. చంద్రకాంతి హెచ్చు తగ్గులుగా మారుటకు కారణం, భూమి చుట్టూ చంద్రుని భ్రమణకాలం, భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టుకాలం, సూర్యుని చుట్టూ భూమి తిరుగుటకు గల భ్రమణ కాలాల వ్యాత్యాసం వలన చంద్రకళలలో తేడాలు, అమవ్యాస, పూర్ణిమలు ఏర్పడుతాయి. ఉదాహరణకు పున్నమి రోజు సూర్యుడు పడమట వున్నప్పుడు, చంద్రుడు తూర్పున వున్నందున సూర్యకాంతి పడు చంద్రుని అర్ధగోళము సంపూర్ణంగా కనిపిస్తుంది. అమవాస్య రోజున సూర్యచంద్రులు పడమటి దిక్కుననే వుండటం వలన చంద్రకాంతి మనకు కనిపించదు.

సాహిత్యంతోపాటుగా సినీ పాటలలకు మన వారు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు వాటిలో కొన్నింటిని చూద్దాం!

' వెన్నెలలోనే వేడిఏలనో '(పెళ్ళినాటి ప్రమాణాలు) ' వెన్నెలలో '(మనుషులు మమతలు) ' వెన్నెలలోని వికాసమే ' ( ఆరాధన) ' వెన్నెలకేల నాపై కోపం ' ( కానిస్టేబుల్ కూతురు) ' వేళచూడ వెన్నెలాయే ' ( నాటకాల రాయుడు) ' విరిసిన వెన్నెలవో ' ( బందిపోటు దొంగలు) ' అటుఎన్నెలా ' ( సాక్షి) ' విరిసె చల్లని వెన్నెల ' (లవకుశ) ' వెన్నెల రేయి'

( రంగులరాట్నం) ' ఈవెన్నెల వెలుగుల్లోన ' ( బ్రహ్మచారి) ' నవమి నాటి వెన్నెల నీవు ' ( శివరంజని) ఇదిమల్లెల వేళయని ' ( సుఖదుఖాఃలు )

పగలే వెన్నెల జగమే ఊయల కదలే ఊహాలకే కన్నులుంటే (పూజాఫలం)

వెన్నెలవే వెన్నెలవే (మెరుపు కలలు)

వెన్నెలా వెన్నెలా మెల్లగా రావే (ప్రేమదేశం)

చల్లని వెన్నెలలో (సంసారం)

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి