పెట్టుబడులు - బన్ను

investments

బ్బు సంపాదించటం ఒక ఎత్తయితే దాన్ని దాచుకోవటం (ఆస్తులుగా మార్చుకోవటం) మరో ఎత్తు. సాధారణంగా పెట్టుబడులు ఎందులో పెడతారంటే...

భూమి (ఇల్లు,పొలం)
బంగారం (నగలు)
షేర్లు,బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్ డ్ డిపాజిట్లు.

ఇవి అందరికి తెలిసినవే. అయితే స్థలం బదులు డిజిటల్ రియల్ ఎస్టేట్ (వెబ్ సైట్స్) యాప్స్ లో ఇన్వెస్ట్ చేసి వాల్యూ క్రియేట్  చేస్తున్నారు. "వాట్స్ యాప్" అనే యాప్స్ ను ఫేస్ బుక్ అనే సంస్థ కొన్ని వేల కోట్లకు కొన్నది. అదో రకమైన పెట్టుబడి. భూమిలాగానే ఇంటర్నెట్ భూమి అన్నమాట. జనాలు రాని వెబ్ సైట్లను మనం భీడు భూములుగాను, జనం వచ్చే వెబ్ సైట్లను పంటపొలాలుగాను అనుకోవచ్చు. అలాగే బంగారం మీద మోజు తగ్గి ధనిక వర్గాల ఆడవాళ్ళు "ప్లాటినం"  నగల మీద ఆశ పడ్డారు. బంగారం ధరించడం నామోషీ అయ్యి ప్లాటినం వస్తువులకి వజ్రాలు తొడిగి ధరించడం గమనార్హం.! ఈ మధ్య ఓ గొప్ప వాళ్ళింట్లో దొంగలు పడి డబ్బు, బంగారం దోచుకొని వెళ్ళిపోయారట.ప్లాటినం వదిలెసేరట! ఒక విధంగా లాభమేనండోయ్ !!

షేర్, ఫిక్స్ డ్ డిపాజిట్స్ కి బదులు కొత్తగా "బిట్ క్వాయిన్స్" లో ఇన్వెస్ట్ చేయటం గమనార్హం. ఇంతకీ బిట్ క్వాయిన్స్ కి రెగ్యులేటరంటూ ఎవరూలేరు. వాటినికొని, అమ్మే ఎక్సేంజ్ లు కూడా ఎవరుబడితే వాళ్ళు మొదలుపెట్టి... పేరొచ్చాకా మూసేస్తున్నారు. మన పెట్టుబడి ఎంతవరకు సబబు చూడాలి. నో గ్యారంటీ అని చెప్పొచ్చు. బిట్ క్వాయిన్స్ ధర కూడా  400 నుండి 1200 యు ఎస్ డాలర్స్ కి పెరిగి మళ్ళీ 350 యు.ఎస్. డాలర్స్ కు పడింది. ఇదీ దీని ధర అని చెప్పలేము. కారణం ఒక్కో ఎక్సేంజ్ లో ఒక్కో ధర వుంటుంది. కాని ప్రపంచం మొత్తం దీన్ని గమనిస్తూనే వుంటుంది.

అదండీ సంగతి.! పెట్టుబడులు మారాయి. రాబడులు ఎలా వుంటాయో చూడాలి!!

 

 

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి