వేదీయ భోజనం - రవిశంకర్ అవధానం

Vediya Bhajanam

సార్ , ఈ అడ్రెస్స్ , విద్యానగర్ రైల్వే కట్ట కింద నుంచి పోయి , ఆంజనేయస్వామి గుడి సందు లో వెళ్ళాలి కదా ? అడిగాడు డ్రైవర్.

“కరెక్ట్ , అదే సందు!” అన్నాడు నరసింహం.

"ఏ/సీ పెంచమంటారా సార్? "అన్నాడు నరసింహం తో ఊబర్ డ్రైవర్

"వద్దు బాబు, నీకు ఓకే అయితే, కాస్త విండో గ్లాస్ దించుతాను, ఫ్రెష్ గాలి వస్తుంది " అన్నాడు నరసింహం.

"నో ప్రాబ్లెమ్ సర్! ఇలాంటి ప్యాసింజర్లు దొరకడమే అరుదు. చాల మట్టుకు అందరు ఏ /సీ లేదనో , ఏ /సీ తక్కువనో అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు" అన్నాడు నవ్వుతూ డ్రైవర్.

"మా నర్సింహం కొన్ని సార్లు అర్థం కాడు బాబు! మోడరన్ గా ఉన్నట్టే ఉంటాడు కానీ బాగా పాత కాలం మనిషిలా చేస్తాడు " అన్నాడు మూర్తి డ్రైవర్ తో .

"అవునా సార్! మీ ఇద్దరి సంభాషణ చాలా సరదాగా ఉంది. ఏదన్నా ఫంక్షన్ నుంచి వస్తున్నారా " అడిగాడు డ్రైవర్ . డ్రైవర్స్ కి కాస్త టైంపాస్ కావాలిగా పాపం .

"వెళ్ళాం కానీ, మా వాడు సరిగా తినలేదోయ్. వట్టి ఫలహారమే" అన్నాడు మూర్తి డ్రైవర్ తో .

"నాకీ మోడర్న్ ఫుడ్స్ అంతగా నచ్చదయ్యా.

ఎంచేస్తాం చెప్పు ?"అన్నాడు నరసింహం నవ్వుతూ .

"లేకపోతే నీకు ఇప్పుడు వేదీయ భోజనం ఎక్కడ దొరుకుతుంది నరసింహం " అన్నాడు మూర్తి.

" దొరకదనుకో, ఏదో గుడ్డి లో మెల్ల లాగా, వీలున్నంత మనమే సర్దుబాటు చేసుకోవాలి మూర్తి!" అన్నాడు నరసింహం, కార్ విండో నుంచి బైటకు చూస్తూ .

" సార్, మీరేమి అనుకోకుంటే, వేదీయ భోజనం అంటే ఏంటో చెబుతారా? మనకీ 45 మినిట్స్ ప్రయాణం ఎలాగూ ఉంది " అన్నాడు డ్రైవర్ ఉత్సాహంగా

"వేదాలు సూచించిన ఆహారపు విధానం, అంటే "వేదీయ భోజనం", ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన సూత్రాలను నిర్దేశిస్తుంది. వేదాల్లో పేర్కొన్న భోజన విధానాలు మన శరీరానికీ, మనసుకు శ్రేయస్సు కలిగించేలా ఉంటాయి. వేద కాలంలో ఆహారాన్ని ఒక యజ్ఞంలా భావించేవారు, అంటే భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఆహారాన్ని గౌరవించేవారు .

వేదాల ప్రకారం ఆహారంలో సహజమైన, శుద్ధమైన పదార్థాలు ఉండాలి, ఇవి మన శరీరానికి శక్తినిచ్చేలా ఉండాలి.

"ఆహా ఎంత చక్కగా చెప్పారు సార్. మరి అలాంటి ఆహరం మనం ఎలా ఎంచుకోవాలి ?" అన్నాడు డ్రైవర్.

"వేదాల ప్రకారం, సాత్విక ఆహారమే మనకు ఉత్తమం. సాత్విక ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, పాలు, ధాన్యాలు, క్షీర పదార్థాలు మొదలైనవి ఉంటాయి. ఈ ఆహారం శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. వేదాల్లో ఫ్రెష్గా తినే పదార్థాలను ప్రాధాన్యమిచ్చారు"

" కొన్ని సార్లు మాకు అది కష్టం సార్. డ్యూటీ లో ఉంటాం కదా !. అన్నాడు డ్రైవర్ నవ్వుతూ.

"నిజమే, ఎంత వీలుంటే అంత పాటించాలి. వేదాలలో రాత్రి తిండి తక్కువగా తీసుకోవడం ముఖ్యంగా చెప్పబడింది.

ఉదయం, మధ్యాహ్నం బాగా ఆహారం తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి తిన్న ఆహారం ఉదయానికి మానసిక, శరీర శ్రామిక శక్తిని పెంచడానికి పనికివస్తుంది. ఆహరం దేవుడిచ్చిన వరం. అందుకే , ఆహారాన్ని శ్రద్ధగా తినడం ముఖ్యం. తినేటప్పుడు శాంతంగా ఉండి ఆహారాన్ని జీర్ణించాలి. త్వరగా-త్వరగా తినటం లేదా , కోప తాపాలతో తినటం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటారు.

శరీరం కోసం కావాల్సిన అన్ని పోషక పదార్థాలు సమతుల్యంగా ఉండేలా ఆహారం తీసుకోవడం ముఖ్యం. వేదాల్లో అన్నం, దాల్చి, కూరగాయలు, పాలు, పప్పు వంటివి సమతుల్యమైన విధంగా తీసుకోవాలని సూచించారు. ఫలితంగా, జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది, శరీరానికి శక్తి ఎక్కువగా లభిస్తుంది, మరియు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి” అన్నాడు నరసింహం.

"మోడరన్ డైట్స్ కూడా వేదీయ భోజన వైపు మళ్ళడం ఇప్పుడు చూస్తున్నాం కదా " అన్నాడు మూర్తి నరసింహం వైపు తిరిగి.

"మొదట్లో లో-కార్బ్, లో-ఫ్యాట్ వంటి డైట్స్ ప్రాచుర్యంలోకి వచ్చాయి. తర్వాత మళ్లీ గ్లూటెన్-ఫ్రీ, వేగన్ వంటి ఆహార పద్ధతులు ప్రాముఖ్యాన్ని పొందాయి. ఈ ఆహార విధానాలు ఒక దశలో వీటి లోని లోపాల వల్ల బాగా విమర్శలందుకున్నాయి. చివరికి శాస్త్రవేత్తలు, న్యూట్రిషనిస్టులు మితమైన ఆహారం తీసుకోవడం మరియు సహజమైన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదని నిర్ధారించారు. వేదీయ ఆహారం శరీరానికి సరిగ్గా అవసరమైన పోషకాలు, పిండిపదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్ల సమతుల్యంగా ఉండేలా ఉంటుంది. అందుకే ఇప్పుడు మళ్లీ ఆధునిక డైట్స్ అన్నీ, వేదాల ఆహార పద్ధతికి దగ్గరగా వస్తున్నాయి. వేదీయ భోజనం సమతుల్యమైన, సహజమైన ఆహారం ద్వారా మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందని దశాబ్దాలుగా వేదాలు సూచిస్తున్నాయి. ఏది తిన్నా , మన కడుపుని 5 భాగాలూ చేసి , 2 భాగాలూ ఆహారం , 2 భాగాలూ నీళ్లు , 1 భాగం కాళీగా అంటే గాలి కోసం వదలాలి అంటుంది వేదం" అన్నాడు నరసింహం.

"సూప్, సైడ్స్, స్టార్టర్స్, డెసర్ట్స్, డ్రెస్సింగ్స్ ఇవన్నీ మన ఫుడ్స్ లో ఎక్కడున్నాయి నరసింహం" అంటూ కాస్త వ్యంగ్యంగా అన్నాడు మూర్తి.

"కచ్చితంగా ఉన్నాయ్. మనం మొదట తినే పచ్చడి, అదే ఆవకాయలాంటివి మన ఆకలిని పెంచుతాయి , సూప్ లాగ. మన సైడ్ డిషెస్ కూరలు , వడియాలు వగైరా.ఇక డ్రెస్సింగ్స్ అంటావా ఎంచక్కా నెయ్యి ఉండనే ఉంది గా! కమ్మని సువాసన తో. మనకు రాని స్వీట్సా చెప్పు? అవే డెసెర్ట్స్ మరి.

మసాలాలు , కారాలు ఇలాంటి అసిడిక్ ఆహరం తిన్నాక,కమ్మటి పెరుగు తింటే , అదొక బేస్ లాగా పని చేస్తూ మన అసిడిటీని తగ్గిచ్చేస్తుంది. పెరుగు ఒక మంచి ప్రో-బయాటిక్ పదార్థం మూర్తీ !ప్రపంచం లోనే చివరిగా అన్నంలో పెరుగు తినే ఏకైక సంస్కృతి మనదే. ఏ దేశస్తులు తినే దాఖలాలు లేవు" అన్నాడు నరసింహం.

"ఎలాగూ అదే రూట్ కదా, మాంచి ఐస్క్రీమ్ తిని వెళదామా "అన్నాడు మూర్తి నరసింహం తో.

"మూర్తీ, నువ్వు మారవయ్య! అని నరసింహం అనగానే అందరూ టక్కున నవ్వేశారు .

మరిన్ని వ్యాసాలు