దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణమూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

 న్యూయార్క్ కి చెందిన మైకెల్.వి.డొనాల్డ్ ఓ బేంకు నుంచి 2000 డాలర్లు తుపాకీ చూపించి దొంగలించాడు. అయితే అతను కొద్ది దూరంలోని ఓ కరీదైన హోటల్ కి లంచ్ కి  వెల్లాడు. అదయ్యాక దొంగలించిన డబ్బులోంచి బిల్లుని పే చేస్తుండగా, అందులో క్యాషియర్ వుంచిన డై పేక్ {దొంగల్ని పట్టించడానికి అమెరికన్ బేంక్స్ వాడే సాధనం} పేలి ఎర్రటి రంగు అతని దుస్తులకు, చేతికి అంటింది. అదే హోటల్ లో భోజనం చేసే ఎఫ్.బి.ఐ ఏజెంట్లు అతన్ని దొంగగా గ్రహించి వెంటనే అరెస్ట్ చేసారు. 


పెన్సిల్వేనియా రాష్ట్రం లోని  బ్రిస్టల్ నగరం లో, టెర్రెన్స్ డిక్సన్ అనే దొంగ ఓ ఇంట్లో దొంగతనం  చేసాక, ఆ ఇంటి కారు గేరేజ్ లోకి వెళ్ళి, దాని తలుపును తెరచి కారులో బయటకు వెళ్ళే ప్రయత్నం చేసాడు. అయితే ఆ ఆటోమేటిక్ గేరేజి తలుపు చెడిపోవడంతో తెరచుకోలేదు. తిరిగి ఇంట్లోకి  వెళ్దామంటే, ఇంటికి గేరేజ్ కి మధ్య ఉన్న తలుపుని అతను మూసేయడంతో తెరచు కోలేదు. అందులో చిక్కుపడ్డ ఆ దొంగ ఆ ఇంటివాళ్ళు నాలుగు రోజుల తరువాత తిరిగివచ్చేదాక, గేరేజ్ లోని పెప్సికేన్స్, డాగ్ ఉడ్ లతో బ్రతికాడు. ఇంటివాళ్ళు తిరిగి వచ్చాక బలహీనపడిపోయిన ఆ దొంగని పోలీసులకి పట్టించారు.
 

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం