పంచాంగశ్రవణం - హైమాశ్రీనివాస్.

panchanga shravanam

తెలుగు ‘ఉగాది’ రోజున పంచాంగ శ్రవణం చేయటం ఆంధ్రులకు మహదానందం.. కొత్త సంవత్సరం మొదటి రోజైన ఉగాది తెలుగు వారికి ముఖ్యమైన పండుగ. తెలుగు వారిలాగే తమిళ, మళయాళ, కన్నడ ఇంకా ఇతరులంతా కూడా ' ఉగాది ' పండుగ ప్రత్యేకమైన తేదుల్లో జరుపుకుంటూనే ఉన్నారు. ఉగాది నాటి సాయంకాలం దేవాలయంలో కానీ, మరే ప్రాంగణాలలో కానీ ‘పంచాంగ శ్రవణం’ ఏర్పాటు చేస్తారు. పంచాంగము అంటే .’పంచ అంగములు ‘ కలది. జ్యోతిష్యశాస్త్రానికి సంబంధించి తిధి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే ఐదింటినీ గురించి వివరించేదే పంచాంగం.15 తిథులు, 7 వారములు, 27 నక్షత్రాలు, 27 యోగములు, 11 కరణములు కలిపి పంచాగం. చంద్రుని సంచరణతో అనుసంధానమైనది - చాంద్రమాన పంచాంగం. సూర్యుని సంచరణతో అనుసంధానమైనది - సూర్యమాన పంచాంగం.

చాంద్రమాన పంచాంగం ప్రకారం తిథులు -15. అవి వరుసగా -1.పాడ్యమి 2.ద్వితీయ 3.తృతీయ 4.చతుర్థి 5.పంచమి 6.షష్ఠి 7.సప్తమి 8.అష్టమి 9.నవమి 10.దశమి 11.ఏకాదశి 12.ద్వాదశి 13.త్రయోదశి 14.చతుర్ధశి 15.పౌర్ణమి  లేక అమావాస్య.

వారంలో ఏడు రోజులున్నాయి. తెలుగు వారాల పేర్లు.
భాన్విందుభౌమసౌమ్యాశ్చబృహస్పతిభృగుస్థిరాః।వాసరాస్సప్తలోకేహిప్రసిద్ధాస్సర్వకర్మసు।।
1.ఆదివారము (భానువాసరః) 2.సోమవారం (ఇందువాసరః) 3.మంగళవారం (భౌమవాసరః) 4.బుధవారం (సౌమ్యవాసరః) 5.గురువారం (బృహస్పతివాసరః) 6.శుక్రవారం (భృగువాసరః) 7.శనివారం (స్థిరవాసరః).

నక్షత్రములు27: 1.అశ్వని 2.భరణి 3.కృత్తిక 4.రోహిణి 5.మృగశిర 6.ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మాఘ 11.పుబ్బ (పూర్వఫాల్గుణి) 12.ఉత్తర (ఉత్తరఫాల్గుణి) 13.హస్త 14.చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనురాధ 18.జ్యేష్ఠ 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రావణం 23.ధనిష్ఠ 24.శతబిషం 25.పుర్వాభాద్ర 26.ఉత్తరాభాద్ర 27.రేవతి.

యోగములు ఇరవై ఏడు -- 1) విష్కంభయోగము 2) ప్రీతియోగము 3) ఆయుష్మద్యోగము 4) సౌభాగ్యయోగము 5) శోభనయోగము 6) అతిగండయోగము 7) సుకర్మయోగము 8) ధృతియోగము 9) శూలయోగము 10) గండయోగము 11) వృద్ధియోగము 12) ధ్రువయోగము 13) వ్యాఘాతయోగము 14) హర్షయోగము 15) వజ్రయోగము 16) సిద్ధియోగము 17) వ్యతీపాతయోగము 18) వరీయోయోగము 19) పరిఘయోగము 20) శివయోగము 21) సిద్ధయోగము 22) సాధ్యయోగము 23) శుభయోగము 24) శుక్లయోగము 25) బ్రహ్మయోగము 26) ఐంద్రయోగము 27) వైధృతియోగము.

కరణములు -11. అవి -బవ, బాలవ, కౌలవ, తైతుల, గరజి, వణజి, భద్ర, శకుని, చతుష్పాత్, నాగవము, కింస్తుగ్నం.

పంచాంగ శ్రవణంలో సంవత్సర ఫలితాలు, సంక్రాంతి పురుషుడు, నవనాయకులు వంటి వారితో పాటు వివిధ రాశుల వారి ఆదాయ, వ్యయాలు, రాశి ఫలాలు చెప్తారు. ఆరోగ్య, ఐశ్వర్య వివరాలు, వివాహాది విషయాలు, ముఖ్యంగా భవిష్యత్తును గురించిన వివరం వారి వారి నఖ్సత్ర, రాశులను అనుసరించి వివరించడం జరుగుతుంది. పంచాంగ శ్రవణంలో నవగ్రహాలను స్మరించడం వలన పొందే సత్ఫలితాలను కూడా వివరించడం జరుగుతుంటుంది. పంచాంగ శ్రవణం ఫలితంగా సూర్యుడి వల్ల శౌర్యం, చంద్రుని వల్ల వైభవం, కుజుడి వల్ల సర్వ మంగళాలు, బుధుడి వలన బుద్ధి వికాసం, గురువు వలన జ్ఞానం, శుక్రుడి వలన సుఖం, శని వలన దుఖఃరాహ్యితం, రాహువు వలన ప్రాబల్యం, కేతువు వలన ప్రాధాన్యత లభిస్తాయి.వర్జము అనగా వదిలేయ వలసినది. ఏ కొత్తపనీ ఈ సమయంలో మొదలెట్టరాదు. పంచాంగ శ్రవణం అంటే, అదేదో పాతచింతకాయపచ్చడి భావాలనీ, సమయం వృధా అనీ, అదో చాదస్తమనీ నవ్వుకున్న వారి సంఖ్య ఎక్కువైంది. అయితే, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నప్పుడు, ఐతే పంచాంగ వివరణ దేశాలకు కలిగే ఉపద్రవాలనూ, వర్షవివరాలనూతెలుసుకోవచ్చు.

పంచాంగంలోని నిగూఢ అర్థాలను తెలుసుకుంటే ఈ ప్రకృతి సంభవములను తెలుసుకుని ముందు జాగ్రత్త ఏదైనా తీసుకునే అవకాశం కొంతవరకూ ఉంటుంది. కాలపురుషుడుని శాంతిపజేసేందుకు యఙ్ఞయాగాదులను నిర్వహించవచ్చు. ఈ విశ్వంలోని గ్రహనక్షత్రాలను శాంతిపజేస్తే, రాబోయే ప్రళయాన్ని కూడా నివారించవచ్చు. పంచాంగంలో అసలు ఏమున్నదో తెల్సుకుంటే కొంత అవగాహన పొందవచ్చు.

తిథిర్వారంచనక్షత్రంయోగంకరణమేవపంచాంగం. అంటే, తిథి, వార,నక్షత్ర, యోగ, కరణములనే ఐదు ప్రధాన అంగాలతో కూడినదే పంచాంగం. ఈ ఐదు అంగాలు కాలవిభాగాలే. తిథి - కాలస్వరూపుడైన భగవంతుడు, ఒక్కొక్క గ్రహం భగవంతుని సేవిస్తూ, ప్రదక్షిణ చేసే దినమే వారం. నక్షత్రం అంటే క్షత్రం (హాని) కలగకుండా రక్షించేదే నక్షత్రం... కరణం: చంద్రుడు నక్షత్రంతో కలిసి ఉన్న కాలాన్ని యోగం అంటాము. వీటిని సాధించే ప్రక్రియే కరణం. ఈమధ్యనే చంద్రుడు భూమికి చాలా దగ్గరకు వచ్చేశాడని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. చంద్రుడి గురుత్వాకర్షణ పెరిగిన కారణంగా జపాన్ వంటి చోట్ల పెను భూకంపాలు, సునామీలు చోటు చేసుకున్నాయి. యోగం బాగుండాలంటే, చంద్రడిని ప్రార్థించాలి, శాంతింప జేయాలి. పంచాంగంలోని అంశాలను వినటం వల్ల, రాబోయే ప్రళయాన్ని తెల్సుకుని నివారణ చర్యలు చేపట్టవచ్చు.

పంచాంగఫలం: తిథి శ్రవణం వల్ల సంపద చేకూరుతుంది. వారంవల్ల ఆయుర్ వృద్ధి, నక్షత్ర శ్రవణం వల్ల పాప విముక్తి. యోగం వల్ల రోగాలు తొలిగిపోతాయి. కరణం వల్ల కామితార్థాలు తీరతాయి. అందుకే పంచాంగ శ్రవణం వల్ల గంగాస్నానఫలం, గోదానఫలం, సర్వదానఫలం దక్కుతాయి. మంచిమాట వినడం. కొత్త సంవత్సరంలో పాడిపంటలు, వర్షాలు, కష్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం పంచాంగశ్రవణ ఫలితం. పూర్వం రోజుల్లో ఊరంతా ఒకచోట చేరి బాగా చదువుకున్నవారో, పండితులో, పురోహితులోపంచాంగాన్ని చదివి విన్పిస్తుంటే గ్రామస్తులంతా శ్రధ్ధగా వినేవారు. పంచాగ శ్రవణం ఫలశ్రుతి గ్రహశాంతితో పాటు పుణ్యం కూడా లభిస్తుందని. భవిష్యత్లో వర్షాలు ఉంటాయో లేదో తెలుసుకుని రైతులుజాగ్రత్తపడతారు.

గ్రహగతులను బట్టి పరిహారాలను తెలుసుకుని బాధలనుండి తప్పించుకునే వీలు చేసుకుంటారు. పంచాగపఠనం ఒక పద్ధతిగా సాగుతుంది. పంచాంగశ్రవణం చేసే  ఆ పండితులు మొదట పంచాంగ శ్రవణంవల్ల కలిగే లాభాలను వివరిస్తారు అంటే, ఫలశ్రుతి చెబుతారు. తర్వాత నవనాయకుల గురించి వివరిస్తారు. ఏ గ్రహానికి ఏ ప్రాధాన్యత ఉందో చెప్పి, సంవత్సర ఫలితాలను వివరిస్తారు. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్యావమానములు, కందాయ ఫలాలు, కర్తరి వివరాలు, రాశుల వారీగా ఫలితాలను చెపుతారు. వీటిని విన్నవారు. వారి సంవత్సర ప్రణాళిక తయారు చేసుకోవచ్చు..

పంచాంగ శ్రవణం వల్ల గ్రహదోషాలు తొలగుతాయని నమ్మకం. ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వినాలని పెద్దల మాట.
తిథిర్యారంచనక్షత్రంయోగఃకరణయేవచపంచాంగస్యఫలంశృణ్వన్గంగాస్నానఫలంలభేత్
పంచాంగ శ్రవణం వల్ల గంగాస్నానం చేసినంత ఫలితం వస్తుందని అర్థం.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి