
ఎంత ప్రేమో !
తనెప్పుడూ నా ఒళ్ళోనే
ల్యాప్ టాపు....
ఎంత ప్రేమో !
ఎప్పుడూ చెవిలో ఏవో గుసగుసలు
మొబైలు...
ఎంత ప్రేమో !
నాతో ఎక్కడికైనా రెడీ
నా బైకు
ఎంత ప్రేమో !
ఎంత ప్రేమో !
బ్రెయిన్ లేకపోయినా రక్షణ
హెల్మెట్టు
ఎంత ప్రేమో !
ముక్కూ మొఖం తెలీని ఫ్రెండ్సు
ఫేసుబుక్కు..
ఎంత హాయో !
ఎన్ని పిచ్చికూతలైనా కూయచ్చు
ట్విట్టరు