సభకు నమస్కారం - ...

 

ది 20.05. 2014 తొలి తెలుగు కార్టూనిస్ట్ కీ .శే . శ్రీ తలిశెట్టి రామారావు గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని  రవీంద్ర భారతి మినీ హాల్ నందు జరిగిన ఒక కార్యక్రమం లో శ్రీ రామారావు గారు రచించిన" వలస రాజ్యము లందు భారతీయ శిల్పకళ ", "హిందీ కార్టూన్" ల సంకలనం పుస్తకాల ఆవిష్కరణ జరింగింది .ఫోటో లో ఎడమ నుండి కుడి కి వరుసగా కార్టూనిస్ట్ చక్రవర్తి , హాస్యానందం మాస పత్రిక ఎడిటర్ శ్రీ రాము, సినీ హాస్య నటులు శ్రీ గుండు సుదర్శనం, సినీ నటులు శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీ కే వీ రమణాచారి (రిటైర్డ్ ఐ ఏ ఎస్ ), శ్రీ ఆర్ కే గోనెల ( శ్రీ తలిశెట్టి రామా రావు గారి బంధువు ), శ్రీ ఎం రమణారెడ్డి (శ్రీ తలిశెట్టి రామారావు గారి రచనల పరిశోధకులు ), మరియు సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ గారులు.
**********************************************************************************************


తెలుగు తొలి కార్టూనిస్ట్  తలిశెట్టి రామారావు గారి పుట్టిన రోజుని "కార్టూనిస్టుల దినో త్సవం "పేరిట హాస్యానందం ,సమైక్య భారతి ఆంధ్రప్రదేశ్ క్రోక్విల్ వారు సంయుక్తంగా నిర్వహహించిన కార్టూన్ల పోటీలో ప్రధమ బహుమతి అందుకుంటున్న  కార్టూనిస్ట్ రామ్ శేషు. చిత్రంలో ప్రముఖ సిని నటులు శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీ కే . వి. రమణాచారి, శ్రీ మల్లిక్, శ్రీ శంకు తదితరులు ఉన్నారు .****************************************************************

 

' సాహితీకిరణం ' పత్రిక పంచమ వార్షికోత్సవం సందర్భంగా త్యాగరాయ గానసభలో 29-05-2014 నాడు జరిగిన కార్యక్రమంలో "వాడూ మనం " కవితకు గానూ శ్రీ సుధామ గారి చేతుల మీదుగా బహుమతినందుకుంటున్న ప్రతాప వెంకట సుబ్బారాయుడు. చిత్రంలో డా.ముక్తేవి భారతి, డా.పులివర్తి కృష్ణమూర్తి, డా.కళావెంకట దీక్షితులు గార్లను చూడవచ్చు.

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి