ప్రేమ - బన్ను

Love

"I Love You" అని ఒక్క క్షణంలో చెప్పేస్తున్నారు నేటి యువత. కానీ... అది నిజమని నిరూపించుకోవటానికి జీవితకాలం పడుతుందని తెలీదు పాపం! 'ప్రేమ' అనేది ఒక్క ప్రేమికులకు సంబంధించిన విషయం కాదు - 'తల్లి ప్రేమ', 'తండ్రి ప్రేమ', 'అన్న ప్రేమ', 'చెల్లి ప్రేమ', 'స్నేహితుడి ప్రేమ'... ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో!!

'మన్మధుడు' సినిమాలో "తను ముందు నన్ను ప్రేమించింది... తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది" అనే డైలాగ్ మనల్ని బాగా నవ్వించింది. కానీ... అది నిజ జీవితంలో కొన్నిచోట్ల నిజమౌతుంది సుమా! భార్యాభర్తల విషయంలో కానివ్వండీ... లేక వేరే విషయాల్లో కానివ్వండి...!

'ప్రేమ' అనేది ఒక అద్భుతమైన అనుభూతి. దానిమీద ఎన్ని సినిమాలొచ్చినా చూస్తాము. 'బొమ్మరిల్లు' సినిమాలో 'తండ్రి ప్రేమ' ని చూపించి కళ్ళనీళ్ళు పెట్టించాడా డైరెక్టరు.

'ప్రేమ' అనేది మానవుల సొంతం అనుకుంటాను. 'ప్రేమ' లేకపోతే మనిషికీ. జంతువులకీ తేడా ఏముంటుంది? నిజం చెప్పాలంటే కొన్ని జంతువులకి కూడా ప్రేమలుంటాయి. దానికి 'కుక్క' ఉదాహరణ! కానీ దాని ప్రేమని మనం 'విశ్వాసం' అంటాము. ప్రేమలేని మానవుడుండడనే నా నమ్మకం... ఎందుకంటే మనం పెంచుకునే 'కుక్క'ని కూడా మనం ప్రేమగా చూస్తాం కాబట్టి..!! "మనం ప్రేమించే వాళ్ళకన్నా... మనల్ని ప్రేమించే వాళ్ళకి విలువివ్వాలి!"

 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు