దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణమూర్తి

duradrushtapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

నెదర్లాండ్స్ లోని మాస్సెల్ కానార్ అనే ఊరికి చెందిన ఓ దొంగ, ఓ రాత్రి దొంగతనానికి ఓ కార్యాలయానికి వెళ్ళాడు. అయితే అతను తక్షణం భయంతో పారిపోయాడు. కారణం ఆ కార్యాలయం ఫ్యునరల్ పార్లర్. మర్నాడు పాతిపెట్టడానికి సిద్ధం చేసిన మూడు శవాలు, అక్కడ అతనికి దర్శనమిచ్చాయి.


 

సైబీరియాలోని జ్రోంక్ హారస్ట్ ప్యూట్ అనే ఊర్లోని ఓ దొంగ సరదాగా తిరగాలని ఓ సింగిల్ ఇంజన్ విమానాన్ని దొంగిలించాడు. అయితే దాన్లో పెట్రోల్ అయిపోవడంతో, ఆ దొంగ దాన్ని హైవేలో దింపాల్సి వచ్చింది. ఇది ముందే ఎదురుచూసిన పోలీసులు విమానం దిగగానే అతన్ని అరెస్ట్ చేశారు.
 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి