
"రా చారి ! చాలా రోజులైంది కదా మనం కలిసి ? అంతా బాగున్నారా ?" ఆప్యాయంగా ఆహ్వానించాడు నరసింహం , పక్కఫ్లాట్ ప్రహల్లాదాచారిని.
"ఆల్ ఓకే ! మీరెలా ఉన్నారు? మీ ఆవిడ కనిపించదే?"అన్నాడు చారి.
"బాగున్నాం చారి! ఆవిడ శంకర మఠం, అలాగే నల్లకుంట కూరల మార్కెట్ వెళ్ళింది . ఏంటి ఇలా వచ్చారు , ఎమన్నా విశేషమా ?" అన్నాడు నరసింహం.
" ఏ బ్యాంకు మంచిదో , ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువో , మీ సలహా కోసం వచ్చా” అన్నాడు చారి నవ్వుతూ.
నరసింహం రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయ్ కావటం , చుట్టుపక్కల వాళ్ళు అయన సలహా తీసుకోవడం మాములే.
"అన్ని బ్యాంకులు అంతే చారి ! పేరుకే ఇంట్రెస్ట్ కానీ అది అంత ఇంట్రెస్టింగా ఉండదు ! మనకు వేరే గత్యంతరం లేదు గా? మార్కెట్ ద్రవ్యోల్బణం అదే, ఇన్ఫ్లేషన్ తో పోలిస్తే , రాబడి దాదాపుగా ఏమీ లేనట్టే " అన్నాడు నరసింహం.
"మన దేశమే అంత " అన్నాడు చారి.
"లేదు లేదు , మన దేశం చాలా బెట్టర్" అన్నాడు నరసింహం నవ్వుతు .
" అదెలా ? "అన్నాడు చారి.
"భారతదేశంలో, బ్యాంకులు అందించే ఫిక్స్డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేటు, సాధారణంగా ద్రవ్యోల్బణ రేటుతో పోలిస్తే వెనుకబడి ఉంటుంది, ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. సాధారణంగా, భారతదేశంలోని బ్యాంకులు వార్షికంగా 5.5% నుండి 7.5% వరకు FD వడ్డీ రేట్లు అందిస్తాయి, భారతదేశంలో ద్రవ్యోల్బణ రేటు, వినియోగదారుల ధర సూచిక (CPI) 6% నుండి 8% వరకు మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అది ఎక్కువగా పెరుగుతుంది. కోవిడ్ వల్ల , 2024లో ప్రపంచవ్యాప్తంగా వస్తువుల బాగా ధరలు పెరగడం మరియు, దేశీయంగా ఆహారధరలు పెరగడం వంటి కారణాలతో, ఈ రేటు 7%కి మించిన సందర్భాలూ ఉన్నాయి" అన్నాడు నరసింహం , నవ్వుతూ.
" సో , ద్రవ్యోల్బణం FD వడ్డీ రేటును మించినప్పుడు, FD పెట్టుబడులపై నిజమైన లాభాలు నెగటివ్గా మారతాయి. ఉదాహరణకు, FD రేటు 6% ఉంటే అదే సమయం లో , ద్రవ్యోల్బణం 7% ఉన్నప్పుడు, మీ FD లాభాల కొనుగోలు శక్తి 1% తగ్గుతుంది కదా" అన్నాడు చారి కళ్ళు పెద్దవిగా చేస్తూ .
"అంతటితో ఆగదు చారీ ! ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం FD వడ్డీపై పన్ను విధించబడుతుంది, దీని వల్ల మొత్తం లాభాలు తగ్గిపోతాయి. ఎక్కువ పన్ను శ్రేణిలో ఉన్నవారికి, పన్నుల తరువాత రాబడులు ద్రవ్యోల్బణ రేటును సరిసమానంగా లేదా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, దీని వల్ల నిజమైన ఆదాయ నష్టం మరింత పెరుగుతుంది” అన్నాడు నరసింహం.
“ఇక మనం బ్యాంకుల్లో డబ్బు పెట్టడం దేనికీ ? దండగ!” అన్నాడు చారి.
" బ్యాంకుల్లో డబ్బు FD లు గా పెట్టడం వల్ల , బ్యాంకులు వాటికి భద్రతను కల్పిస్తాయి లే. కానీ ద్రవ్యోల్బణానికి సరితూగే లాభాలను సాధారణంగా అందించవు, దీని వల్ల నిజమైన ఆర్థిక విలువ తగ్గిపోతుంది. అందుకే , చాలామంది పెట్టుబడిదారులు వివిధ పెట్టుబడులను, షేర్లు, బాండ్లు లేదా ద్రవ్యోల్బణ-సంసిద్ధి సాధనాలను కలిగి ఉన్న వివిధ పెట్టుబడుల మార్గాలను పరిశీలిస్తున్నారు, కానీ ఇవి FDల కంటే ఎక్కువ రిస్క్ కలిగి ఉంటాయి. పదేళ్ల క్రితం ₹500తో చేయగలిగిన కొనుగోళ్లు మనకు తెలుసుగా!, ఇప్పుడు అదే డబ్బుకి , కప్పు కాఫీ, ఒక సమోసా వస్తాయోమో. ఇలాగే ఉంటే, భవిష్యత్తులో ₹500కి చిల్లర లేదని షాపువాడు ఉంచేసుకుంటాడేమో . అరెరే ! మాటల్లోపడి మర్చిపోయాను , బాలాజీ మిఠాయి షాపు సమోసాలున్నాయ్ . తిని , టీ తాగుదామా ?" అన్నాడు నరసింహం .
"ఇదంతా , విన్నాక ఛాయ్ కాదు నరసింహం , ఇంటికెళ్లి , రెండు పెగ్గులు వెయ్యాలి , వస్తా " అన్నాడు చారి , నవ్వ్వుతూ .