ఐటెం సాంగ్ - రవిశంకర్ అవధానం

Item Song

"ఏంటీ సంగతి ! టిప్-టాప్ గ తయారయ్యారు. ఈవెనింగ్ వాక్ కి ఈ పూట డుమ్మానే నా?" అంది శకుంతల.

"అవునోయ్, నా ఫ్రెండ్, విద్యానగర్ - మూర్తి వస్తున్నాడు. కాసేపు సరదాగా ఇంట్లోనే గడుపుతాం" అన్నాడు నరసింహం.

"అయ్యో, ఇప్పుడా చెప్పేది? టిఫిన్ - కాఫీ ఏదన్నా రెడీ చేస్తా" అంటూ కిచెన్ కి వెళ్ళింది శకుంతల

కాసేపయ్యాక "ఏంటి మూర్తి పూల చొక్కా? పూలరంగడిలాగా!" అన్నాడు నరసింహం , మూర్తి ని లోపలికి రమ్మని పిలుస్తూ.

"అరవైలో ఇరవై అన్నట్టు, మా గాంధీనగర్ - అబ్బాయి చొక్కా ఇది, వాడు ఎలాగూ వాడట్లేదని నేనే వేసుకుంటున్న" అన్నాడు నవ్వుతూ మూర్తి.

"కధలు చెప్పకు మూర్తి, అప్పట్లో కూడా వేసేవాడివిలే ఇలాంటి షర్ట్లు. ఇంకా ఏంటి సంగతులు " అని పూర్తిగా అడిగే లోపే, " ఊ అంటావా మావా ఉహువుం అంటావా " రింగ్ టోన్ పాట తో సెల్ ఫోన్ మోగింది

"హలో, అరవిందా, ఇప్పుడే నరసింహం ఇంటికొచ్చాను ....... ఒకే….ఒకే…. అలాగే అలాగే … అలాగే " అంటూ పెట్టేసాడు ఫోన్.

"భలే ఐటం సాంగ్ పెట్టావే రింగ్ టోన్ లాగా " అన్నాడు నరసింహం నవ్వుతూ.

"నేను సేఫ్ గా చేరాన లేదా అని ఆమె వాకబు, స్వీట్లు తినొద్దని ఒక హింట్. ఆ పాట గుర్తు చేసుకుంటూ ఎవరన్నా స్వీట్ ఆఫర్ చేస్తే ఊ అంటావా మావా ఉహు అంటావా అని నన్ను నేను గుర్తు చేసుకోవటానికి పెట్టా ఆ రింగ్ టోన్. ఇది ఐటెం సాంగా?" ఎదో అమాయకుడిలాగ ఫేస్ పెదుతూ అడిగాడు మూర్తి.

"ఆహా! కధలు చెప్పకు అన్నానా ఇందాక?" అన్నాడు నరసింహం చిరు నవ్వుతో.

"నో నో, అని మూర్తి అనే లోపే అందుకున్నాడు నరసింహం,

"షుగర్ ఉన్నప్పుడు స్వీట్లు తగ్గించడం మంచిదే లే, మన చేతుల్లో ఉన్నది మనం చేయడమే మన పని. మన చేతుల్లో లేనిది, డాక్టర్లు, WHO కంట్రోల్ చేసే విషయాలు"

"అంటే?" అన్నాడు మూర్తి.

“1990 ల దశకంలో, WHO, అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ (ADA) లాంటి సంస్థలతో కలిసి, షుగర్ వ్యాధి నిర్ధారణకు ఉన్న పరిమితిని తగ్గించింది. మునుపటి పరిమితిలో, 140 mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవల్స్ షుగర్ వ్యాధి ఉన్నట్టు పరిగణించబడేది. అయితే, ఈ పరిమితిని 126 mg/dL గా తగ్గించారు. అంతే కాకుండా, భోజనం తరువాత బ్లడ్ షుగర్ లెవల్స్ పరిమితిని కూడా సవరించారు. ఈ మార్పు అనేక పరిశోధనల ఆధారంగా జరిగింది. దీనిలో 126 mg/dL పరిధిలో ఉన్న వ్యక్తులు కూడా షుగర్ వ్యాధి సంబంధిత సమస్యలు, హృదయ సంబంధిత వ్యాధులు, రెటినోపతి (కళ్ళ వ్యాధి), మూత్రపిండ సమస్యల పట్ల ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని వాదన”

"మరి ఈ బెంచ్మార్కులు తగ్గించబడినప్పుడు, 'ప్రీ-డయాబెటిస్' లేదా 'ప్రమాదంలో ఉన్నారు' అని పూర్వం వర్గీకరించబడిన లక్షల మంది ఆకస్మికంగా డయాబెటిక్గా నిర్ధారించబడ్డారు గా " అన్నాడు మూర్తి.

" కరెక్ట్! రాత్రికి రాత్రే డయాబెటిస్గా వర్గీకరించబడిన వారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను సృష్టించింది, ఎందుకంటే ముందుగా నిర్ధారణ పొందని వ్యక్తులు ఇప్పుడు కొత్త పరిధిలోకి వచ్చారు" అన్నాడు నరసింహం.

"మరి ఈ నిర్ణయం విమర్శకులకు, ప్రభుత్వాలకి ఏమనిపించింది? అడిగాడు మూర్తి .

"దీని వలన పెద్ద గందరగోళమే జరిగింది మూర్తి! కానీ, పక్షపాతులు మాత్రం ఇది వ్యాధిగ్రస్తుల ఆత్మపరిశీలనకు మరియు మెరుగైన నిర్వహణకు దారితీస్తుందని, తద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను నిరోధించవచ్చని వాదనలు చేసారు. ఈ మార్పు వైద్య బెంచ్మార్కులు ప్రజారోగ్యంపై మరియు చికిత్సపై ఎలా ప్రభావితం చేస్తాయనే పెద్ద సమస్యను స్పష్టంచేసింది. ఇది ఫార్మస్యూటికల్ కంపెనీల పాత్రపై చర్చలను కూడా ప్రేరేపించింది, ఎందుకంటే ఈ నిర్ధారణ ప్రమాణాలలో మార్పుల వలన డయాబెటిస్ చికిత్సలకు అర్హులైన వారి సంఖ్య ఆకస్మికంగా పెరిగింది, దాని వల్ల వారి లాభాలు నూ " అన్నాడు నరసింహం.

"అందుకే ఏదైనా పరిమితంగా తింటూ, చేతనైనంత ఆక్టివ్ గా తిరుగుతూ పనులు చేసుకోవటమే మనం చేయగలిగిన పని" అంది శకుంతల, వారు తిన్న ప్లేట్లు, కప్పులు తీస్తూ.

" ఊఉ అంటావా మావా ఉహువుం అంటావా " రింగ్ టోన్ పాట తో సెల్ ఫోన్ మోగింది.

"ఐదు నిమిషాల్లో ఓలా ఆటో హనుమాన్ గుడి దగ్గరికి వస్తుంది, బయలుదేరుతున్నా అరవింద:" అని మూర్తి ఫోన్ పెట్టేసాడు.

"అరవింద ఎప్పుడు చెబుతూంటుంది మీకు యాక్టర్ సమంత అంటే మహా ఇష్టం అని, ఏకంగా ఆమె పాట రింగ్ టోన్ పెట్టేశారన్నమాట " అంది శకుంతల నవ్వుతు.

"అమ్మా మూర్తీ! ఐటం సాంగ్ వెనకాల ఉన్న విషయం ఇదా? అన్నాడు నరసింహం.

"ఇక నే వస్తా" అని, చిలిపిగా కన్నుకొడుతూ సెలవు తీసుకున్నాడు మూర్తి.