పండగలు - రవిశంకర్ అవధానం

Festivals

"Have a nice trip  తేజు! Good Luck!" అంటూ ఫోన్ పెట్టేసాడు నరసింహం తన అమెరికాలో ఉంటున్న మనవడితో మాట్లాడుతూ!

"తేజు ఏదన్న ట్రిప్ వెళుతున్నాడా?" అడిగింది శకుంతల, ఆసక్తిగా.

హాలోవీన్ ఫెస్టివల్ కి లాంగ్ వీకెండ్ అంట!ఎదో సైట్ సీయింగ్ వెళుతున్నాడు ఫ్రెండ్స్ తో"

"హాలోవీన్ ? అదేమీ పండగో? ఎవరి ఆచారాలు వారివి లెండి” అంది.

"అంతేగా! ఎవరి ఆచారాలు వాళ్ళవి. అయినా, చాల పండుగలు ప్రపంచవ్యాప్తంగా కలుస్తాయిలే.కాస్త అటూ-ఇటూ గా . కొన్ని పండగలూ జరుపుకోవటానికి కారణాలు ఒక్కటే , అదే సంప్రదాయం" అన్నాడు నరసింహం.

"అదెలా? సాంప్రదయాల్లో భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది గా" అంది.

"విజ్ఞానం , మేధస్సు పెరిగి , మనిషి కాందిశీకుడిలా తిరుగుతూ తనతో పాటు సంస్కృతి  , సంప్రదాయం విస్తరిస్తూ పోయాడు” అన్నాడు.

"అంటే హాలోవీన్ లాంటి పండగ మనకూ ఉన్నాయా " అంది శకుంతల.

"కొన్ని ఆసక్తికరమైన పోలికలను చూడవచ్చు, మహాలయ అమావాస్య, ఇది పితృదేవతలకి పూజలు, నైవేద్యాల ద్వారా నివాళులు అర్పించడానికి ప్రత్యేకమైన సమయం. అలాగే , హంగ్రీ గోస్ట్ ఫెస్టివల్ (చైనా మరియు తూర్పు ఆసియా) ఆత్మలు మరియు పితృదేవతలను శాంతింపచేసేందుకు పూజలు నిర్వహిస్తారు. ఆత్మలకు శాంతి కలగాలని భోజనం, అగరబత్తులు మరియు ఇతర వస్తువులను నైవేద్యంగా సమర్పిస్తారు అదే హాలోవీన్కి సమానంగా భారతీయ పండుగల్లో భావించవచ్చేది భూత చతుర్దశి మరియు పితృ పక్షం, అయినప్పటికీ అవి పూర్తిగా ఒకేలా ఉండవు " అన్నాడు నరసింహం.

దీపాల పండుగగా ప్రసిద్ధి చెందిన దీపావళి,  దీపాలు వెలిగించడం, బాణసంచా కాల్చడం, మిఠాయిలను పంచుకోవడం, కుటుంబంతో ఆనందంగా జరుపుకోవడం దీని ప్రత్యేకత కదా, అలాగే  హనుక్కా: దీపాల పండుగగానే పిలవబడే హనుక్కా, దేవాలయ పునఃప్రతిష్ట కోసం యూదులు జరుపుకునే పండుగ. దీపావళి లానే, ఇందులో కూడా  దీపాలు వెలిగించి ఉత్సవ భోజనాలు, కుటుంబ సమావేశాలతో జరుపుకుంటారు. అలాగే రంగుల పండుగగా పిలవబడే హోళీ వసంతఋతువులోకి ప్రవేశాన్ని, మంచి విజయాన్ని సూచిస్తుంది.  సోంగ్క్రాన్: థాయ్ లాండ్ లో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించే ఈ పండుగలో పెద్ద ఎత్తున నీటితో ఆటలు ఆడుతారు, పాపాలు తుడిచివేయాలని, కొత్త సంవత్సరాన్ని స్వాగతించాలని సూచిస్తుంది. హోళీ లాగే సోంగ్క్రాన్ కూడా ఆనందం, పవిత్రత మరియు స్నేహం యొక్క సమయాన్ని సూచిస్తుంది. విషు, అదే మన కేరళ లో జరుపుకొనే పండగ మరియు శ్రీలంక సింహళీ కొత్త సంవత్సరం లాగే  ఉంటుంది. మరో కేరళ పండగ ఓనం ,  మరియు అమెరికా,కెనడా లో జరుపుకొనే థాంక్స్ -గివింగ్ కి పోలికలు ఉంటాయి . ఋతువులని ఆధారంగా మనం చేసుకుకునే సంక్రాంతికి  రష్యా లో జరువుకునే మస్లెనిట్సా పండగకి పోలికలుంటాయి . చుసియోక్, ఇది ప్రధాన దక్షిణ కొరియా  పండుగ , ప్రధానంగా వైవాహిక విశ్వాసం కాకపోయినా, కుటుంబ శ్రేయస్సు మరియు ఆశీర్వాదాలపై దృష్టి పెడుతుంది , ఇది మన కర్వాచౌత్ పండగలాంటిదనుకో , ఇంకా " తన మాట పూర్తికాకుండానే , శకుంతల అందుకుంది ,

" మాటల్లో మరిచే పోయాం రేపే కదా కార్తీక మాసం మొదలు ?" అంది .

“కార్తీక మాసం సమయంలో భక్తులు ఉపవాసాలు పాటిస్తారు, దీపారాధన చేస్తారు మరియు దేవాలయాలను సందర్శిస్తారు. చాలా మంది మాంసాహారాన్ని తినకుండా  , ఈ నెలలో ప్రార్థనలు మరియు పూజా కార్యక్రమాలకు కట్టుబడుతుంటారు.

ఈ పర్వ దినాల మన ఆచారం లాగానే ,పాశ్చాత్య క్రైస్తవుల “లెంట్” పండుగకు సమానమైన కొన్ని పండుగలు మరియు ఆచారాలు ఉన్నాయి, వీటిలో ఉపవాసం, ప్రార్థన మరియు ఆధ్యాత్మిక ఆత్మవిశ్లేషణ ఉంటుంది. తెలుగు సంస్కృతిలో ఇలాంటి ఆధ్యాత్మిక భావాలను ప్రతిబింబించే కొన్ని పండుగలు మరియు ఆచారాలు ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లో , లఠ్ మారీ హోళీ పండగ లో  మహిళలు  కర్రలను (లఠ్లు) పట్టుకొని పురుషులను చమత్కారంగా కొడతారు. పురుషులు రక్షణ కవచాలు చేతబట్టి తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది రాధా-కృష్ణుల కథ ఆధారంగా ఆచరించే సంప్రదాయం. దీనికి సరితూగే పండగ మనకు లేదా ? అని అడిగేవు . దానికి పండగ పబ్బం లేకుండా మొగుడు పెళ్ళాలు రోజూ చేసుకునేదే గా" అంటూ తన కంటి అద్దాలు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు నరసింహం.