నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!
______________________________________________________________________
లండన్ లోని ఓ ఇంట్లోని ఓ ఇంజనీర్ ని దంగలు కట్టేసి మొత్తం దోచుకున్నారు. సమాచారం అందుకుని వచ్చిన పోలీసులకు ఆ ఇంట్లో పెంచుకున్న మేరిజానా చెట్లు కనబడ్డాయి. ఆ దొంగలు పట్టుబడలేదు. కానీ ఆ బాధితుడు పి.సి. నికోలన్ కి మాత్రం మేరిజాని పెంచుకున్నందుకు శిక్షింపబడింది.
సే న్ ఫ్రాన్సిస్కో కి చెందిన ఓ దొంగ బేంక్ ఆఫ్ అమెరికాలో కి వెళ్ళి "ఇది దొంగతనం. నీ దగ్గరున్న డబ్బంతా సంచీలో ఉంచు." అని రాసిన కాగితాన్ని ఓ కేషియర్ కి ఇచ్చాడు. దాన్ని చదివిన కేషియర్ నవ్వి, ఆ నోటె లోని స్పెల్లింగ్ తప్పులని దిద్ది వెనక్కిచ్హేసింది. దాంతో అవాక్కయిన ఆ దొంగ ఆ బెంక్ లోంచి బయటకు వచ్చి, రోడ్డు దాటి ఎదురుగా ఉన్న వెల్స్ ఫార్గో అనే ఇంకో బేంక్ లో కి వెళ్ళి, అక్కడి కేహియర్ కి ఆ నోటె ను ఇచ్చాడు. దాన్ని చదివిన ఆ కేషియర్ బదులు చెప్పింది.
"సారి బ్రదర్. నేను నీకు డబ్బు ఇవ్వలేను. ఈ నోటుని నువ్వు బేంక్ ఆఫ్ అమెరికా డిపాజిట్ స్లిప్ మీద రాసావు తప్ప మా బేంక్ డిపాజిట్ స్లిప్ మీద కాదు"
దాంతో అతను స్పృహ చెంది, ఆ కాగితం తీసుకుని మళ్ళీ రోడ్డు దాటి బేంక్ ఆఫ్ అమెరికా కేషొయర్ దగ్గర ఉన్న క్యూ లో కి వెళ్ళి నిలబడ్డాడు. ఈ లోగా వెల్స్ ఫోర్గో కేషియర్ పోలీసులకి ఫోనె చేయడం తో వాళ్ళు వచ్చి క్యూ లో ఉన్న ఆ దొంగని అరెస్ట్ చేసారు.