నరసింహ జయంతి - ఆదూరి హైమావతి

narasimha jayanthi

వైశాఖ చతుర్దశి రోజున ,ఈసం. మే మాసం 13వతేదీన నరసింహజయంతిని భక్తి ప్రపత్తులతో జరుపుకుంటాము.దశావతారాల్లో నాల్గవదే నరసింహావతారం.నరసింహ జయంతి అనగా మహావిష్ణువు బాలభక్తుడైన ప్రహ్లాదుని మాటనిలపడంకోసం, క్రూరుడైన హిరణ్యకశ్యపుని దునుమాడి మానవులను,విష్ణు భక్తులైన మునులనూ కాపాడటంకోసం , హిరణ్యకశ్యపుని వరాలకు అతీతమైన అవతారం ఎత్తాడు.అదే నరసింహావతారం హిరణ్యకశ్యపుడు విష్ణుద్వేషి.తన సోదరుడైన హిరణ్యాక్షుడు దేవతలనూ,మానవులనూ, మునులను సైతం బాధిస్తూ , బలగర్వంతో భూమిని పైకెట్టి సముద్రంలో వేస్తాడు. , మునుల ప్రార్ధనతో విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి భూమిని కాచి, అతడ్ని సం హరిస్తాడు.దానికి కోపోద్రిక్తుడైన హిరణ్యకశ్యపుడు బ్రహ్మను గురించీ తపస్సుచేసి నరులవలన, స్త్రీపురుషులవలనా, ఏఆయుధంవలనా , పగలు, రాత్రి ,నేలపైనా, ఆకాశంలో ఎక్కడా మరణం లేనివరం పొదుతాడు.అందువలన విష్ణుమూర్తి ,ఆవరాలకు అతీతమైన అవతారం ఎత్తవలసి వచ్చింది.నడుంవరకూ  సిం హం పంజాతో ఉండేవిధంగా అవతరించి పగలు రాత్రికాని సాయంసమయంలో , గుమ్మమ్మీద కూర్చుని తనవడిలో హిరణ్య కశ్యపుని ఉంచుకుని సిం హం గోళ్ళతో కడుపుచీల్చి సమ్హరిస్తాడు.అందువలన మానవ+ సిమ్హ రూపం గనుక నరసిమ్హావతారంగా పేరు వచ్చింది.ఏమనవుడైనా నరసిమ్హ స్వామిని ధ్యానిస్తే, మంత్రం జపిస్తే ఆయన వారి కష్టాలను రూపుమాపి కాచికాపాడుతాడు.

ఆదిశంకరులుసైతం 'కరావలంబ స్తోత్రం ద్వారా కాలిపోతున్న తనశరీరభాగాలను రక్షించుకుంటారు.' నరసిమ్హ మమదేహి కరావలంబం - అంటూ ప్రార్ధిస్తాడు. నరసిమ్హ స్వామి ఉగ్రరూపమైనా భక్తులపట్ల అమిత ప్రేమగల భగవత్ రూపం. మనదేశంలో , ముఖ్యంగా ఆంధ్ర దేశంలో నారసిమ్హ క్షేత్రాలు అనేకం ఉన్నాయి.

ఇక్కడ నవ నారసింహక్షేత్రాలను మనం దర్శించవచ్చు.
జ్వాలా నరసింహ క్షేత్రము తన భక్తుడైన బాలుడు ప్రహ్లాదుని కాపాడి, అతడిమాటలను యదార్ధం,అని నిరూపించేందుకై  వైకుంఠవాసుడైన మహావిష్ణువు  హిరణ్యకశిపు నిసమ్హరించేందుకై  నరసిమ్హావతారం దాచ్లాడు.  ప్రహ్లదుని కొరకు స్ధంభముఈ ఇద్భవించి ప్రహ్లదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్యకశ్యపుని వక్షాన్ని చీల్చి సంహారించాడు. ఈ స్వామిని "జ్వాలా నరసింహుడు" స్వామి గా పిలుస్తారు.

అహోబిల నరసింహ స్వామి - హిరణ్య కశ్యపుని సమ్హ రించాక ముక్కోటి దేవతలు ఎన్నోస్తోత్రాలు చేసినా కోపము తగ్గని నృసింహ స్వామిని , దేవతల సలహాతో  ప్రహ్లాదుడు ప్రార్ధించగా  "స్వయంభు" గా తనకు తానే సాలగ్రామముగా, ఈ బిలమున  వెలశారు. ఆదే అహోబిలం.

మాలోల నరసింహ స్వామి - ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఈ ఆలయం ఉంది. ఇక్కడస్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరంపైన చదునైన ప్రదేశంలో ఈగుడి నిర్మించబడింది. ఇక్కడి మూర్తి ఎడమ పాదాన్ని మడుచుకొని, కుడిపాదాన్ని కిందకు వదలి సుఖాసీనుడైమనకు కనిపిస్తారు.  స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి కూర్చుని దర్శనమిస్తుంది. స్వామివారి ఎడమ హస్తం  లక్ష్మీదేవిని ఆ లింగనము చేసుకొన్నట్లుగా ఉంటుంది. స్వామి శంఖు, చక్ర, వరద, హస్తాలతో కనిపిస్తారు.

వరాహ నరసింహస్వామి - వేదాద్రి పర్వతం మీద, వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరువచ్చింది.

కారంజ నరసింహస్వామి - కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వెలసి ఉన్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడైన మూర్తి మనకు ఇక్కడదర్శనమిస్తాడు. ఈ స్వామికి త్రినేత్రముఉంది.

భార్గవ నరసింహస్వామి - పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడుఅందువల్ల ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామముఇది. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశవైపు ఈశాన్యం గా ఉంటుంది. స్వామి వారి విగ్రహం, పీఠంపై కారంజ నరసింహస్వామి నాల్గుచేతులలో శంఖు చక్రాలతో, అసురుని ప్రేవువులను చీలుస్తున్న రెండుచేతులు, కత్తి చేతిలో ఉన్న హిరణ్య కశ్యపుడు, ప్రక్కనే అంజలి ఘటిస్తున్న ప్రహ్లాదుడు, మనకు ఇక్కడ కనిపిస్తారు.

యోగానంద నరసింహస్వామి - యోగమునందు ఆనందమును ప్రసాదించేవాడు యోగానంద నరసింహస్వామి. ఖనుకే ఈస్వామివారికి యోగానంద నరసింహ స్వామి అనిపేరు వచ్చింది.  యోగ పట్టంతో, ఉంటాడు, ప్రహ్లాదుని ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేసినాడనిచెప్తారు. మనస్సు చంచలంగా ఉన్నపుడు బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మన:స్ధిరత్వాన్ని పొందాడుట. ఈ ప్రదేశం  యోగులకు, దేవతలకు నిలయం.

చత్రవట నారసింహస్వామి
పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. "హా హా" "హుహ్వా" అను ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా నృసింహస్వామిసంతోషించి వారికి శాప విమోచనం చేస్తారు. కిన్నెర, కింపుర, నారదులు ఈ క్షేత్రం లో గానం చేశరుట!. సంగీతానికి ఆనందించినవిధంగా ఉండే ఈ స్వామిని చత్రవట స్వామి అని పిలుస్తారు.

పావన నరసింహ స్వామి
పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద ఉన్న మూర్తి ఇక్కడ దర్శనమిచ్చి భక్తులను కాపాడుతారు. ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను, సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించ గలిగే వాడని అర్ధం ఉంది. "భరద్వాజ" మహర్షి ఇక్కడతపస్సు చేయగా స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా వారికి దర్శనమిచ్చారుట!. కనుకే ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరువచ్చింది. . ఈ క్షేత్రానికి పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో దక్షిణ దిశలో ఈ అలయం ఉంది. పాపకార్యాలు చేసినవారు ఈ స్వామిని దర్శించగానే అవి అంతరించి వారు పావనులవుతారు. బ్రహ్మోత్సవాల దగ్గరనుండి ప్రతి "శనివారం" నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుతాయి.. ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో భక్తులు వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు.

 

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి