వార ఫలం (మార్చి 07 - మార్చి 13) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మొత్తంమీద పనులలో మొదట్లో చూపిన ఉత్సాహం చివరి వరకు కొనసాగించే ప్రయత్నం చేయుట మంచిది. మిశ్రమ ఫలితాలు పొందుతారు. తలపెట్టిన పనులలో ముందే ఫలితాలు ఆశించక పోవడం మంచిది. ప్రయాణాలు చేయవలసి రావచ్చును. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే తప్పక మేలు జరుగుతుంది. స్త్రీలకు సంభందించిన వ్యవహరాల్లో నిదానంగా వ్యవహరించుట మంచిది. విద్యార్థులు ఇతర వ్యాపకముల పట్ల మక్కువను ప్రదర్శించే అవకాశం కలదు. వాటి మూలాన ఇబ్బందులు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం తప్పక పోవచ్చును. కుటుంబ సమస్యల వలన పనిపై శ్రద్దతగ్గే అవకాశం కలదు జాగ్రత్త. వ్యాపారస్థులకు నూతన ఆలోచనలు కలుగుతాయి, కాకపోతే పెట్టుబడులు కాకుండా గతంలో చేపట్టిన పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. కళారంగంలోని వారికి ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందకపోవడం వలన అసంతృప్తిని పొందుతారు, ముందుచూపు అవసరం.

వృషభ రాశి

ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ప్రణాళికా ప్రకారం ముందుకు వెళితే తప్పక మేలు జరుగుతుంది. ప్రయాణాలు చేయుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు. విందులలో పాల్గొనే అవకాశం ఉంది. నచ్చిన వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. పెద్దల సూచనలు పాటించుట మంచిది. ఆచార వ్యవహారాల పట్ల మక్కువను ప్రదర్శిస్తారు. విద్యార్థులకు అవగాహన పెంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. సమయాన్ని విద్యకు కేటాయించే విధంగా ఆలోచన అవసరం. ఉద్యోగులకు పనిపైన శ్రద్ధను పెట్టుటచే అనుకూలమైన ఫలితాలు పొందు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు వేచిచూసే ధోరణి అవసరం. అలాగే అనుభవజ్ఞుల సూచనలు పాటించుట ఉత్తమం. కళారంగంలోని వారికి మాములుగా ఉంటుంది. మీపని మీరు చేసుకొని వెళ్ళండి ఉత్తమం. ఇతర వ్యాపకాలు చేయకండి. వాటికి సమయాన్ని ఇవ్వకపోవడం మంచిది.


మిథున రాశి
ఈవారం మొత్తంమీద ఆలోచనలను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ధనమునకు సంబంధించిన విషయాల్లో విలువైన వస్తువులను కొనకపోవడం అలాగేమంచిది. మాటలు జాగ్రత్తగా మాట్లాడుట, అతి ఉత్సహం చూపక పోవడం అనేది సూచన. పెద్దల నుండి వచ్చిన సమాచారం ప్రకారం నడుచుకోండి. సొంత ఆలోచనలకు దూరంగా ఉండుట ఉత్తమం. మీ ఆలోచనలకు వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది. విద్యార్థులకు ఓపిక అవసరం లేకపోవడం మూలాన నష్టపోయే అవకాశం కలదు. కావున సమయపాలన అనేది చాలాఅవసరం అనేది గుర్తించుట మేలు. ఉద్యోగులకు మాత్రం పని పట్ల వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది. చేసిన పనినే మళ్ళి చేయవలసి వస్తుంది. వ్యాపారస్థులకు ఇబ్బంది తప్పదు. పెట్టుబడులు పెట్టకండి. కళారంగంలోని వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. అబివృద్ది దిశలో అడుగులువేసే అవకాశం కలదు. ప్రయత్నం చేయుట ఉత్తమం.


కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద నూతన పనులను ఆరంభిస్తారు. వాటిని పూర్తి చేయాలనే ఆత్రుత కూడదు. నిదానం అవసరం. ప్రయత్నాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఆలోచనలు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాల మూలాన అలసి పోయే అవకాశం ఉంది. వీలయితే వాయిదా వేయుట మంచిది. ఆరోగ్య పరమైన సమస్యలు తప్పకపోవచును. ముఖ్యంగా భోజనం(పొట్టకు సంభందించిన), వెన్నునొప్పుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అధికమైన ప్రయత్నం చేస్తే కాని ఓ మాత్రం ఫలితాలు రాకపోవచ్చును. కావున చక్కటి ప్రణాళిక అవసరం. ఉద్యోగులకు పనివిషయంలో అశ్రద్ధ ఏర్పడే అవకాశం ఉంది. దాని మూలాన నష్టపోయే ప్రమాదం కలదు జాగ్రత్త. వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుతాయి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండుట ఉత్తమం. కళారంగంలోని వారికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరమైన చిన్న సమస్యలు తప్పకపోవచును.


సింహ రాశి

ఈవారం మొత్తం మీద పనులను విజయవంతంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. నూతన ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు. ఆలోచనలను వారితో పంచుకొనే అవకాశం ఉంది. ధనమునకు సంబంధించిన విషయాల్లో బాగానే ఉంటుంది కాకపోతే వారం చివరలో ఖర్చులు ఉండే అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయాణాల విషయంలో సరైన నిర్ణయం తీసుకొనే దిశగా అడుగులు వేయండి. ఆలోచన అవసరం. విద్యార్థులకు చర్చలలో పాల్గొనే అవకాశం వస్తుంది. మీయొక్క తెలివితేటలను ప్రదర్శించాలనే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగులకు వ్యక్తిగత పనుల విషయంలో లబ్దిని పొందుతారు. అధికారులతో మంచిగా నడుచుకొనుట చేత మేలు జరుగుతుంది. వ్యాపారస్థులకు కలిసి వచ్చే కాలం. పెట్టుబడులు అనుకూలిస్తాయి. కాకపోతే అందరిని కనిపెట్టుకొని ఉండుట మంచిది. కళారంగంలోని వారికి నలుగురిలో గౌరవం మరింతగా పెరుగుటకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి.

 

కన్యా రాశి

ఈవారం మొత్తంమీద పూజాదికార్యక్రమాలలో పాల్గొంటారు వినోదాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. వాటికి సమయాన్ని కేటాయించే అవకాశం కలదు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొంత శ్రమను పెంచు ప్రయత్నం చేయుట అన్నివిధాల మంచిది. ప్రయత్నాలలో బాగుంటుంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబంలో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. బంధువులతో  సంతోషంగా గడిపే అవకాశం కలదు. విద్యార్థులకు ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ముందుకు వెళితే మేలుజరుగుతుంది. శ్రమించుట ఉత్తమం. ఉద్యోగులకు మాటలు పొదుపుగా వాడుట సూచన అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. వ్యాపారస్థులకు నూతన ఆలోచనలు కలిగిఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. మిశ్రమఫలితాలు పొందుతారు. కళారంగంలోని వారికి ఇష్టమైన పనులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన అవకాశాలు పొందుతారు ఆర్థికంగా బాగుంటుంది.

తులా రాశి

ఈవారం మొత్తంమీద పనులకు సంబంధించిన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా అడుగులు వేయుట మంచిది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. వాహనముల విషయంలో జాగ్రత్త అవసరం. వాటి మూలాన ఖర్చులు కలుగుతాయి. ఆరోగ్యంవిషయంలో మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు చేపట్టుట మంచిది. విద్యార్థులకు శ్రమను పొందుట వలన తప్పక ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందుతారు. నూతన ప్రణాళిక ఏర్పరుచుకొని ముందుకు వెళ్ళుట మేలు. ఉద్యోగులకు శ్రమతప్పక పోవచ్చును. అయినను చివరి నిమిషంలో పనులను పూర్తిచేస్తారు. వ్యాపారస్థులకు పెద్దల సూచనలు పాటించుట చేత లబ్దిని పొందుతారు.  ఖర్చులు కూడా పెరుగుటకు అవకాశం ఉంది. వాటిని తగ్గించుకొనుట వలన మేలు జరుగుతుంది.  కళారంగంలోని వారికి పోటి ఏర్పడే అవకాశం ఉంది. తెలివితో ముందుకు వెళ్ళుట చేత మేలు జరుగుతుంది.

 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తం మీద ప్రణాళిక ప్రకారం ముందుకు వెళితే మేలు జరుగుతుంది. మొదట్లో చేపట్టిన పనుల మూలాన నలుగురిలో ఆశించిన గుర్తింపును పొందుతారు. తలపెట్టిన  అవగాహన పెంచుకుంటే మంచిది. ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు చేపట్టుట మంచిది. ప్రయాణాల మూలాన ఇబ్బందులు తప్పక పోవచ్చును. విద్యార్థులకు బాగుండకపోవచ్చును. కావున చదువు విషయంలో శ్రద్ద అవసరం. సమయాన్ని వృధాచేయక సరిగా ఉపయోగిచుకొనే ప్రయత్నం చేయుట ఉత్తమం. ఉద్యోగులకు శ్రమమాత్రమే మిగులుతుంది. ఆశించిన ఫలితాలు రాకపోవడం మూలాన నిరాశను పొందుతారు. వ్యాపారస్థులకు నష్టం వచ్చే అవకాశం ఉంది. కావున తొందరపాటు నిర్ణయాలు వద్దు. నేల విడిచి సాము చేయకండి. కళారంగంలోని వారికి వ్యతిరేకులు మిమ్మల్ని ఇబ్బందిపెట్టు ప్రయత్నం చేస్తారు. నిదానం అవసరం.


ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద బాగుంటుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుట వలన మంచిగుర్తింపును పొందుతారు. వారం చివరలో అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. విందులలో పాల్గొంటారు. మిత్రులతో సమయాన్ని గడుపే అవకాశం ఉంది. విద్యార్థులకు నిదానంగా ఫలితాలు వస్తాయి కావున ఫలితాలు ఆశించక శ్రమను కలిగిఉండుట విధ్యపైన దృష్టిని సారించుట మంచిది. ఉద్యోగులకు అధికారుల వద్ద గుర్తింపు వస్తుంది. పనులను పూర్తిచేస్తారు. కాకపోతే సమయపాలన లేకపోతే ఇబ్బందులు తప్పవు. వ్యాపారస్థులకు ధనమునకు సంభందించిన విషయాల్లో లాభం ఉంటుంది పనిభారం తప్పదు. దూరదృష్టి ఉంటె తప్పక అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కళారంగంలోని వారికి మాటకు మంచివిలువ లబిస్తుంది నూతన విషయాలపైన దృష్టిని పెడతారు.


మకర రాశి

ఈవారం మొత్తంమీద బాగానే ఉంటుంది. తలపెట్టిన పనులకు సంభందించిన విషయాల్లో చివరలో పొందుతారు. ఉత్సాహంతో పనులను చేపడుతారు. మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం ఉంది. సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగుంటుంది. ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్ళండి. అలాగే పెద్దల సూచనలు పాటించుట చేత లాభం పొందుతారు. ఉద్యోగులకు అధికారుల వలన మేలు జరుగుతుంది. తోటివారినుండి సహాయసహకారాలు లభిస్తాయి. ఓపికతో పనులను చేయండి. మంచిఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్థులకు కొత్త కొత్త ఆలోచనలు ఉండే అవకాశం ఉంది. సాధ్యసాధ్యాలు ఒకసారి ఆలోచన చేయుట మంచిది. కళారంగంలోని వారికి బాగుంటుంది నూతన అవకాశాలు లభిస్తాయి.


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద ఇతరుల నుండి వచ్చు సూచనలు పరిగణలోకి తీసుకొనే ప్రయత్నం చేయండి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. విందులలో పాల్గొనే అవకాశం ఉంది. సమయాన్ని వాటికి ఇచ్చే ఆస్కారం ఉంది. ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. అధికమైన ఆలోచనలు కలిగి కొంత అసహనాన్ని పొందుటకు అవకాశం ఉంది. పనులకు సంబంధించిన విషయాల్లో ఒకింత శ్రద్దఅవసరం. నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. విద్యార్థులకు పెద్దల సహాకారం అవసరం వారి సూచనలు పాటించే ప్రయత్నం చేయుట మంచిది. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. చర్చలకు దూరంగా ఉండుట మంచిది. దానిమూలాన విభేదాలు తగ్గుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు మాములుగా ఉంటుంది. నూతన పనులకన్నా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట ఉత్తమం. కళారంగంలోని వారు ప్రయాణాలు చేయుట వలన అలసిపోయే అవకాశం ఉంది. పెద్దలను కలుస్తారు.


మీన రాశి

ఈవారం మొత్తం మీద ఇష్టమైన పనులను చేపడుతారు. నచ్చిన వారితో సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. ప్రయాణాలు తప్పక పోవచ్చును. వాటివిషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి, మంచిది. పనులకు సంభందించిన విషయాల్లో నిదానం అవసరం. చిన్న చిన్న విషయాల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును. భోజనం విషయంలో సంతృప్తి ఉంటుంది. విందులలో పాల్గొంటారు. విద్యార్థులకు శ్రమతప్పక పోవచ్చును ప్రణాళిక అవసరం. సమయపాలనతో విద్యలో మంచిఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు. అధికారులతో నిదానంగా వ్యవహరించుట సూచన. పనిభారం తప్పకపోవచ్చును. వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుతాయి. వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కళారంగంలోని వారికి బాగుంటుంది. నూతన అవకాశాలు పొందుతారు. వాటిని జాగ్రత్తగా వాడుట వలన మేలు జరుగుతుంది.



శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి