కాకూలు - సాయిరాం ఆకుండి

రైతు కష్టం కన్నీళ్ళ పాలు
వాయిదా కట్టలేని నిస్సహాయత
కష్టాలకు ఎదురీదే రైతుల తలరాత!

ఫాయిదా లేని బతుకు తెరువు అవస్థ...
బాధ్యత ఎరుగని పరిపాలనా వ్యవస్థ!!
 

మండే బండి
మంటల్లో బస్సులూ రైళ్ళు...
క్షణాల్లో నిండిపోయే నూరేళ్ళు!

ప్రయాణమంటే గుండెల్లో రైళ్ళు...
పచ్చని బతుకుల్లో కన్నీళ్ళు!!


 

కరెన్సీ కాపురాలు
భరణాలతో బంధాలను...
తెంచుకోవడం... నేటి సంస్కృతి!

సహజీవనమనే చోద్యాలను...
సమర్ధించడం... ఇదో దుర్గతి!!