దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణమూర్తి

duradrushtapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

మెరికాలోని న్యూపోర్ట్ లోని డేవిడ్ నికొల్సన్ అనే జేబుదొంగ హేగన్ అనే అతని జేబు కొట్టేసాడు. అతని చెక్ బుక్ ని వుపయోగించి, రిపబ్లిక్ బేంక్ లో రెండున్నర వేల డాలర్లు డ్రా చేయబోయాడు. అందుకు వీలుగా తన ఫోటోతో హేగన్ పేరిట దొంగ ఐడెండిటీ కార్డ్ ని కూడా తయారుచేసుకుని బేంక్ కి వెళ్ళాడు. డేవిడ్ చెక్కులని మార్చాలనుకున్నది, హేగన్ అత్తయ్య మేరీ మేనేజర్ గా పనిచేసే రిపబ్లిక్ బేంక్ లోనే! మేరీ తన అల్లుడి సంతకంలోని తేడాని గమనించి బయటికి వచ్చి, డేవిడ్ ని నీ పేరేమిటని అడిగితే, 'హోగన్' అని డేవిడ్ దర్జాగా జవాబు చెప్పాడు. దాంతో ఆవిడ పోలీసులకి కబురుచేసింది.


కాలిఫోర్నియా రాష్ట్రంలోని టెన్నెఈస్స అనే చిన్న ఊళ్ళోకి ఓ దొంగ ముఖాన ముసుగుతో వచ్చి, తుపాకి చూపించి బేంక్ లోని డబ్బుని దోచుకున్నాడు. అయితే, అతను పారిపోయిన పావుగంటకే పోలీసులు అతనింటికి వచ్చి అరెస్ట్ చేశారు. ఆ దొంగ తన పేరుని ఎడమముంజేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అది చదివిన కేషియర్, ఆ పేరుని పోలీసులకి తెలియజేసింది. అతను పాతనేరస్తుడని గ్రహించిన పోలీసులు అతన్ని ఇట్టే అరెస్ట్ చేసారు.
 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి