
ఆయన కళ్ళల్లో
ఎంత కాంతి!
స్వార్ధం లేకుంటే
అదంతే!!
మరుగౌతున్నప్పుడు
కొత్త ఉద్యమం
ఉనికి నిలవాలి
అదే రాజకీయం
సందేహం లేదు
భారీ ప్రాజెక్టులే
వాటి కింద
అవినీతి పునాదులు
రామ పాదం సోకి
రాయి మనిషయ్యె
వామన పాదం తాకి
అహం బలియయ్యె
గోడ మీద పిల్లి వాటం
ఎటైనా దూకేస్తాడు
ఎక్కింది
తడికె గోడ కదా!
వైట్ కాలర్
కార్మికులారా!
మళ్ళీ ఏకంకండి
మే దినోత్సవం నాడు