అటఁ జని కాంచె భూమిసురుఁ డంబరచుంబి శిర స్సర జ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్
గటక చర త్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
కనుమూసి తెరిచేలోగా హిమాలయమును చేరుకున్న ప్రవరుడు ఆకాశాన్ని అంటుతున్న శిఖరములతో ప్రకాశిస్తున్న
హిమాలయాన్ని చూశాడు. ఆ శిఖరములనుండి నేలమీదకు దూకుతున్న, దొర్లుతున్న, పారుతున్న జలపాతముల
తరంగములుచేస్తున్న మృదంగధ్వనులతోకూడిన హిమాలయాన్నిచూశాడు. ఆ మృదంగనాదములకు
అనుకూలముగా పురులువిప్పి ఆడుతున్న నెమళ్ళ బృందములతో అలరారుతున్న హిమాలయాన్ని చూశాడు.
మదించిన ఆడఏనుగులు తమ తొండములతో చుట్టి ఊపి పడెయ్యడానికి ప్రయత్నిస్తుంటే కంపిస్తున్న మద్దిచెట్లతో
మనోహరంగా ఉన్న హిమాలయాన్ని చూశాడు. మదిం
శిలాసౌధశిఖరాయమానమైన శీలసౌధమును
వరూధిని ధ్వనిస్తున్నది ఇక్కడ, ఆ దుడుకుచేష్టకు, విశృంఖల స్వైరిణీ ప్రవర్తనకు కంపించిపోయినా, చలించకుండా
నిలిచిన ప్రవరుడు మద్దిచెట్టులా సూచిం
ఆ సుందరతరమైనహిమాలయాన్నిచూసి ఆనందపారవశ్యముతో..
నారా నారాయణ చరణాం
బురుహద్వయ భద్రచిహ్న ముద్రిత బదరీ
తరుషండ మండలాంతర
సరణిన్ ధరణీసురుండు సనఁ జన నెదుటన్
నరనారాయణులు తపస్సుచేసిన కారణంగా వారి శుభ పాదపద్మముల చిహ్నములు ముద్రింపబడిన పవిత్ర భూమిని,
రేగుపండ్ల చెట్లతో నిండి నరనారాయణుల తపస్సును భగ్నం చేయడం కోసం రంభ, మేనక మొదలైన దేవలోక నర్తకీ
మణులను దేవేంద్రుడు పంపితే, వారి కామవికారచేష్టలకు, నృత్యములకు కోపించిన నారాయణుడు ‘భడవాకానల్లారా!
మీరెంత? మీ అందమెంత?’ అని తన తొడను చరిస్తే ఆ తొడనుండి, ‘ఊరువు’నుండి ఊర్వశి పుట్టింది.
అలాంటి నరనారాయణుల భద్ర చరణములు ముద్రింపబడిన రేగుచెట్ల సమూహముగుండా నడుస్తున్నాడు ప్రవరుడు.
వారి భద్ర పాదముద్రికల అభయం ఉన్న నిశ్చలమతి ప్రవరుడు. అదే ‘సరణి’లో అంటే అదేవిధంగా, ఆ నారాయణునిలానే
ఇక్కడ దేవవేశ్య, దేవనర్తకి ఐన వరూధినిని ధిక్కరించి, ఛీత్కరించి, త్రుణీకరించినవాడు ప్రవరుడు!
అలౌకికమైన ఆనందానికి, విభ్రమానికీ గురి అవుతూ ఆ హిమవత్పర్వత సీమలో విహరిస్తూ, అందుగు చెట్ల చిగురాకులను
అందుకోడానికి ప్రయత్నిస్తున్న ఏనుగులను, వేటాడి అలసి, ఆకలి తీరి గుర్రుపెట్టి నిదిరిస్తున్న పెద్దపులులను, సెలయేటి
తీరములలోని ఇసుకతిన్నెలను ముట్టెతో పెకిలించివేస్తున్న అడవిపందులను, అడ్డదిడ్డంగా గంతులేస్తున్న మనుబిళ్ళను
చూస్తూ నడుస్తున్నాడు ప్రవరుడు.
భగీరథుడు తపస్సుచేసిన స్థలాన్ని చూస్తూ, ఆకాశాదేవగంగాప్రవాహవేగానికి కన్నం పడి, భూమి అడుగున భూమిని
మోస్తున్న ఆది కూర్మపు వెన్ను బయటపడిన స్థలాన్ని చూస్తూ, సుకుమార యవ్వనతనూలతను కృశింపజేసి, ఆకులను
కూడా తినకుండా అపర్ణయై తపించి పార్వతి ఆయాసపడిన చోటును చూస్తూ, జగత్కళ్యాణం కోసం మన్మథుడు పరమశివుని
మోహితుడిని చేయడానికి ప్రయత్నించి బూడిదయైన చోటును చూస్తూ, మునిపత్నుల ముగ్ధ సౌందర్యాన్ని తలచి అగ్నిదేవుడు
విరహంతో కాగిపోయిన చోటును చూస్తూ నడుస్తున్నాడు ప్రవరుడు.
ఓ హిమాలయ పర్వతరాజమా! ప్రళయకాల మహాగ్నికి మాడి, మరలా తేరుకుని, ఓషధులను మొలచేట్లుగా చేసే స్థైర్యాన్ని
భూమాత నీ చల్లని స్పర్శ లేకుండా ప్రతి కల్పాంతరంలో ఎలా పొందగలదు? నీకు నమస్సులు నీహార తేజమా! అని హిమాలయ
పర్వతసీమకు దండాలు పెడుతూ నడుస్తున్నాడు ప్రవరుడు.
నాగయజ్ఞోపవీతి నటరాజు నిలయాన్ని చూశాడు. శచీదేవికి ఈత నేర్పుతూ దేవేంద్రుడు జలకాలాటలు ఆడిన స్థలాన్ని చూశాడు.
పృథ్విని గోవుగా చేసి, ఆ గోవు చేపగా పాలను ఓషధులుగాజేసి, పృథుచక్రవర్తి పిదికిన స్థలాన్ని చూశాడు. దేవకాంతలలో
మిన్నయై విర్రవీగే హిమవంతుని భార్య ఐన మేనకాదేవి (మేనాదేవి) నవరత్న భూషణముల శోభను తిలకిస్తూ, ఆభరణముల
ధ్వనులను ఆలకిస్తూ చరిస్తున్నాడు ప్రవరుడు. చివరి
వింతలూ విశేషాలూ మరలా రేపటిరోజునవచ్చి చూస్తాను, మధ్
వెళ్తాను అనుకుని, హిమాలయపర్వతభూమిపైన ఉన్న మంచు కారణంగా కాళ్ళకు రాసు
ఎగురలేకపోయాడు ప్రవరుడు!
తన ఆకాశయానశక్తిని, దివ్యయానశక్తిని కోల్పోయినట్లు గ్రహించి ‘హా దైవమా! ఇలా నన్ను ఈ ఘోర వనప్రదేశానికి, ఆ సిద్ధుడి
ఆపదేశానికి (ఉపదేశానికి కాదు!) ఎరగా చేశావా?
ఎక్కడి యరుణాస్పదపుర
మెక్కడి తుహినాద్రి? క్రొవ్వి యే రాఁదగునే?
యక్కట! మును సనుదెంచిన
ది క్కిదియని ఎఱుఁగ వెడలు తెరువెయ్యదియో?
ఎక్కడి అరుణాస్పదపురము? ఎక్కడి హిమాలయ సీమ? ఒళ్ళు బలిసి నేను రావడం తగిన పనేనా? (క్రొవ్వి యే రాఁదగునే?)
అయ్యో! నేను వచ్చిన మార్గం ఇదీ అని తెలియడం లేదే! వెళ్ళాల్సిన మార్గం ఏదో ఎలా తెలుస్తుంది? ఆ ఔషధమహిమను
తెలుసుకోడానికి ఏ మాయావతి, ద్వారక, అవంతి, కాశి, కురుక్షేత్రము, గయా, ప్రయాగలకో వెళ్ళకుండా మదపుటేనుగులు,
సింహాలు, పెద్దపులులు, ఖడ్గమృగాలు, అడవిపందులూ కావాలని ఈ కొండకు రావడం ఏమిటి? బుద్ధిలేని వెర్రిబాగులవాళ్ళు
నాలాంటి వాళ్ళు!
ఒక్కనిముషం నేను కనపడకుంటే ఊరంతా గాలించే మా నాన్న, అసుర సంధ్య వేళరా నాన్నా! ఇప్పుడెక్కడికీ వెళ్ళకు! అని
నన్ను వారించే మా పిచ్చితల్లి, అనుకూలవతియై నా మనసునెరిగి నడచుకునే నా ఇల్లాలు, నా చేదోడువాదోడుగా నడచే నా
శిష్యులు నా గురించి ఎంత కలతచెందుతారోకదా! అతిథిసంతర్పణలు ఏమౌతాయి? అగ్నికార్యాలు ఏమౌతాయి? నిత్యకృత్యాలకు
దూరము చేసి ఈ ఆకాశం విరిగిపడ్డ చోట(!) నగమూ గగనమూ ఏకమైనచోటకు నన్ను కోపంతో తెచ్చి పడేశావా దేవుడా? అని
విలపిస్తూ నన్ను ఇల్లు చేర్చే పుణ్యాత్ముడు ఎవరైనా కనపడుతారేమో అని వెదకుతూ, పరిపరివిధాల ఆలోచిస్తూ
ఒక లోయకు చేరుకున్నాడు ప్రవరుడు.
తీగలు, లతలు, ఫల వృక్షములు దట్టముగా అల్లుకుపోయి, కోకిలలు, గోరువంకలు, చిలుకలు, నెమళ్ళు, తుమ్మెదలు, హంసలు
చేస్తున్న మధురమైన ధ్వనులకు ప్రతిధ్వనులు చేస్తున్న చంద్రకాంత శిలామయమైన దరులు కలిగిన సెలయేళ్ళు ఉన్న లోయను
చేరుకున్నాడు ప్రవరుడు. ఆ ప్రదేశపు తీరును గమనించి ఇదేదో ముని ఆశ్రమము లా ఉన్నది, ఇక్కడ నాకు ఏదైనా ఒక దారి
దొరుకుతుందేమో అనే ఆశతో దిగులు కొద్దిగా తగ్గి, ఒక జలపాతపు అంచువెంట లోయలోకి దిగి, పూలతో, తీగలతో, పండ్లచెట్లతో,
వనములతో వైభవముగా వెలిగిపోతున్న ఒక దివ్య భవనాన్ని చూశాడు. ఆశ్చర్య చకితుడై ముందుకు వెళ్తుండగా..
మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
స్థగితేతర పరిమళమై
మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుతమొలసెన్
కస్తూరి ఒకపాలు, పచ్చకర్పూరం రెండుపాళ్ళు కలిసిన తాంబూలపు వాసన సోకింది ప్రవరుని నాసికా పుటలకు. ఆ సువాసన
దెబ్బకు అంతకుముందు వచ్చిన పరిమళములు అన్నీ జాడా లేకుండా పోయాయి. స్త్రీలు తాంబూలంలో ఒకవంతు కస్తూరి,
రెండువంతులు పచ్చకర్పూరం వేసుకోవాలి, పురుషులు రెండువంతు
కస్తూరి పరిమళ ద్రవ్యముగా మాత్రమే కాక, ఉష్ణమును కలిగించే ఉద్దీపన శక్తిని కూడా కలిగిఉంటుంది అని సంప్రదాయం. స్త్రీలు
సహజముగానే ఉష్ణ తత్త్వము కలిగి ఉంటారు కనుక తక్కువ పాళ్ళలో కస్తూరి వేసుకోవాలి. అసలు వివాహితులైన స్త్రీలు
పురుషులు తాంబూలం ఆరోగ్యముకోసం, నోటివెంట సుగంధపు గాలికోసం, దంత సౌభాగ్యంకోసం తప్పక వేసుకోవాలి.
ప్రవరుడు ఆ పరిమళపు తీరుతెన్నులు గమనించి, ఇక్కడ జనులు ఉన్నారు అనుకున్నాడు. స్త్రీలు వేసుకునే తాంబూలపు
పరిమళం వస్తున్నది, ఈ నిర్జన అరణ్య హిమవన్నగప్రాంతంలో స్త్రీలు ఒంటరిగా ఉండరుకదా, కనుక పురుషులు కూడా
ఉంటారు అనుకున్నాడు పిచ్చి బ్రాహ్మణుడు. అనుకుని ముందుకు వెళ్లి, ఒక మెరుపుతీగలాంటి చిన్నదాన్ని,
చంద్రబింబమువంటి ముఖమున్నదాన్ని
చక్రములవంటి చన్నులున్నదాన్ని, లోతైన’నాభి’ గలదాన్ని చూశాడు.
ఆమె ధరించిన తెల్లని వస్త్రములోనున్న లోపలి వస్త్రపు ఎర్రదనమువలన ( లోపటి లంగా అన్నమాట!) ఆమె కూర్చున్న
తెల్లని చంద్రకాంతమణిమయశిలావేది
ఎర్రెర్రని వ్రేళ్ళతో వీణ వాయిస్తూ జిలిబిలిపాటలు ముద్దు
కనులు రతిపారవశ్యంలో అరమూసిన కనులలా ఉన్నాయి. ఆవిడ వాయిస్తున్న వీణ పలికిస్తున్న గానమునకు పద్మములవంటి
ఆమె నాజూకైన చేతులకు ధరించిన రత్నకంకణములుచేస్తున్న ఝణఝణధ్వనులు తాళం వేస్తున్నట్లున్నాయి. అలా రమ్యంగా
వీణవాయిస్తున్న ఆవిడ ఒక్కసారిగా ప్రవరుడిని చూసి అబ్బురంగా నయన పద్మములు వికశించాయి. చనుగవ గగుర్పొడిచింది.
మనసులో కోరికలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండగా, నలకూబరుల సమానమైన అందముతో మెరిసిపోతున్న ప్రవరుడిని
చూసింది. చెంగున లేచి, స్తనభారంతో లేతనడుము అల్లల్లాడుతుండగా ఒక పోకచెట్టుచాటుకుచేరి వికసితపద్
కండ్లతో ప్రవరుడిని చూసింది.
పంకజముఖి కప్పుడు మై
నంకురితము లయ్యెఁ బులకలావిష్కృత మీ
నాంకానల సూచక ధూ
మాంకురములు వోలె మరియు నతనిన్ జూడన్
ఆమెకు పులకలు కలిగి మన్మథ జ్వాలలు రేగి, పొగలు లేచినట్లుగా శరీరముపైని రోమములన్నీ నిగిడి నిలిచాయి. కనురెప్పలు
కొట్టడం తెలియని దేవతాస్త్రీ ఐనప్పటికీ, మానవుడిని చూసి, కరిగి, ఆతని సౌందర్యానికి ముగ్ధురాలై ఆతడినే ఆరాధనగా
చూడడంవలన కావొచ్చు అన్నట్లు, మానవకాంతల కనురెప్పలలా ఆమె కనురెప్పలు సంచలించాయి.
ఎక్కడివాఁడొ యక్షతనయేందు జయంత వసంత కంతులన్
జక్కఁదనంబునన్ గెలువఁ జాలెడు వాఁడు మహీసురాన్వయం
బెక్కడ? యీతనూవిభవమెక్కడ? యేలని బంటుగా మరున్
డక్కఁ గొనంగరాదె యకటా నను వీఁడు పరిగ్రహించినన్
ఎక్కడివాడో కానీ, యక్షకుమారులైన నలకూబరులను, చంద్రుడిని, దేవేంద్రుడి పెద్దకొడుకైన జయంతుడిని, వసంతుడిని,
మన్మథుని కూడా అందములో గెలువగలిగేవాడు! మానవమాత్రుడిన బ్రాహ్మణజన్మము ఏమిటి? ఈ చక్కదనం ఏమిటి?
నన్ను గనుక వీడు చేపడితే మన్మథుడు నా సేవకుడిగా ఐపోడూ?! అనుకున్నది ఆవిడ. వీడి లావణ్య జలములో
వికసించినవేమో అన్నట్లున్న వీడి కనులు, ఎత్తుగా పెరిగి, ఆకాశంతో ఎకసక్కాలాడుతున్నట్లున్న వీడి భుజములు,
మన్మథుని ఆస్థానపీఠమువంటి విశాలమైన వీడి వక్షస్థలము, ఎదురుతిరిగి, పైకి లేచిన లేత చిగుళ్ళను త్రొక్కి(!) ఎర్రబడిన
వీడి పాదములు, చంద్రుడిని సానబట్టి రాలిన పొడితో అమృతాన్ని కలిపి రంగరించి వీడిని చేశాడేమో బ్రహ్మదేవుడు, లేకుంటే
ఈ శరీరకాంతి ఏమిటి, వీడి అందము ఏమిటి? దేవతలు, గరుడులు, నాగులు,నరులు, ఖేచరులు, కిన్నరులు, సిద్ధులు,
సాధ్యులు,చారణులు,విద్యాధరులు, గంధర్వకుమారులు ఎంతమందిని చూడలేదు! వారెవ్వరైనా వీడితో తులతూగుతారా?
ఊహూఁ!
ఇలా అనుకుంటూ, మన్మథుని వింటినారి నుండి వెలువడిన నిశితములైన బాణములదెబ్బలకు దిమ్మతిరిగి మూర్చపోయిన
దానివలె తత్తరపాటుతో కాలిగజ్జె
ఎవ్వతెవీవు? భీతహరిణేక్షణ! యొంటిఁ జరించె దోట లే
కివ్వనభూమి! భూసురుఁడ నే బ్రవరాఖ్యుఁడఁ ద్రోవ తప్పితిన్
గ్రొవ్వున నిన్నగాగ్రమునకున్ జనుదెంచి, పురంబుఁ జేర నిం
కెవ్విధిఁ గాంతు? దెల్పఁగదవే! తెరు వెద్ది? శుభంబు నీ కగున్
ఓ చిన్నదానా! బెదిరిన జింక కన్నులున్నదానా! ఎవరివి నువ్వు? సంకోచము లేకుండా ఈ వనంలో తిరుగుతున్నావు! నేను
బ్రాహ్మణుడిని. ప్రవరాఖ్యుడనే వాడిని. ఒళ్ళు బలిసి ఈ కొండకొమ్ముకు వచ్చి, త్రోవ తప్పాను! మా ఊరికి వెళ్ళడానికి దారి ఏది,
ఎలా కనుక్కోవడంతెల్పరాదూ! నీకు శుభం జరుగుతుంది! అన్నాడు ప్రవరుడు.
కామినుల కంటిచూపుల తీరును, ఒంటితీపులజోరును కనిపెట్టి, కనికట్టుపెట్టి, కా
కనుక మోహంతో, వ్యామోహంతో, కామంతో సం
ఇల్లుజేరే దారికోసం బిత్తరపోయి దిగులుగా వెదుకుతున్న కన్నులున్నవాడు అసలు తానే! అందుకనే తనమాటలను వెనకాముందూ
జేసి తొట్రుపాటుతో గబగబా మాట్లాడేశాడు. అమాయకుడు కనుక, ఒళ్ళు బలిసి ఇక్కడికి వచ్చాను అన్నాడు కానీ, 'బాలా! మేము
ప్రవరాఖ్యులము, ఈ హిమాలయ సౌందర్యమును తిలకింప వేడుక జనించి వచ్చితిమి' అని గంభీరమైన నటనతో అనలేదు.
(తరువాయి తదుపరి సంచికలో)