
ఇది ఎంటియార్ వారం. ఎందుకంటే మే 28 వారి జయంతి. తెలుగువారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుని, తెలుగువారి ఉనికికి ఒక చిరునామానిచ్చిన నందమూరి తారక రామునికి గోతెలుగు నివాళి.
తెరవేల్పు తీరుగా తేజమై విరజిమ్మి
వెండితెరను దోచె "వేటగాడు"
తెగువ సిరిని చూపు తెలుగువాడికి ఆస్తి
ఆత్మగౌరవమన్న "అగ్గిపిడుగు"
ఆంధ్రజగతిలోన అభిమానహృదయాలు
పగులగొట్టి పరగె "బందిపోటు"
రాజనీతినెరిగి రాజ్యాంగ విధులనే
చిరునవ్వుతొనొనర్చె "సింహబలుడు"
భవిత బాట చూపే "భాగ్యరేఖ"యతడు
"నిప్పులాంటి మనిషి" నిజము నిజము
కృషిని చాటు ఋషిగ కీర్తిగాంచెనతడు
"ఎదురులేని మనిషి" ఎంటియారు
-సిరాశ్రీ