
తొలకరిలో
మట్టివాసన
ఏ అత్తరు
పనికొస్తుందండీ!
రాజకీయాల్లో
జలం ప్రవేశం
ఎవడు మునుగుతాడో
తేలే దెవడో!
వర్షం కురిస్తే
ఆనందమే
వరద పామై
కాటు వేయనంతవరకు
ఖాళీగా ఉన్నావా
మిత్రమా!
ఇక మనసుపైన
ఆలోచనల వాన
కాషాయమా!
నీకెంత మహిమ
కష్టపడ్డా దొరకంది
కాళ్ళ కాడికొచ్చింది
సూర్యుడు
ప్రతిరోజూ
మా అమ్మ నుదుటనే
ఉదయిస్తాడు మరి!