నవ్వుల జల్లు - చెక్కా చెన్నకేశవరావు

జానకి రాం : ఉన్నచోటు కదలకుండా ఇంట్లో నుంచే రెండు చేతులా సంపాదిస్తున్నారట, ఏం  వ్యాపారం చేస్తున్నావ్?
త్యాగి         : పావురాల్ని బాగా తర్ఫీదు ఇచ్చి పెంచా. సెల్ ఫోన్లు, SMS ల ఖర్చు లేకుండా, ప్రేమికులకు తక్కువ ఖరీదులో లేఖలు చేరవేయిస్తున్నాను!

 

 



జస్వంత్ : మీ ఆవిడ ఎప్పుడూ ఎవరో ఒకరి ఇంట్లో  సుత్తి కొడుతూ వుంటుంది కదా... వంట ఎప్పుడు చేస్తుంది?
కుటుంబరావు : నేను అన్నం వండుతాను. ఆమె ఐదారు రకాల కూరలు తెస్తుంది .
 



వీరన్న :  రంగులూ, మీ ఆవిడ తరచూ షాపింగ్ కెళ్ళి నీవు దోచినదంతా దుబారా చేస్తునట్లుందే ?
రంగులు :  నీవు చాలా పొరాబడ్డావ్! ఆమె చేసేది ఉత్తుత్తి షాపింగ్. సర్వే చేసి స్కెచ్ గీస్తుంది. నేను రాత్రిళ్ళు అమలు చేస్తుంటాను.  

 



భక్తులు : స్వామీజీ, ఆత్మ సౌందర్యం గురించి వివరించండి.
స్వామీజీ : "ఆత్మ" బహుభాషా నటి. ఆమె సౌందర్యం వర్ణనాతీతం. ఇంకా ఎక్కువ చెబితే నా మనసు గతి అంతే... గల్లంతే

 



రేష్మ :  పెళ్ళై రెండేళ్ళు గడుస్తున్నా... ఇంకా ఏమి విశేషం లేదా?

 

సరళ :  ఆయన ఆశుకవి. అష్టావధాని. పైపెచ్చు సౌందర్యోపాసకులు! ప్రతి రాత్రి నా అందం వర్ణించడం, ఆశు కవిత్వం చెప్పడంతోనే సరిపోతుంది... ప్చ్ !!

 



రతి :  నా కడుపులో పెరుగుతున్నది నీ బిడ్డే సుబ్బూ! ఇది నిజం !
సుబ్బారావు : నాకు అంత సీన్ లేదమ్మా.. కావాలంటే ఈ డాక్టర్ సర్టిఫికేట్ చూడు.. జేబులోనే వుంది ..


 



సూర్యకాంతం :  వదిన గారు, మీ కోడలు మగ్గు నీటితో జానా బెత్తెడు చోట నీళ్ళు చల్లి, మూడే మూడు చుక్కలు పెట్టి వెళ్లి పోయింది. ముగ్గేయడం మరచిపోయిందా..?
అన్నపూర్ణమ్మ :  అదంతే వదినా. ముఖాన పెద్ద బొట్టుకు  బదులు ఆవగింజంత బొట్టు ఎలా పెడుతుందో ముగ్గూ అంతే! అదే ఫ్యాషన్ !
 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు