1876 లో 'అలగ్జాండర్ గ్రహంబెల్' టెలీఫోన్ కనిపెట్టినప్పుడు దాన్ని మనం 'ఫోన్' ని జేబులో పెట్టుకుని తిరిగేస్తామని ఊహించి వుండకపోవచ్చు. ఈ సెల్ ఫోన్స్ పెరిగిపోవటం వల్ల ఫిక్స్డ్ లైన్ (లాండ్ లైన్) ని వాడటం దాదాపు మానేశాము. అడ్రస్ ఫ్రూఫ్ కోసం మాత్రమే లాండ్ లైన్ వాడుతున్నారంటే అతిశయోక్తి కాదేమో! ఐతే ఈ పరిస్థితి భారతదేశంలోనే ఎక్కువైంది. వేరే దేశాల్లో ముందుగా ఒక వ్యక్తికి ఫోన్ చేయాలంటే 'లాండ్ లైన్' కి చేసి... ఆ వ్యక్తి దొరకకపోతే, మరీ అర్జంటయితేనే హ్యాండ్ ఫోన్ (మొబైల్) కి చేస్తారు, మనం మాత్రం డైరక్టుగా 'సెల్' కే ఫోన్ చేసేస్తున్నాము.
ఐతే ఇప్పుడు మనలో కొందరు అవసరానికి 'సెల్ ఫోన్స్' వాడుతుంటే, కొందరు ఫొజుకి, స్టేటస్ కి వాడుతున్నారు. కొందరు 2,3 ఫోన్లు వాడుతున్నారు. దాన్ని 'ఫోన్ మ్యాను ఫేక్చురర్స్' క్యాష్ చేసుకుంటున్నారు. I Phone 5, Samsung Galaxy 4 ఇలా కొత్తఫోన్లు విడుదల చేయటం... ఇలా! మనవాళ్ళు పాతవి పడేసి కొత్తవి కొనేస్తున్నారు.
మన భారతదేశం లో 92 కోట్ల సెల్ ఫోన్స్ వాడుకలో వున్నాయంటే నమ్ముతారా? 'VIRTUE' అనే కంపెనీ ఫోను 6 లక్షల నుండి మొదలవుతుంది. దాన్ని కొని కొందరు 'స్టేటస్ సింబల్' గా ఫీలవుతారు.
'ఫోన్' అనేది ఆభరణం కాదు. ఆట వస్తువూ కాదు! అది మన అవసరం మాత్రమే! ఇది గుర్తిస్తే చాలు!