వార ఫలం (మార్చి 14 - మార్చి 20) - శ్రీకాంత్

మేష రాశి
ఈవారం మొత్తంమీద మొదట్లో పనులలో స్వల్ప ఆటంకాలు ఎదుర్కొన్న చివరకు వాటిని విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత మెరుగు కనబడుతుంది. ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయుట మంచిది. బందుమిత్రులతో కలిసి చేపట్టు పనులకు సంబంధించిన విషయాల్లో నిదానం అవసరం ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు ఒత్తిడిని పొందుతారు కాకపోతే నిదానం అవసరం. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరుచుకొని ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయుట మంచిది. ఉద్యోగులకు అధికారుల వద్ద నుండి ఆశించిన విధంగా సహాకారం రాకపోవచ్చును కావున సర్దుకుపోవడం మంచిది. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి పెట్టుబడుల విషయంలో నూతన నిర్ణయాలు చేయకండి. కళారంగంలోని వారికి సమయం పనులలో గడిచిపోతుంది నూతన అవకశాలు ఉండే అవకాశం ఉంది.

వృషభ రాశి

ఈవారం మొత్తంమీద ప్రతిపనిలోను ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది, వాటిని అనుభవజ్ఞుల సహాయసహకారంతో పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. సమయాన్ని మిత్రులతో మీ అనుకున్న వారితో గడపడానికి ఇష్టపడుతారు. సొంతనిర్ణయాలు చేయకండి నిదానంగా వ్యవహరించుట ముఖ్యం. నలుగురికి సహాయపడాలనే తలంపును కలిగి ఉంటారు. ఒకవార్త ఒకింత ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది కావున మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులకు బాగుంటుంది కొంత ఊరట చెందుతారు. సమయపాలన కలిగిఉంటే మిగితా విషయాల్లో బాగానే ఉంటుంది. ఉద్యోగులకు అధికారులతో గల మంచిసంబంధాలు ఉపయోగపడుతాయి. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు ఆస్కారం ఉంది. వ్యాపారస్థులకు మిశ్రమంగా ఉంటుంది కాకపోతే గతకొంత కాలంగా ఆగిఉన్న పనులను పూర్తిచేయగలుగుతారు. కళారంగంలోని వారికి పెద్దల అనుగ్రహం ఉండుట వలన ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు.


మిథున రాశి
ఈవారం మొత్తంమీద మొదట్లో ఉన్న ఉత్సాహం చివరకు ఉండదు కావున పనులను వారం ఆరంభంలో పూర్తిచేసే విధంగా ప్రణాళికను సిద్దం చేసుకోండి. వారం చివరలో పని ఒత్తిడికి గురియ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు మీరు ఆశించన విధంగా ఫలితాలు ఇవ్వకపోవచ్చును. మిత్రులతో కలిసి చేపట్టిన పనులలో మిశ్రమఫలితాలే కలుగుతాయి. బంధువర్గం నుండి ఒక వార్తా వినే ఆస్కారం కలదు. రాజకీయవ్యవహారాల్లో మాత్రం ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది కావున మంచి ప్రణాళిక అవసరం. విద్యార్థులకు ఇతరవ్యాపకాలు పెరుగుటకు అవకాశం ఉంది వాటి ప్రభావం చదువు పైన పడే అవకాశం ఉంది కావున ఈ విషయంలో శ్రద్ద తీసుకొని జాగ్రత్త వహించుట మంచిది. ఉద్యోగులకు అధికారుల వలన పనిభారం ఉన్న వాటిని అనుకున్న సమయానికి పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్థులకు నిదానం అవసరం పెట్టుబడులు దశల వారిగా పెట్టుప్రయత్నం చేయుట మంచిది. కళారంగంలోని వారికి ఒత్తిడి ఉన్న అవకాశలు రావడం అనేది ఊరటను కలుగజేస్తుంది.


కర్కాటక రాశి

ఈవారం మొత్తంమీద బందువర్గం,మిత్రులతో ప్రతిపనిలో నిదానంగా వ్యవహరించుట సూచన. వారిఆలోచనలను పరిగణలోకి తీసుకోండి మంచిది. అనవసరపు ఆలోచనలకు స్వస్తిచెప్పు ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయునపుడు మాత్రం తగిన జాగ్రతలు తీసుకోండి ఉత్తమం. ఇతరులకు మాటను ఇవ్వవలసి వస్తే సాధ్యసాద్యాలను పరిశీలించుకొనే అవసరం ఉంది. పనులలో స్వల్ప ఆటంకాలు పొందుతారు.విద్యార్థులకు బాగుంటుంది కొంత అధికమైన సమయం చదువుకు కేటాయించుట మంచిది. అనుకున్న ఫలితాలు కలుగుతాయి మనోదైర్యంతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగులకు పెద్దలతో మంచి అనుభందాలు అవసరం వారి ఆలోచనలు గౌరవించుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు ధననష్టం కలిగే అవకాశం ఉంది అనుకున్న దానికన్నా అధికమైన ఖర్చు పెరుగుతుంది. కళారంగంలోని వారికి అనుకోని సమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. వివాదములకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండుట మంచిది.


సింహ రాశి

ఈవారం మొత్తంమీద బాగుంటుంది తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది కాకపోతే ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధను వహించుట మంచిది. కుటుంబసభ్యులతో సమయాన్ని ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతారు. ప్రయాణాలు చేయవలసి రావోచ్చును. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు కలుగుటకు ఆస్కారం కలదు. ఉత్సాహంను కలిగి ఉండి మిత్రులతో కలిసి కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. విద్యార్థులకు చర్చల యందు ఇష్టం ఉంటుంది వాటిని తగ్గించుట వలన మేలుజరుగుతుంది. నిదానంగా ముందుకు వెళ్ళండి అనుకున్న పనులను పూర్తిచేస్తారు. ఉద్యోగులకు అధికారులతో విభేదాలు కలుగుటకు ఆస్కారం ఉంది కావున వీలైనంత వరకు సర్దుబాటు విధానం ఆవలంభించట మంచిది. వ్యాపారస్థులకు బాగుంటుంది పెట్టుబడులు పెట్టవలసి వస్తే పెద్దల అనుభవం పరిగణలోకి తీసుకోండి చాలు. కళారంగంలోని వారికి అనుకోని ప్రయాణాలు తప్పక పోవచ్చును, ఖర్చులు పెరుగుతాయి.

 

కన్యా రాశి

ఈవారం మొత్తంమీద మాటలను జాగ్రత్తగా వాడాలి మిత్రులతో కలిసి పనిచేయునపుడు నిదానం అవసరం. భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను చూపించే అవకాశం ఉంది, విందులలో పాల్గొంటారు. ఆలోచనలు పెరుగుటకు అవకాశం ఉంది వాటి మూలాన కొంతమేర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం బాగానే ఉంటుంది. చిన్న చిన్న ఆటంకాలు కలిగినను చివరకు అవితొలిగిపోతాయి. విద్యార్థులకు కొంత మొండితనం పెరుగుటకు అవకాశం ఉంది పెద్దలు తెలివితో వారిని సరైన మార్గంలో పెట్టుట మంచిది. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి నూతన ప్రయత్నాలు కొంత ముందుకు కదులుతాయి. వ్యాపారస్థులకు మాటవిలువ పెరుగుతుంది అందుచేత కొంత ఒత్తిడి కూడా పెరుగుతుంది. కళారంగంలోని వారికి బాగుంది సమయాన్ని ఆనుకూలంగా గడుపుతారు. నూతన అవకాశాలు పొందుటకు అవకాశం ఉంది చాలావరకు నూతన పరిచయాలు కలుగుతాయి వారితో సమయాన్ని గడుపుతారు.

తులా రాశి

ఈవారం మొత్తంమీద చర్చలలో పాల్గొనేందుకు ఆసక్తిని కలిగి ఉంటారు. కుటుంబసభ్యులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుతారు. పనిఒత్తిడిని కలిగి ఉంటారు తెలివితో పనులను చక్కబెట్టుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ఆలోచనలను అదుపులో ఉంచుకొండి. ఆర్థికపరమైన విషయాల్లో తొందరబాటు వద్దు ఖర్చులు తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. భోజనం విషయంలో సమయపాలన అవసరం. విద్యార్థులకు ప్రణాళిక అవసరం తొందరపాటు పనులు వద్దు నిదానంగా మీ పనులు పూర్తిచేయుట మంచిది. ఉద్యోగులకు శ్రమఉంటుంది చేపట్టని పనులను కొంత ఆలస్యంగా పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్థులకు పెద్దల సహకారం అవసరం. నూతన నిర్ణయాలు చేయకండి మిగితా బాగుంటుంది. కళారంగంలోని వారికి ఆశించిన దానికన్నా అధికమైన అవకాశాలు కలుగుటకు అవకాశం ఉంది అదే సమయలో మీ ఆలోచనల్లో పరిణతి అవసరం.

 

వృశ్చిక రాశి

ఈవారం మొత్తంమీద చిననాటి మిత్రులను కలుస్తారు వారితో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాల వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. వ్యతిరేక వర్గం నుండి సమస్యలు పొందుతారు తెలివితో ఎదుర్కొనే ప్రయత్నం చేయుట మంచిది. చేపట్టిన పనులలో శ్రమను కలిగి ఉంటారు ఒక్కొక్కటిగా పూర్తిచేసే ప్రయత్నం చేయుట మంచిది. విద్యార్థులకు శ్రద్దఅవసరం అనవసరపు తప్పిదాలు చేయకుండా చూసుకొనే ప్రయత్నం మంచిది. పెద్దల సూచనలతో ముందుకు వెళ్ళండి. ఉద్యోగులకు అధికారులతో కలిసి పనిచేయవలసి వచ్చినపుడు మాత్రం ప్రణాళికతో ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది లేకపోతే ఇబ్బందులు తప్పవు. వ్యాపారస్థులకు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు ధనము చేతికి అందుటలో కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కలవు కావున మాటను ఇవ్వడంలో జాగ్రత్త వహించుట మంచిది. కళారంగంలోని వారికి నిదానం అవసరం వేచిచూసే దోరణి మంచిది.


ధనస్సు రాశి

ఈవారం మొత్తంమీద నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకశాలు కలుగుతాయి. ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. చర్చల్లో పాల్గొన్నప్పుడు నిదానం అవసరం, ఎదుటివారిని ఇబ్బందిపెట్టకుండా వ్యవహరించుట ఉత్తమం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు బాగుంటుంది కొంత శ్రమను పెంచుట చేత తప్పకుండా ఆశించిన ఫలితాలు పొందుతారు. కాకపోతే సమయపాలన అవసరం బద్ధకం వీడటం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగులకు క్రిందిస్థాయి వారితో గల సంబంధాలు ఉపయోగపడుతాయి సరైన నిర్ణయాలు తీసుకోవడం వలన విజయం తప్పకపోవచ్చును. వ్యాపారస్థులకు ఆర్థికపరంగా లాభం పొందుతారు పెట్టుబడలు పెట్టుటకు మంచిసమయం. కళారంగంలోని వారికి పెద్దలతో గల సంబంధాలు లాభిస్తాయి. నూతన అవకశాలు పొందుటకు అవకాశం ఉంది.


మకర రాశి

ఈవారం మొత్తంమీద పెద్దలతో కలిసి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో నిదానంగా వ్యవహరించుట మంచిది. మీ అనుకున్న వారితో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది మాటపట్టింపులకు పోకపోవడం మంచిది. దైవసంబంద పనులకు సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంది. తెలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచిఆలోచనలు ఉండే అవకాశం ఉంది వాటిని పెద్దల సహాకారంతో ముందుకు వెళ్ళుట చేత లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు బాగుంటుంది చేపట్టిన పనులను కొంత ఆలస్యం అయినను పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన విషయాల్లో లాభం ఉంటుంది. కళారంగంలోని వారికి ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది.


కుంభ రాశి

ఈవారం మొత్తంమీద వారం ఆరంభంలో చేపట్టిన పనుల మూలాన నలుగురిలో గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యసమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. పనులలో నూతన ఆలోచనలు అమలు చేయుటకు అవకాశం ఉంది. ఖర్చులు కూడా పెరుగుటకు అవకాశం ఉంది. ప్రయాణాలు చేయునపుడు విలువైన వస్తువలు నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు కలుగుతాయి కాకపోతే మంచి ప్రణాళిక అవసరం. ఉద్యోగులకు అధికారులతో మంచి సంబంధాలు ఉండటం చేత మేలుజరుగుతుంది. ప్రయత్నాల్లో అందరిని కలుపుకొని వెళ్ళడం వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు మిశ్రమఫలితాలు కలుగుటకు అవకాశం ఉంది. పెట్టుబడులు వద్దు నిదానం అవసరం. కళారంగంలోని వారికి కొంత వ్యతిరేకమైన ఫలితాలు పొందుతారు నిదానం అవసరం. అనవసరపు తప్పిదాలు చేయకుండా పెద్దల సూచనలతో ముందుకు వెళ్ళుట మంచిది.


మీన రాశి

ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగుంటుంది సంతృప్తిని పొందుతారు. స్థిరమైన ఆలోచనలు చేయుట వలన మేలుజరుగుతుంది. బంధువులతో ఆలోచనలు చేయునపుడు మాత్రం నిదానం అవసరం. ప్రయాణాలు చేయకండి అలసిపోయే అవకాశం ఉంది. తప్పనిసరి అయి చేయవలసి వస్తే దైవారాధన చేసి చేయట మంచిది. సమయానికి భోజనం చేయట మంచిది. ఆరోగ్యంను అశ్రద్ద చేయకండి. విశ్రాంతిని కోరుకుంటారు. మిత్రులతో కలిసి చర్చలలో పాల్గొంటారు సమయన్ని వారితో గడిపే అవకాశం ఉంది. విద్యార్థులకు పెద్దగా అనుకూలమైన ఫలితాలు పొందకపోవచ్చును. సర్దుబాటు అవసరం. ఉద్యోగులకు శ్రమ తప్పదు అధికారులతో వారికి అనుగుణంగా నడుచుకోండి. వ్యాపారస్థులకు పెద్దలతో గల సంబంధాల మూలాన మేలుజరుగుతుంది. కళారంగంలోని వారికి ఇష్టమైన వారితో సమయం గడుపుటకు అవకాశం ఉంది. విందులలో పాల్గొనుటకు అవకాశం ఉంది.



శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి