దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణమూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

అమెరికాలోని పేస్కో కేంటికి పీటర్ జేసెట్టి అనే దొంగ 34,000 డాలర్ల విలువగల నగలను ఏప్రిల్ 7,2001న ఓ ఇంట్లోంచి దొంగలించాడు. అతన్ని పోలీసులు పట్టుకుని జడ్జిముందు ప్రవేశపెట్టారు. అయితే, తన క్లయింట్ దొంగతనం చేస్తుండగా చూసిన సాక్షులు లేనందున అతన్ని నిర్దోషిగా విడుదలచేయాలని కోరాడు పీటర్ తరఫు లాయర్. కానీ ఈ జడ్జి కేసులో అలాంటి సాక్షుల అవసరం లేదని నేరస్థుడిగా నిర్ధారించి శిక్ష విధించాడు.
ఆ జడ్జి పీటర్ దొంగతనం చేసింది! జడ్జి తన బంగారు నగలని గుర్తించడమే కాక, ఆ దొంగని కూడా చక్కగా గుర్తుపట్టాడు. .


మాస్కో లోని ఓ దొంగ ఓ కారుని ఓ ఇంటి ఆవరణ లోంచి దొంగలించి కొన్ని నిమిషాల్లోనే  పట్టుపడ్డాడు. 24 ఏళ్ళ ఆ దొంగ నిస్సన్ ప్రైమెర బ్రాండ్  కారుని డ్రైవ్ చేసుకుని వెళ్తుండగా దానికి బ్రేకులు లేవని గమనించాడు. ఆ ఇంటి యజమాని బ్రేకులు ఫెయిలయిన తన కారుని రిపేర్  చేయించడం బద్దకించడంతో, ఆ కారు ఓ ఇంటిగోడకి గుద్దుకుంది. స్పృహలేని ఆ దొంగని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసారు.
 

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం